news

News October 23, 2024

ఆ విషయంలో మోదీ బాటలో నడుస్తా: కేటీఆర్

image

TG: తనకు నోటీసులు పంపిస్తానన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ <<14431823>>వ్యాఖ్యలపై<<>> కేటీఆర్ స్పందించారు. ‘బండి సంజయ్ నాకు లీగల్ నోటీసు ఇస్తే నేను ఆయనకు మళ్లీ లీగల్ నోటీస్ పంపిస్తా. రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ లీగల్ నోటీసు ఇవ్వలేదా? లీగల్ నోటీసుల విషయంలో నరేంద్ర మోదీ బాటలో నడుస్తా’ అని అన్నారు.

News October 23, 2024

ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్

image

భారీ విజయం అందుకున్న ‘సలార్’కు సీక్వెల్‌గా రాబోతున్న ‘సలార్-2’ షూటింగ్ స్టార్ట్ అయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దాదాపు 20 రోజుల పాటు కొనసాగే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొంటున్నారని, బర్త్ డే సందర్భంగా ఈ న్యూస్ అభిమానుల్లో మరింత జోష్ నింపుతుందని తెలిపాయి. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా ప్రభాస్ సరసన శ్రుతి, ప్రధాన పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.

News October 23, 2024

APPSC ఛైర్మన్‌గా అనురాధ

image

AP: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అనురాధ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అనురాధ ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ సెక్రటరీగా పని చేశారు.

News October 23, 2024

నేడు పీఎం మోదీ, జిన్‌పింగ్ భేటీ

image

భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఐదేళ్ల తర్వాత తొలిసారిగా ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్నారు. బ్రిక్స్ సదస్సు కోసం ఇరు దేశాధినేతలు రష్యాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఇరువురూ అక్కడ సమావేశం కానున్నారు. తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఒప్పందానికి వచ్చామని చైనా, భారత్ ఇటీవలే ప్రకటించాయి.

News October 23, 2024

సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై కేంద్రం మండిపాటు

image

విమానాలకు ఫేక్ బాంబు బెదిరింపుల విషయంలో సోషల్ మీడియాపై కేంద్రం తీవ్రంగా మండిపడింది. బెదిరింపులు ఎక్కువగా X, Fb వంటి ప్లాట్‌ఫాంల ద్వారానే జరగడం, వ్యాప్తి చెందడంతో నియంత్రణ చర్యలపై కేంద్రం ప్రశ్నల వర్షం కురిపించింది. కట్టడికి తీసుకున్న చర్యలు వివరించాలంది. విమానయాన, సోషల్ మీడియా సంస్థలతో భేటీలో కేంద్ర IT శాఖ ఉన్నతాధికారి సంకేత్ ‘మీరు నేరాల్ని ప్రోత్సహిస్తున్నట్లు అన్పిస్తోంది’ అని Xపై ధ్వజమెత్తారు.

News October 23, 2024

వేలంలోకి రిషభ్ పంత్? RCB తీసుకుంటుందా?

image

IPL మెగా వేలంలోకి DC కెప్టెన్ పంత్ వచ్చే అవకాశముందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని DC మేనేజ్‌మెంట్ అనుకోవట్లేదని, దీంతో వేలంలోకి రావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. వేలంలోకి వస్తే ఆయన్ను తీసుకోవాలని RCB భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేఎల్ రాహుల్‌ను LSG, శ్రేయస్‌ను KKR వదులుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో వారంలో స్పష్టత రానుంది.

News October 23, 2024

ఉచిత గ్యాస్ సిలిండర్.. అమలు ఇలా..

image

AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 సిలిండర్లు కాకుండా 4 నెలలకొకటి ఇవ్వాలని నిర్ణయించింది. సిలిండర్‌కు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో ఆ సబ్సిడీ మొత్తం ఖాతాల్లో డిపాజిట్ కానుంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.రూ.876 ఉండగా కేంద్రం సబ్సిడీ రూ.25 పోను మిగిలిన రూ.851 చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి రూ.2,553 ఖాతాల్లో జమ కానున్నాయి.

News October 23, 2024

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

image

*దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు
*ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దు
*పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు ఆమోదం
*ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులకు చోటు
*శారదా పీఠం భూకేటాయింపుల రద్దు
*ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల్లో అక్రమాలపై చర్యలకు కమిటీ

News October 23, 2024

వారానికి 100 గంటలు పనిచేయాలి: మస్క్

image

పని ఒత్తిడి, అధిక పని గంటలతో శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వారానికి 100 గంటలు పని చేస్తేనే వేగంగా విజయాన్ని పొందొచ్చని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ‘మీరు వారానికి 100 గంటలు పనిచేస్తే ఇతరులు 50 గంటలు పనిచేసిన దానికంటే రెట్టింపు ఫలితం సాధిస్తారు. నేను, నా సోదరుడు రాత్రుళ్లు కోడింగ్ చేసేవాళ్లం’ అని తెలిపారు. దీనిపై మీకామెంట్?

News October 23, 2024

షర్మిల, విజయమ్మపై జగన్‌ పిటిషన్‌

image

సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో వాటాల కేటాయింపుపై సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై Y.S.జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. మొదట్లో సోదరి అనే భావనతో షర్మిలకు వాటాలు కేటాయించాలని భావించానని, అయితే ఇటీవల రాజకీయంగా తనకు వ్యతిరేకంగా మారడంతో ఆ ఆఫర్‌ను విరమించుకున్నానని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. NCLT ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను Nov 8కి షెడ్యూల్ చేసింది.

error: Content is protected !!