India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మహ్మద్ షమీ అందుబాటులో లేకపోతే అతని స్థానంలో మయాంక్ యాదవ్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్ బ్రెట్‌లీ సూచించారు. ‘150kmph+ వేగంతో వేసే బౌలర్‌ను ఏ బ్యాటర్ ఎదుర్కోలేరు. IPLలో యంగ్ బౌలర్లను దగ్గరుండి చూశా. మయాంక్ తన మొదటి IPLలోనే 157kmph వేగంతో వేశాడు. 135-140kmphతో వచ్చే బంతులు ఓకే కానీ 150kmph వేగాన్ని బ్యాటర్ ఫేస్ చేయలేడు. షమీకి సరైన రిప్లేస్‌మెంట్ మయాంకే’ అని అభిప్రాయపడ్డారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాను వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే హెచ్చరించింది. ఆ తుఫానుకు దానా అని నామకరణం చేసిన దేశం ఖతర్. ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) రూపొందించిన ఉష్ణమండల తుఫాను నామకరణ విధానం ప్రకారం ఖతర్ ఈ పేరు పెట్టింది. దానా అనే పదానికి అరబిక్‌లో ‘ఉదారత’ అని అర్థం.
AP: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ డ్రోన్ రంగంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు, 12,500 మందికి ఉపాధి కల్పించేలా ముసాయిదా డ్రోన్ పాలసీని ప్రకటించింది. దీనిపై కూటమి పార్టీలు, నిపుణుల సూచనలు తీసుకొని అవసరమైతే మార్పులు చేస్తామంది. నవంబర్ వరకు ఫైనల్ పాలసీని తీసుకొస్తామని చెప్పింది.
AP: దీపావళి నుంచి ప్రారంభించే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై TDP కీలక ప్రకటన చేసింది. ‘ఏటా 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ మొదలవుతుంది. 31 నుంచి సరఫరా చేస్తారు. ఒక్కో సిలిండర్‌పై రూ.851 రాయితీ ప్రభుత్వం చెల్లిస్తుంది. 2 రోజుల్లోనే వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది’ అని ఓ ఫొటోను పంచుకుంది. అటు ఇవాళ్టి క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయనుంది.
ఒంటరితనంతో ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది బాధపడుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్న యువత సైతం దీని బారిన పడుతున్నారు. అయితే ఇలా సామాజిక సంబంధాలు సరిగా లేక అసంతృప్తితో బతికేవారు డిమెన్షియా బారిన పడే అవకాశం 30% పెరిగిందని పరిశోధనలో తేలింది. 6 లక్షల మందిపై జరిపిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. డిమెన్షియాతో వ్యక్తి ఆలోచనలు, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకోవడం వంటివి ప్రభావితం అవుతాయని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో చలి మొదలైంది. తెల్లవారుజామున, లేట్ నైట్స్ చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఉన్ని దుస్తులు ధరించి చలి నుంచి రక్షణ పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల జ్వరాల బారినపడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక మధ్యాహ్నం సమయంలో ఎండ దంచుతోంది. దీంతో భిన్నమైన వాతావరణం ఉంటోంది.
TG: అన్నదాతల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 25 నుంచి 31 వరకు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆందోళనలకు పిలుపునిచ్చింది. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, అన్ని రకాల పంటలకు ₹500 బోనస్ చెల్లించాలని, 58 ఏళ్లు దాటిన ప్రతి రైతు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి ₹10వేల పెన్షన్ ఇవ్వాలని కోరింది. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో జరిగే ఆందోళనల్లో రైతన్నలు పాల్గొనాలని పిలుపునిచ్చింది.
AP: బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ రాత్రి 9గంటల్లోగా విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఆప్షన్ల నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తితే 9000780707, 8008250842 నంబర్లను సంప్రదించాలని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు.
AP: వరద ప్రభావిత జిల్లాల్లో రూ.50 వేల వరకు రుణాలు రీషెడ్యూల్ చేసుకునేవారికి, రూ.50 వేలు కొత్తగా రుణం పొందే వారికి రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ, యూజర్ ఛార్జీల చెల్లింపుల నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. VZM, ప.గో, అల్లూరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, GNT, బాపట్ల, పల్నాడు, NTR జిల్లాల వారికి ఇది వర్తిస్తుంది. ఈ ఉత్తర్వులు ఆగస్టు 30 తరువాత నుంచి 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.
TG: తన అనుచరుడు హత్యకు గురికావడంపై MLC జీవన్ రెడ్డి ధర్నా చేయడంతో పాటు పార్టీపైనా <<14422586>>అసంతృప్తి<<>> వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే అనుచరుడు చనిపోయాడనే బాధలోనే జీవన్ అలా మాట్లాడారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి MLAలు వచ్చిన చోట ఇబ్బందులను పరిష్కరిస్తాం. జీవన రెడ్డి అంశాన్ని మంత్రి శ్రీధర్ బాబుకి అప్పగించాం’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.