India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: గొంతులో దోశ ఇరుక్కుని వ్యక్తి మరణించిన షాకింగ్ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. కల్వకుర్తికి చెందిన వెంకటయ్య (41) ఇంట్లో మద్యం తాగి దోశ తిన్నాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడలేదు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గతంలో కేరళలో ఇడ్లీలు తినే పోటీలో ఓ వ్యక్తి ఇడ్లీలు తింటూ ఊపిరాడక చనిపోయాడు.
ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 27 ఏళ్లుగా ఉద్యోగం చేస్తోన్న మలేషియాకు చెందిన క్లీనర్ బాకర్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కుటుంబ పోషణ, తన ముగ్గురు ఆడపిల్లలకు ఉన్నత చదువును అందించేందుకు ఆయన చేసిన శ్రమ వృథా కాలేదు. వారానికి ఏడు రోజులు పనిచేస్తూ పిల్లలను చదివించడంతో వారు న్యాయమూర్తి, డాక్టర్, ఇంజినీర్‌గా స్థిరపడ్డారు. పిల్లలు సెటిల్ అవడంతో ఇకనైనా రెస్ట్ తీసుకోవాలంటూ నెటిజన్లు ఆయన్ను కోరుతున్నారు.
విదేశాలు వెళ్లినప్పుడు పాస్‌పోర్టు కోల్పోతే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. అనంతరం సమీపంలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. ఎంబసీలో ప్రాసెస్ సమయంలో ఆ FIR ఓ సాక్ష్యంలా ఉపకరిస్తుంది. పోలీస్ రిపోర్టును కచ్చితంగా వెంట ఉంచుకోవాలి. కొత్త పాస్‌పోర్టు వచ్చేందుకు కనీసం వారం పడుతుంది. అప్పటి వరకూ ఆగడం ఇబ్బందైతే ఎంబసీ అధికారులు ఎమర్జెన్సీ సర్టిఫికెట్(EC) ఇస్తారు.
పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 20 ఓవర్లలో 344 పరుగులు చేసింది. ఇప్పటి వరకు నేపాల్ పేరిట ఉన్న 314 రన్స్‌ను బద్దలుగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లలో సికందర్ రజా 33 బంతుల్లోనే సెంచరీ(15 సిక్సులు) చేశారు. టీ20 వరల్డ్ కప్‌నకు క్వాలిఫయర్ మ్యాచులు ఆఫ్రికా దేశాల మధ్య జరుగుతున్నాయి.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి. రష్యాలోని కజన్‌లో జరుగుతోన్న బ్రిక్స్ సదస్సులో వీరు భేటీ అయ్యారు. దాదాపు ఐదేళ్ల తర్వాత వీరు సమావేశమవడం గమనార్హం. లద్దాక్‌లో ఎల్ఏసీ వెంబడి మిలిటరీ పెట్రోలింగ్‌పై రెండు రోజుల క్రితం ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.
AP: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవడి పెళ్లికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు సీఎంతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
TG: కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేటీఆర్ 30 నిమిషాల పాటు వాంగ్మూలం ఇచ్చారు. సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని జడ్జి అడగగా, సమంతతో పాటు తనపై ఆమె అతి నీచమైన <<14254371>>వ్యాఖ్యలు<<>> చేశారని అన్నారు. ఆ వ్యాఖ్యలను తన నోటితో తిరిగి చెప్పడం ఇష్టం లేదని, ఆ వ్యాఖ్యలకు సంబంధించి రాతపూర్వక ఫిర్యాదును జడ్జి ముందు ఉంచారు. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.
AP: గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అలాగే మంగళగిరి ప్రభుత్వాస్పత్రిని 100 పడకలుగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. దేవాలయ పాలకమండళ్లలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం ఇవ్వాలని, సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచాలని నిర్ణయించింది.
చిన్న యాడ్ వీడియోలో కనిపిస్తే చాలు రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. కానీ, డబ్బుల కోసం తప్పుడు పనులు చేయమంటున్నారు కొందరు స్టార్ హీరోలు. తాజాగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ పాన్ మసాలా యాడ్‌ను తిరస్కరించారు. రూ.10 కోట్లు ఇస్తామని చెప్పినా ఆయన తృణప్రాయంగా తిరస్కరించారని సమాచారం. దీంతో పాన్ మసాలా యాడ్‌కు నో చెప్పిన అల్లు అర్జున్, కార్తీక్ ఆర్యన్, యష్‌ల సరసన కపూర్ చేరారు.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ విరాట్ కోహ్లీని దాటేశారు. ఇంతకు ముందు విరాట్ 7వ స్థానంలో, పంత్ 9వ స్థానంలో ఉండగా తాజా ర్యాంకింగ్స్‌లో పంత్ ఆరో ప్లేస్‌కు చేరుకున్నారు. బంగ్లాతో సిరీస్‌లో సెంచరీ కొట్టిన రిషభ్, న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 20, 99 పరుగులతో రాణించారు. ఆ మ్యాచ్‌లో గాయపడగా, రేపటి మ్యాచ్‌లో ఆడేందుకు ఫిట్‌గానే ఉన్నారని కోచ్ గంభీర్ తాజాగా వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.