news

News October 22, 2024

BRICS SIDELINES: మోదీ, జిన్‌పింగ్ భేటీ కాబోతున్నారా!

image

BRICS సదస్సు కోసం రష్యా వెళ్లిన PM నరేంద్ర మోదీతో చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఇప్పటికే దీనిపై హింట్ ఇవ్వడం గమనార్హం. ఏర్పాట్లపై ఫోకస్ పెట్టామన్నారు. గల్వాన్ లోయలో 2 దేశాల సైనికుల బాహాబాహీ తర్వాత జిన్‌పింగ్‌ను కలిసేందుకు మోదీ ఆసక్తి చూపలేదు. నిన్ననే LAC వద్ద డిస్‌ఎంగేజ్‌మెంట్ ఫైనలైజ్ అవ్వడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

News October 22, 2024

CRPF స్కూళ్లకు బాంబు బెదిరింపులు

image

దేశ వ్యాప్తంగా ఉన్న CRPF స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ వచ్చాయి. ఇది ఆకతాయిలు చేసిన పనిగా తెలుస్తున్నప్పటికీ ఇటీవల ఢిల్లీలోని ఓ స్కూల్‌లో పేలుడు ఘటన కారణంగా ఆందోళన నెలకొంది. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను క్లాస్ రూమ్స్‌లో అమర్చినట్లు ఆ మెయిల్స్‌లో ఉంది.

News October 22, 2024

ఆ బ్లాంకెట్లు నెలకు ఒకసారే ఉతుకుతారు!

image

ట్రైన్స్‌లోని ఏసీ కోచుల్లో అందించే బ్లాంకెట్స్‌ను నెలకు ఒకసారి మాత్రమే ఉతుకుతారని ఆర్టీఐలో వెల్లడైంది. ఉన్ని దుప్పట్లను నెలకు ఒకసారి, కొన్నిసార్లు రెండుసార్లు అందుబాటులో ఉన్న సామర్థ్యం మేరకు ఉతుకుతామని రైల్వే శాఖ RTI ద్వారా TNIEకి తెలిపింది. గరీబ్ రథ్, దురంతో వంటి రైళ్లలో దుప్పట్లకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. దీంతో నిత్యం ప్రయాణికులు వాడేవాటిని ఉతక్కపోవడం ఏంటని నెటిజన్లు ఫైరవుతున్నారు.

News October 22, 2024

మూసీ కాంట్రాక్టు పొంగులేటికేనా?

image

TG: ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవం కాంట్రాక్టును మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. అందుకే కొరియాలో పర్యటిస్తున్న బృందంలో పొంగులేటి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది.

News October 22, 2024

ప్రీరిలీజ్ బిజినెస్‌లో రూ.1000 కోట్లు దాటిన ‘పుష్ప-2’!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్‌లో అప్పుడే రూ.1000 కోట్లు దాటేసిందని సినీవర్గాలు పేర్కొన్నాయి. కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే రూ.640 కోట్లు, OTT రైట్స్‌కు రూ.275 కోట్లు, మ్యూజిక్ రైట్స్‌కు రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్‌కు రూ.85 కోట్లు రావడంతో మొత్తం రూ.1065 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిపాయి.

News October 22, 2024

మెడిసిన్‌కు అలవాటు పడితే?

image

పెయిన్ కిల్లర్స్‌తో తక్షణ ఉపశమనం పొందినా రెగ్యులర్‌గా తీసుకుంటే ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాత్కాలిక నొప్పులను తగ్గించేందుకు వాడితే దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (NSD) మెడిసిన్ వాడకం వల్ల కిడ్నీ, కాలేయ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. వైద్యుల సూచనతో వీటి వాడకాన్ని కొంత సమయానికే పరిమితం చేయాలని సూచిస్తున్నారు.

News October 22, 2024

యాదాద్రిలో ఫొటోలు, వీడియోలు వద్దు: ఈవో

image

TG: యాదాద్రి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎవరూ ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడం మంచిది కాదని ఆలయ ఈవో భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌రెడ్డి చేసిన ఇన్‌స్టా రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ఈవో ఇలా స్పందించారు. ఆలయంలో ఇలా వీడియోలు తీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని ఆయన కోరారు.

News October 22, 2024

బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి, రేపటికి తుఫాన్‌గా మారనుంది. ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ గురువారం తీవ్ర తుఫాన్‌గా బలపడుతుంది, ఆ తర్వాత ఒడిశాలోని పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

News October 22, 2024

షా, ఫడ్నవీస్‌తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ.. మహారాష్ట్రలో సంచలనం!

image

మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముంబైలో అమిత్ షా సమక్షంలో DY CM దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన UBT నేతలు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ కలిశారన్న వార్తలు సంచలనంగా మారాయి. వీరు మహాయుతిలో చేరతారేమోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ఈ భేటీ వార్తలను రౌత్ కొట్టిపారేసినా ఎక్కువ సీట్లను రాబట్టేలా MVAను బెదిరించేందుకు SS UBT ఇలాంటి ఫీలర్లు వదులుతోందన్న విమర్శలూ వస్తున్నాయి. దీనిపై మీ కామెంట్.

News October 22, 2024

హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్షసాయి

image

యూట్యూబర్ హర్షసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. లైంగిక ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు హర్షసాయి తనను లైంగికంగా వేధించారని నటి మిత్రా శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. కాగా బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది.

error: Content is protected !!