news

News October 22, 2024

విద్యార్థుల ఫుట్ బోర్డు ప్ర‌యాణం.. స్పందించిన TGSRTC

image

ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే రూట్ల‌లో బ‌స్సుల‌ సంఖ్య‌ను పెంచాల‌ని నిర్ణయించినట్లు TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందుకోసం చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులో కొందరు విద్యార్థులు <<14425042>>ఫుట్ బోర్డు ప్రయాణం<<>> చేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థుల‌ను క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర్చేందుకు ఆర్టీసీ యాజ‌మాన్యం క‌ట్టుబ‌డి ఉందని, ఫుట్ బోర్డు ప్ర‌యాణం చేయ‌కుండా స‌హ‌క‌రించాల‌ని కోరారు.

News October 22, 2024

లింగ సమానత్వం గురించి కొడుకులకు తల్లులే చెప్పాలి: కరీనా

image

ఆడపిల్లలను ఎలా గౌరవించాలనే విషయాన్ని అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలని కరీనా కపూర్ చెప్పారు. కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారంపై ఆమె NDTV సమ్మిట్‌లో స్పందించారు. ‘లింగ సమానత్వం గురించి బాయ్స్‌కు 4-5 ఏళ్ల నుంచే ఇంట్లో నేర్పించాలి. అసౌకర్యంగా ఉన్నప్పటికీ తల్లులే ఈ విషయాలపై వారితో మాట్లాడాలి. నా కొడుకులు తైమూర్(7), జహంగీర్(3)కు కూడా నేను ఆడపిల్లలను గౌరవించడం గురించి చెబుతా’ అని పేర్కొన్నారు.

News October 22, 2024

పుట్టిన బిడ్డకు దేశ జెండాతోనే తొలి దుస్తులు

image

రష్యా విచిత్ర నిర్ణయం తీసుకుంది. పుట్టిన బిడ్డలకు మొదటిసారి దేశ జెండా రంగులతో ఉన్న దుస్తులనే వేయాలని ప్రతిపాదించింది. ‘మీరు రష్యాలో జన్మించారు. మీరు దేశానికి అవసరం, ముఖ్యమైనవారు. పుట్టినప్పటి నుంచి దేశాన్ని ప్రేమిస్తున్నారని చాటి చెప్పడానికే ఈ ప్రయత్నం’ అని ఎంపీ టట్యానా తెలిపారు. దేశ భక్తి ముఖ్యమే అయినప్పటికీ ఇంత చిన్న వయసులో ఇలాంటి చర్యలు అవసరమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

News October 22, 2024

గ్రూప్-2, గ్రూప్-3 వాయిదా వేయాలి: CMకు SC విద్యార్థుల లేఖ

image

TG: SC వర్గీకరణ అమలయ్యేంత వరకు గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను వాయిదా వేయాలని SC విద్యార్థులు CM రేవంత్‌కు లేఖ రాశారు. ఎస్సీ సామాజిక వర్గ ఉపకులాలకు రిజర్వేషన్లు దక్కేలా చేయాలని, వర్గీకరణ అమలు తర్వాత పరీక్షలు నిర్వహించి తమకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, దీనిని అమలు చేస్తామని CM అసెంబ్లీలో ప్రకటించారన్న విషయాన్ని గుర్తుచేశారు.

News October 22, 2024

మరోసారి బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్న దర్శన్

image

కన్నడ సినీ నటుడు దర్శన్ మరోమారు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు అనారోగ్యంగా ఉందని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు. నడుం నొప్పి చాలా తీవ్రంగా ఉందని, సర్జరీ చేస్తే తప్ప కోలుకోలేరని బెయిల్ పిటిషన్లో తెలిపారు. దర్శన్, పవిత్ర గౌడ్ ఇంతకు ముందు దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 14న తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. తన అభిమాని రేణుకాస్వామి మర్డర్ కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు.

News October 22, 2024

IAS లోతేటి శివశంకర్‌కు సుప్రీంకోర్టులో షాక్

image

AP: ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్యాడర్ విభజనలో తనకు అన్యాయం జరిగిందని డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను ఆయన సవాల్ చేశారు. తనను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన జీవోను నిలిపివేయాలని SCలో పిటిషన్ వేశారు. క్యాట్, హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.

News October 22, 2024

గ్రూప్-1 మెయిన్స్: రెండో రోజు 69.4% హాజరు

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు రెండో రోజు 69.4% హాజరు నమోదైంది. ఇవాళ జరిగిన పేపర్-1 జనరల్ ఎస్సే పరీక్షను 21,817 మంది అభ్యర్థులు రాశారని అధికారులు ప్రకటించారు. మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించగా, నిన్న తొలి రోజు 72.4% హాజరు నమోదైన సంగతి తెలిసిందే.

News October 22, 2024

BREAKING: ఫలితాలు విడుదల

image

TG: రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్టును TGPSC వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. 1,392 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇప్పటికే పూర్తి కాగా, తాజాగా తుది ఫలితాలను విడుదల చేశారు.

News October 22, 2024

PHOTO: ఒళ్లు గగుర్పొడిచే ఘటన

image

ఇరుకైన ప్రదేశం/గుహలో ఇరుక్కుపోతేనే మనం అల్లాడిపోతాం. అలాంటిది ఇరుకైన బండరాళ్ల సందులో తలకిందులుగా ఉండిపోతే? ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా? తాజాగా ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువతికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. రెండు బండరాళ్ల మధ్య పడిన ఫోన్‌ను తీసుకునే ప్రయత్నంలో ఇరుక్కుపోయింది. ఆమె ఫ్రెండ్ వెంటనే రెస్క్యూ బృందాలకు సమాచారం అందించగా 7 గంటల శ్రమ తర్వాత బయటికి తీసుకొచ్చారు.

News October 22, 2024

BSNL కొత్త లోగో.. మరిన్ని సేవలు ప్రారంభం

image

ప్రైవేటు టెలికం సంస్థ‌ల టారిఫ్‌ల పెంపుతో అనూహ్యంగా పుంజుకున్న BSNL వినియోగ‌దారుల‌కు మ‌రింత చేరువ‌య్యే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. కొత్త బ్రాండ్ లోగోతో Connecting Bharat – Securely, Affordably, and Reliably నినాదంతో ముందుకొచ్చింది. కొత్త లోగోను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆవిష్క‌రించారు. అలాగే స్పామ్ ఫ్రీ నెట్‌వర్క్, Wi-Fi రోమింగ్, డైరెక్ట్ టు డివైజ్ కనెక్టివిటీ సేవల్ని ప్రారంభించింది.

error: Content is protected !!