India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విజయనగరం(D) గుర్లలో తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాధి ప్రబలిందని నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. అక్కడ ప్రధాన నీటి వనరు అయిన చంపా నది తీవ్రంగా కలుషితం అవుతోందని పేర్కొంది. నీటి పైపు లైన్లు డ్రైనేజీ వ్యవస్థ గుండా వెళ్లడం, బహిరంగ మల విసర్జన, క్లోరినేషన్ చేయకపోవడం వంటి పలు సమస్యల్ని గుర్తించింది. వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి సూచనలు చేసింది.
TG: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా పడిపోయాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ‘పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి మర మనుషుల్లా చూస్తున్నారు. నెలలో వరుసగా 26 రోజులు డ్యూటీ చేస్తే 4 రోజులు సెలవులు ఇస్తామనడం దారుణం. దీనిపై పోలీసుల కుటుంబాలు నల్గొండలో ఆందోళన చేస్తే విధుల్లో ఉన్న పోలీసుల్ని సస్పెండ్ చేశారు. పోలీసుల్లో అశాంతి నెలకొంది. అది ప్రమాదకరం’ అని అన్నారు.
గాంబియాపై జరిగిన T20 మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా రికార్డు సృష్టించారు. టెస్ట్ హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ(33 బంతుల్లో) చేసిన క్రికెటర్‌గా నిలిచారు. దీంతో 35 బంతుల్లో శతకం బాదిన రోహిత్ శర్మ, మిల్లర్‌ల రికార్డును బ్రేక్ చేశాడు. ICC మెన్స్ టీ20 WC సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలియర్స్‌లో నిన్న గాంబియాపై తలపడిన జింబాబ్వే 344 పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ సాధించింది.
స్వర్గీయ రతన్ టాటా గౌరవార్థం ఆయన పేరిట ఓ భవనాన్ని నిర్మించాలని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్ణయించింది. సోమర్‌విలే కాలేజీ, టాటా గ్రూప్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలుకానుంది. ఇందులో ఆక్స్‌ఫర్డ్ ఇండియా సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్(OICSD)ని ఏర్పాటు చేస్తామని టాటా గ్రూప్ తెలిపింది. ప్రపంచాన్ని వేధించే సమస్యల పరిష్కారాలకు ఇక్కడ అధ్యయనం నిర్వహిస్తామని వివరించింది.
1930: నిర్మాత చవ్వా చంద్రశేఖర్ రెడ్డి జననం
1966: నటి నదియా జననం
1980: నటి లైలా జననం
1985: బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త లాస్లో బైరో మరణం
2015: హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు మరణం
2017: దక్షిణ భారత సినిమా దర్శకుడు ఐ.వి.శశి మరణం
✿ఐక్యరాజ్య సమితి దినోత్సవం
✿ప్రపంచ పోలియో దినోత్సవం
AP: వక్ఫ్ చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణలను వ్యతిరేకించాలని ఆలిండియా ముస్లిం లా బోర్డు, పలు ముస్లిం సంఘాలు సీఎం చంద్రబాబుని కోరాయి. ఈ మేరకు సచివాలయంలో సీఎంని కలిసి వినతిపత్రం అందించాయి. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు జలవనరుల శాఖపై సమీక్షించిన సీఎం.. 2026 మార్చి కన్నా ముందే పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించారు.
సినిమాల్లో శరీరం కనిపించేలా డ్రస్సెస్ వేసుకోకూడదని తాను నియమంలా పెట్టుకున్నట్లు నటి సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నేను జార్జియాలో మెడిసిన్ చదువుకున్నా. అక్కడ ఓసారి టాంగో డాన్స్ చేశాను. సినిమాల్లో పేరు వచ్చాక ఆ డాన్స్ వీడియో వైరల్ అయింది. రకరకాల కామెంట్స్ వచ్చాయి. బాధ అనిపించింది. స్కిన్ షో పాత్రలు చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. మనసుకు నచ్చిన పాత్రలే చేస్తున్నా’ అని వివరించారు.
తేది: అక్టోబర్ 24, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:59 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:12 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
అసర్: సాయంత్రం 4:12 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:49 గంటలకు
ఇష: రాత్రి 7.02 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
రెస్టారెంట్లలో పరిశుభ్రత, ఆహార ప్రమాణాలను ధ్రువీకరించేందుకుగాను స్విగ్గీ సీల్ అనే కొత్త సేవలను స్విగ్గీ తీసుకురానుంది. నాణ్యతా ప్రమాణాలు పాటించే రెస్టారెంట్లకు ఈ బ్యాడ్జ్‌ని స్విగ్గీ అందిస్తుంది. కస్టమర్ల నుంచి ఫిర్యాదులొస్తే ఆ బ్యాడ్జిని తొలగిస్తుంది. పరిశుభ్రతపై ఆడిట్ నిర్వహించేందుకు FSSAI గుర్తింపు పొందిన సంస్థలతో టై-అప్ అయినట్లు కంపెనీ తెలిపింది. NOV నాటికి 650 నగరాల్లో ఈ సేవలు తీసుకురానుంది.
Sorry, no posts matched your criteria.