India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అమరావతికి ప్రతిపాదించిన ₹15,000Cr అప్పులో ప్రపంచ బ్యాంక్, ADB ₹13,600Cr, కేంద్రం ₹1,400Cr ఇవ్వనున్నాయి. ఈ అప్పును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని, కేంద్రం 9.33 శాతమే భరిస్తుందని సమాచారం. అప్పు కాలపరిమితి 50ఏళ్లు ఉండొచ్చని, డాలర్ విలువకు అనుగుణంగా భారం పెరగనుందని తెలుస్తోంది. అందుకే అంతర్జాతీయ సంస్థల కంటే దేశీయ సంస్థల నుంచి తీసుకునే అప్పులే ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు.
TG: గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దోచుకుందో చర్చించేందుకు తాను సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రజల ముందు చర్చ పెడుదామని సవాల్ విసిరారు. హరీశ్ సవాల్‌కు సీఎం రేవంత్ రావాల్సిన అవసరం లేదని, తానే స్వీకరిస్తున్నట్లు చెప్పారు. మూసీ విషయంలో కేటీఆర్, హరీశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
AP: రెండు పట్టభద్ర ఎమ్మెల్యే స్థానాలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(కృష్ణా-గుంటూరు), పేరాబత్తుల రాజశేఖర్(ఉ.గో) పేర్లను టీడీపీ అధిష్ఠానం ఖరారుచేసింది. వీరికి మద్దతు ఇవ్వాలని పవన్, పురందీశ్వరిని టీడీపీ స్టేట్ చీఫ్ పల్లా శ్రీనివాసరావు కోరారు. తమ పార్టీ నేతలతో చర్చించి ఒకట్రెండు రోజుల్లో అభిప్రాయం చెబుతామని వారు తెలిపినట్లు సమాచారం. వారు సానుకూలత వ్యక్తం చేయగానే పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.
అనేక మలుపులతో సాగుతున్న INDvsNZ టెస్ట్ చివరి ఘట్టానికి చేరుకుంది. ఇవాళ ఐదో రోజు గెలుపు కోసం కివీస్ 107 పరుగులు, భారత్ 10 వికెట్లు తీయాల్సి ఉంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. వరుణుడు ఎంట్రీ ఇవ్వకపోతే అటోఇటో తేలిపోనుంది. అయితే భారత్ ఇప్పటివరకు సొంతగడ్డపై 107లోపు లక్ష్యాన్ని కేవలం ఒక్కసారే(vsAUS) కాపాడుకుంది. మరోసారి మ్యాజిక్ చేయాలని IND ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- ఆగస్టు మధ్య భారత్ ఔషధ ఎగుమతుల విలువ 9.42 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు కేంద్రవాణిజ్య శాఖ తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 10.8% పెరిగినట్లు చెప్పింది. మన దేశంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ ఇందుకు మద్దతుగా నిలుస్తోందని పేర్కొంది. సర్జికల్ ఉత్పత్తుల ఎగుమతులు 3.3% వృద్ధితో 0.29 బి.డాలర్లుగా నమోదయ్యాయి. US, యూరప్‌లు కీలక మార్కెట్లుగా ఉన్నాయి.
సంజయ్‌దత్ హీరోగా తెరకెక్కిన మున్నాభాయ్ MBBS, లగే రహో మున్నాభాయ్ చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు మూడో పార్ట్ కోసం కసరత్తు చేస్తున్నామని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ వెల్లడించారు. గత సినిమాల కంటే మెరుగ్గా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రాలను తెలుగులో శంకర్‌దాదా MBBS, శంకర్‌దాదా జిందాబాద్ పేరుతో చిరంజీవి రీమేక్ చేశారు.
AP: అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 21 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుందని IMD వెల్లడించింది. ఇది 23వ తేదీకి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో నేటి నుంచి 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఒడిశా లేదా ఉత్తరాంధ్రలో 24-26 మధ్య తుఫాన్ తీరం దాటుతుందని వివరించింది. ఈ నెల 29న, NOV 3న కూడా అల్పపీడనాలు ఏర్పడే ఛాన్స్ ఉందంది.
టాలెంటెడ్ ప్లేయర్‌గా ముద్రపడ్డ కేఎల్ రాహుల్ ఇటీవల దారుణంగా విఫలం అవుతున్నారు. నిన్న కీలక సమయంలో రాణిస్తాడని ఆశలు పెట్టుకున్న భారత అభిమానులకు నిరాశే మిగిల్చారు. కేవలం 12 రన్స్ కొట్టి పెవిలియన్ చేరారు. ఇప్పటికే అతడికి టీం మేనేజ్‌మెంట్ చాలా అవకాశాలు ఇచ్చిందని, అతడిని పక్కనబెట్టాల్సిన సమయం వచ్చిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మిడిలార్డర్‌లో సర్ఫరాజ్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
జాతీయ మహిళా కమిషన్(NCW) ఛైర్‌పర్సన్‌గా విజయా కిశోర్ రహాట్కర్, సభ్యురాలిగా అర్చనా మజుందార్ నియమితులయ్యారు. విజయ మూడేళ్లపాటు/65ఏళ్లు వచ్చే వరకు, అర్చన మూడేళ్లు పదవుల్లో కొనసాగుతారని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. విజయ NCWకు తొమ్మిదవ ఛైర్‌పర్సన్. బీజేపీకి చెందిన ఈమె 2007-10 మధ్య ఛత్రపతి శంభాజీనగర్ మేయర్‌గా సేవలందించారు. 2016-21 మధ్య మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.
TG: రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా BRS ఆందోళనలు చేపట్టనుంది. మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతు బంధును ఎత్తివేసే కుట్రలో భాగంగానే రైతు భరోసా పేరుతో క్యాబినెట్ సబ్ కమిటీ, కొత్త గైడ్‌లైన్స్ అంటూ డ్రామా చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్‌కు రైతుల ఉసురు తగులుతుందని దుయ్యబట్టారు.
Sorry, no posts matched your criteria.