India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రేపు మధ్యాహ్నం ‘Big Expose’ అంటూ ప్రకటించిన TDP తాజాగా సంచలన ట్వీట్ చేసింది. ఆస్తుల విషయంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాటను జగన్ తప్పినట్లు షర్మిల, విజయమ్మ లేఖ రాశారని పోస్ట్ చేసింది. ‘ఆస్తులన్నింటినీ నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలనే YSR షరతుకు అంగీకరిస్తున్నానని చెప్పి, మరణం తర్వాత మాట తప్పారు’ అని వారు ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది. చెల్లిని దారుణంగా మోసం చేశారని విమర్శించింది.
TG: ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అంశాల్లో ప్రధాన నేతలపై చర్యలుంటాయన్నారు. ఎంతటి వాళ్లైనా తప్పు చేస్తే తప్పించుకోలేరని, సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్ధం అయ్యాయని స్పష్టం చేశారు. తాము రాజకీయ కక్షసాధింపులకు పాల్పడబోమని, ఆధారాలతోనే ముందుకెళ్తామని పొంగులేటి పేర్కొన్నారు.
బ్రిక్స్ సదస్సులో పాక్‌కు షాక్ తగిలింది. తన మిత్రదేశం చైనా కీలక సభ్యదేశమైనప్పటికీ ఇస్లామాబాద్‌ను బ్రిక్స్ విస్తరణలో పరిగణించలేదు. భారత్ వ్యతిరేకించడంతో రష్యాలో జరుగుతున్న సదస్సులో పాక్ ప్రతినిధికి స్థానం కూడా దక్కలేదు. బ్రిక్స్ విస్తరణలో ఇప్పటికే ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, UAE, సౌదీ అరేబియా చేరాయి. తుర్కియే, అజర్‌బైజాన్, మలేషియా దరఖాస్తు చేసుకున్నాయి.
దీపావళి పండుగను ఏటా ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు. వేద క్యాలెండర్ ప్రకారం ఈసారి అక్టోబర్ 31న మ.3.52 గంటలకు అమావాస్య ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య నవంబర్ 1 సా.6.16 ని.కు ముగుస్తుంది. దీని ప్రకారం 31న సా.5.36 నుంచి 6.16 వరకు లక్ష్మీ పూజ ముహూర్తం ఉంది. ప్రభుత్వం కూడా 31నే సెలవు ఇచ్చింది. అయితే దృక్ పంచాంగం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 1న దీపావళి జరుపుకోనున్నారు.
AP: దిశ చట్టం, శాంతి భద్రతలపై డిబేట్‌కు రావాలని YS జగన్‌కు మంత్రి లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ‘జగన్ తన పార్టీ నేతలు, తన మీడియాతో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నాడు. దిశ చట్టాన్ని నిలిపివేశామని అంటాడు. అసలు ఆ చట్టమే లేదు. YCP హయాంలో నేరాలు భారీగా పెరిగాయి. YCP పోలీస్ వ్యవస్థను ప్రతిపక్షాలను హింసించడానికి వాడింది. వీటిపై డిబేట్‌కు రాకుంటే తాను ఫేక్ అని జగన్ ఒప్పుకున్నట్లే’ అని ట్వీట్ చేశారు.
రేపు మ.12 గంటలకు నేషనల్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు ‘పుష్ప-2’ మేకర్స్ ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ యూట్యూబ్ ఛానల్‌లో ఈ ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిపారు. ఇందులో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
టర్కీలో ముంబై తరహా ఉగ్రదాడి జరిగింది. అంకారాలోని ఏవియేషన్ కంపెనీలో ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. అక్కడ బాంబు దాడి కూడా జరిగిందని, ఉగ్రవాదులు పలువురిని బంధించారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
పై ఫొటోలో బోసినవ్వులు చిందిస్తున్న వ్యక్తి పేరు ఎపిమాకో అమాన్‌చియో. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆయన ఊళ్లో మొక్కలు నాటుతుండేవారు. 2010లో 37మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ బస్సు, ఆ ఊరి లోయలో పడకుండా ఎపిమాకో నాటిన ఓ చెట్టు కాపాడింది. దాన్ని ఆయన 1975లో నాటడం విశేషం. ఆ సమయంలో తను నాటిన చెట్టు ముంగిట నిల్చుని పెద్దాయన తీసుకున్న ఫొటో ఇది. తాజాగా నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన ఆస్తుల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆయన నికర ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైనే ఉంటుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఆయన కేవలం సినిమాల ద్వారానే ఆదాయాన్ని పొందుతారని, ప్రకటనలకు ఆమడ దూరంలో ఉంటారని వెల్లడించాయి. ప్రస్తుతం రూ.100 కోట్లకుపైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆయన ఇప్పటివరకు 23 సినిమాలు చేశారు. ఆయనకు రూ.కోట్ల విలువైన కార్లు, బంగ్లాలున్నాయి.
TG: షావర్మా, ఫ్రైడ్ చికెన్, పిజ్జాపై మెయనైస్ వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే పచ్చిగుడ్డుతో తయారుచేసే మెయనైస్ వల్ల ఈ ఏడాది HYDలో 10 ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తెల్లగా, క్రీమ్‌లాగా ఉండే మెయనైస్‌లో హానికర సూక్ష్మక్రిములు ఉంటాయని, దాన్ని బ్యాన్ చేయాలని కోరారు. కాగా ఇప్పటికే మెయనైస్‌పై కేరళ సర్కారు నిషేధం విధించింది.
Sorry, no posts matched your criteria.