India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు భారత క్రికెటర్లు చేసిన సెంచరీల సంఖ్య 550కి చేరింది. తాజాగా NZతో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ చేసిన సెంచరీ 550వది. తొలి సెంచరీని 1933లో లాలా అమర్నాథ్, 50వ సెంచరీ పాలీ ఉమ్రిగర్, 100,150వ సెంచరీలు సునీల్ గవాస్కర్, 200th అజహరుద్దీన్, 250th, 300th సచిన్ టెండూల్కర్, 350th వీవీఎస్ లక్ష్మణ్, 400th రాహుల్ ద్రవిడ్, 450th అజింక్య రహానే, 500వ సెంచరీ విరాట్ కోహ్లీ చేశారు.
TG: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘గ్రూప్-1 రద్దు చేయమని అడగట్లేదు. వాయిదా వేయాలని కోరుతున్నాం. జీవో 29తో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనేది వాస్తవం. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని అభ్యర్థులు భయపడుతున్నారు. అభ్యర్థుల డిమాండ్ న్యాయమైనదే. వారిపై లాఠీఛార్జ్ జరగడం చూసి బాధనిపిస్తోంది’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.
తన కొడుకు కృష్ణజింకల్ని ఎప్పుడూ చంపలేదని నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ తెలిపారు. ‘కృష్ణజింకల్ని కాదు కదా మేమెప్పుడూ బొద్దింకల్ని కూడా చంపలేదు. సల్మాన్‌కు జంతువులంటే చాలా ఇష్టం. తన పెంపుడు కుక్క చనిపోతేనే రోజుల తరబడి ఏడ్చాడు. అలాంటిది కృష్ణజింకల్ని చంపుతాడా? మా కుటుంబం తుపాకీని ఎప్పుడూ వాడలేదు. తప్పే చేయని సల్మాన్ క్షమాపణ ఎందుకు చెబుతాడు? ఆ ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.
తెలంగాణకు చెందిన IAS అమోయ్ కుమార్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల వ్యవహారంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈడీ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ఆయనకు నోటీసులు పంపింది.
AP: విశాఖ పర్యటనలో భాగంగా నెహ్రూ బజార్ ప్రాంతీయ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీకి వెళ్లిన మంత్రి లోకేశ్ ఉ.9.45 గంటలకూ ఓపెన్ కాకపోవడంపై ఫైరయ్యారు. నిర్వహణ తీరుపై మండిపడ్డారు. గ్రంథాలయాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఓ స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్‌ను అధ్యయనం చేసి APలో అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
బ్యాడ్ లైట్ కారణంగా భారత్-న్యూజిలాండ్ <<14399404>>మ్యాచ్‌ను <<>>అంపైర్లు నిలిపివేశారు. బుమ్రా 4 బంతులు వేసిన అనంతరం స్టేడియం చుట్టూ నల్లమబ్బులు కమ్మేయడంతో ఇవాళ్టి ఆటను ఆపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర భారత ప్లేయర్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. వర్షం పడకున్నా మ్యాచ్ నిలిపివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కాసేపటికే స్టేడియంలో కుండపోత వర్షం ప్రారంభమైంది.
భారతీయ సినిమా రంగంపై చిరంజీవి చెరగని ముద్ర వేశారంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డు అధికారిక పేజీలో ఆయనపై ఓ స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటుడిగా నిలిచారని, 143 సినిమాల్లో 537 పాటల్లో విభిన్న డాన్సులతో ఆకట్టుకున్నారని ప్రశంసించింది. సినిమాలపై చిరంజీవి ప్రభావం తరతరాలుగా మారి, ఆయనను భారతీయ సినిమాకు ఒక చిహ్నంగా మార్చిందంటూ మెగాస్టార్ కెరీర్ హైలైట్స్‌ను GWR పంచుకుంది.
AP: కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలింది. విజయనగరం జిల్లా గుర్లలో ప్రబలిన అతిసార ఘటనలే దీనికి ఉదాహరణ. 11 మంది చనిపోయినా ప్రభుత్వం నిద్ర వీడడం లేదు. ఆస్పత్రులున్నా స్థానిక స్కూళ్లలో బెంచీల మీద చికిత్స అందించడం దారుణం. ఇప్పటికైనా డయేరియా బాధిత గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ అని ట్వీట్ చేశారు.
NZతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా అద్భుత పోరాటం ముగిసింది. 462 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ 150, పంత్ 99 రన్స్ చేశారు. కివీస్ ముందు టీమ్ ఇండియా 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ ఈ రన్స్ కొట్టకుండా రోహిత్ సేన అడ్డుకోగలదా? కామెంట్ చేయండి.
TG: హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.