India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించినట్లు లోకేశ్ Xలో తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని అన్నారు.
సుదీర్ఘ కాలం ఫిట్‌గా ఉండాలని సర్ఫరాజ్ ఖాన్ భావిస్తున్నారని భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ విషయంలో ఖాన్‌కు రిషభ్ పంత్ సహాయం చేస్తున్నారన్నారు. ‘ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయానికి ఫిట్‌గా అవ్వాలని సర్ఫ్ భావిస్తున్నారు. దాని కోసం పంత్ ఆయనకు ఓ వంటమనిషిని ఏర్పాటు చేశారు’ అని వెల్లడించారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఖాన్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: అక్టోబర్ 21, సోమవారం
పంచమి: రాత్రి 2.29 గంటలకు
రోహిణి: ఉదయం 6.50 గంటలకు
మృగశిర: తెల్లవారుజామున 5.50 గంటలకు
వర్జ్యం: మధ్యాహ్నం 12.12- 01.44 గంటల వరకు దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.15-01.01 గంటల వరకు
2) మధ్యాహ్నం 2.35- 3.21 గంటల వరకు
☛ రేపు యథావిధిగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
☛ హైదరాబాద్‌ను రోల్ మోడల్‌గా మార్చాలి: సీఎం రేవంత్
☛ రేవంత్ హిందూ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు: కిషన్‌రెడ్డి
☛ బద్వేల్ ఘటన.. నిందితుడికి కఠిన శిక్ష పడాలి: సీఎం చంద్రబాబు
☛ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది: జగన్
☛ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు: మంత్రి నాదెండ్ల
☛ మహిళల టీ20 WC విజేతగా న్యూజిలాండ్
☛ తొలి టెస్టులో INDపై NZ విజయం
న్యూజిలాండ్‌లోని డునెడిన్ ఎయిర్‌పోర్టు ఆసక్తికర నిబంధన తీసుకొచ్చింది. సెండాఫ్ ప్రాంతంలో 3 నిమిషాలకు మించి హగ్ చేసుకోకూడదని కండీషన్ పెట్టింది. మరీ బెంగగా ఉన్నవారు కారు పార్కింగ్‌లోనే కౌగిలింతలు పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని, కానీ ఒక హగ్‌కు 20 సెకన్ల వ్యవధి చాలని ఎయిర్ పోర్ట్ సీఈఓ డేనియెల్ డి బోనో స్పష్టం చేశారు.
నిద్రలో కళ్లు వేగంగా కదులుతుండే దశ(REM), నెమ్మదిగా కదిలే దశ(NREM) ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. వాటిలోనూ మూడు ఉప దశలున్నాయి. తొలి ఉప దశ పేరు N1. అప్పుడప్పుడే నిద్ర పడుతున్న సమయమిది. ఇక రెండోది N2. గుండె వేగం, శరీర ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. మూడో ఉప దశను N3గా పిలుస్తారు. ఇది లోతైన నిద్ర. ఈ దశలో మనిషి మత్తుగా పడుకుంటాడు. N3లో ఎక్కువ సేపు ఉంటే అలసట ఉండదని పరిశోధకులు వివరించారు.
మహిళల టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా న్యూజిలాండ్ అవతరించింది. ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 32 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 158/5 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన సఫారీ జట్టు 20ఓవర్లలో 126/9 మాత్రమే చేసింది. దీంతో న్యూజిలాండ్ తొలి టీ20 వరల్డ్ కప్ అందుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఆరుసార్లు, ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కోసారి T20 WC సాధించాయి.
బెంగాల్‌లో జూడాలు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. అయితే తమ నిరాహార దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. కోల్‌కతా లేడీ ట్రైనీ డాక్టర్ రేప్&మర్డర్ కేసులో న్యాయం చేయాలని కోరుతూ వాళ్లు దీక్ష చేస్తున్నారు. అయితే వారి డిమాండ్లలో చాలావరకు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం మమత అంటున్నారు. కాగా హెల్త్ సెక్రటరీని తొలగించేందుకు మాత్రం ఆమె ఒప్పుకోకపోవడంతో వివాదానికి ముగింపు పడట్లేదు.
Sorry, no posts matched your criteria.