India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లా పొన్నెకల్లులో పర్యటించనున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా అక్కడున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం లబ్ధిదారులతో వర్చువల్ సమావేశంలో మాట్లాడతారు. తర్వాత P-4 కార్యక్రమంలో పాల్గొని మార్గదర్శి-బంగారు కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు.
ఎండాకాలంలో నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ప్రతిరోజూ డైట్లో ఉండేలా చూసుకోవాలి. మద్యం, కాఫీ, టీ, ధూమపానానికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. మసాలాలు తగ్గిస్తే గ్యాస్ట్రబుల్ సమస్య దరిచేరదు. చికెన్, మటన్ తదితర నాన్‌వెజ్ వంటకాలకు దూరంగా ఉంటే బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. 2 పూటల స్నానం చేస్తే చెమట వల్ల వచ్చే ఫంగస్ సమస్యలను దూరం చేయొచ్చు.
TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. CM రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు ధరణిలో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతిలో జరగనున్నాయి. రాష్ట్రమంతటా ఒకేసారి ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించింది. అందువల్ల తొలుత తిరుమలగిరి సాగర్, కీసర, సదాశివపేట మండలాల్లో అమలు చేయనుంది.
IPLలో ఇవాళ LSG, CSK తలపడనున్నాయి. ఇప్పటి వరకు వీటి మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా లక్నో మూడింటిలో గెలిచింది. ఓ మ్యాచ్‌లో CSK విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో రిజల్ట్ రాలేదు. కూతురికి అనారోగ్యం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ ఇవాళ్టి మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఆడిన 6 మ్యాచుల్లో 5 ఓటములతో పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న CSK ఇవాళ కూడా ఓడితే ఫ్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్లే.
* అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న MPలోని మోవ్‌లో జన్మించారు.
* విదేశాల్లో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందిన తొలి ఇండియన్
* స్వాతంత్ర్యం తర్వాత మన దేశానికి తొలి న్యాయ మంత్రి
* రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా సేవలు
* 64 సబ్జెక్టుల్లో మాస్టర్, ఆ తరంలో అత్యంత విద్యావంతులు
* అణగారిన వర్గాలకు విద్య, అంటరాని వారికి సమాన హక్కుల కోసం పోరాటాలు
* 1956 DEC 6న ఢిల్లీలో కన్నుమూశారు.
సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో బాధపడుతూ ఐపీఎల్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవాలని సీఎస్కే యాజమాన్యం భావిస్తోంది. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ఆయుష్ మాత్రేలపై ఫ్రాంచైజీ దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో ఒకరిని జట్టులోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు టాక్. మరి వీరిలో ఎవరు సీఎస్కేకు అవసరమో కామెంట్ చేయండి.
పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే డబ్బు పాఠాలు నేర్పాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అడిగినంత డబ్బులిస్తే ఆర్థిక క్రమశిక్షణ కొరవడుతుంది. పిల్లలు అవసరానికే కొంటున్నారా? ఆకర్షణకు లోనై ఖర్చు చేస్తున్నారా? అనే విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఖర్చు, పొదుపు మధ్య తేడాను వివరించాలి. పొదుపుతో కలిగే లాభాలు చెబితే ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ఉన్నంతలో ఎలా జీవించాలో నేర్పిస్తే భవిష్యత్తు బాగుంటుంది.
టీమ్ఇండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ మరోసారి ICC మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైనట్లు ICC వెల్లడించింది. ఈ కమిటీలో VVS లక్ష్మణ్ తిరిగి ప్యానెల్ మెంబర్‌గా చేరారు. వీరితో పాటు హమీద్ హసన్(AFG), డెస్మండ్ హేన్స్(WI), టెంబా బావుమా(SA), జోనాథన్ ట్రాట్(ENG) కమిటీలో ఉన్నారు. గంగూలీ మూడేళ్లు ఈ పదవిలో కొనసాగనున్నారు. దాదా తొలిసారి 2021లో క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా నియామకమైన విషయం తెలిసిందే.
* కీరదోసలోని 96% నీటి వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు.
* అంతర్గత వాపు, కండరాల నొప్పిని తగ్గిస్తుంది.
* పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
* చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది.
* నోటి దుర్వాసన తగ్గడంతో పాటు శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది.
* బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస మంచి ఆయుధం.
* కీరలోని డైయూరిటిక్ గుణాలు మూత్రం ద్వారా టాక్సిన్స్ బయటకు పంపుతాయి.
US అధ్యక్షుడు ట్రంప్ ఎలక్ట్రానిక్ వస్తువులపై ఇచ్చిన టారిఫ్‌ల మినహాయింపు కొద్ది రోజులే అని తెలుస్తోంది. త్వరలోనే వాటితో పాటు ఔషధాలపైనా టారిఫ్ బాంబ్ పేల్చనున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లు తదితర వస్తువులు ప్రత్యేక సుంకాల పరిధిలోకి వస్తాయని ఆ దేశ వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ వెల్లడించినట్లు తెలిపింది. 2 నెలల్లో కొత్త సుంకాలు విధించనున్నట్లు వివరించింది.
Sorry, no posts matched your criteria.