India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఐటీఐ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. వివిధ ట్రేడ్లలో చేరేందుకు 8, 10వ తరగతి పాసై, 1-8-2024 నాటికి 14 ఏళ్లు నిండిన విద్యార్థులు అర్హులని చెప్పారు. గత కౌన్సెలింగ్‌లలో సీట్లు పొందని అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి వివరాల కోసం <
AP: బంగాళాఖాతంలో ఈనెల 22 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇది 24 నాటికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. కాగా ఇవాళ, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
హమాస్ గ్రూప్ అధినేత యాహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. దీంతో హమాస్‌ను ఎవరు ముందుకు నడిపిస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరు మహ్మద్ అల్ జహర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ తర్వాతి వరుసలో సిన్వర్ సోదరుడు మహ్మద్ సిన్వర్, హమాస్ మిలటరీ వింగ్ కమాండర్ మహ్మద్ దీఫ్, హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యులు మౌసా అబు మార్జౌక్, ఖలీల్ అల్ హయ్యా, ఖలేద్ మెషాల్ ఉన్నారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 23న మరోసారి సమావేశం కానుంది. క్యాబినెట్‌లో తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 21న సాయంత్రం 4 గంటల్లోపు పంపించాలని అన్ని శాఖలను సీఎస్ నీరబ్‌కుమార్ ఆదేశించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాగా ఈ నెలలో ఇది మూడో క్యాబినెట్ భేటీ.
AP: వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించింది. ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లా-పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా-కారుమూరి నాగేశ్వరరావు, ఉమ్మడి కడప, కర్నూలు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి చిత్తూరు, గుంటూరు-వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మడి కృష్ణా-ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఉభయ గోదావరి జిల్లాలు-బొత్స సత్యనారాయణ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కో ఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డిని నియమించింది.
డేట్‌కి వెళ్లినప్పుడు బిల్లుల్ని తనతోనే కట్టించాలని అబ్బాయిలు ట్రై చేస్తుంటారని నటి శ్రుతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘డేట్‌కి వెళ్లినప్పుడు నేనే డబ్బులు పే చేస్తా. ప్రేమను వ్యక్తీకరించడంలో అది నా శైలి. కానీ 3 నెలల తర్వాత కూడా నేను బిల్లు కట్టాలంటే ఎలా? డబ్బుంది కాబట్టి కట్టడం నీకు ఇష్టమనుకున్నా అంటుంటారు కొంతమంది. అందుకే డేట్‌లో బిల్లు సగం మాత్రమే ఇవ్వడం నేర్చుకున్నా’ అని పేర్కొన్నారు.
అంగారకుడిపై మంచు ఫలకాల కింద సూక్ష్మ జీవుల ఉనికి ఉండొచ్చని నాసా అంచనా వేసింది. భూమిపైనా అలాంటి ప్రాంతాలున్నాయని పేర్కొంది. ‘మంచు ఫలకాల కింద ఉన్న నీటికి సూర్యరశ్మి తగిలితే ఫోటోసింథసిస్ కారణంగా సూక్ష్మస్థాయిలో జీవం ప్రాణం పోసుకోవడానికి ఛాన్స్ ఉంది. మార్స్‌పై అలాంటి చోట్లే జీవం గురించి అన్వేషించాలి. భూమిపై ఆ ప్రాంతాలను క్రయోకొనైట్ రంధ్రాలుగా పేర్కొంటాం’ అని వివరించింది.
నొప్పిని తట్టుకునే వ్యవస్థల్లో స్త్రీలకు, పురుషులకు మధ్య తేడా ఉంటుందని US పరిశోధకులు తెలిపారు. దీర్ఘకాలిక వెన్ను నొప్పిపై అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించామని పేర్కొన్నారు. నొప్పిని తట్టుకునేందుకు పురుషుల శరీరంలో ఎండోజీనస్ ఓపియాయిడ్స్, స్త్రీలలో నాన్-ఓపియాయిడ్స్ విడుదలవుతాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నొప్పి చికిత్స కూడా స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఇవ్వాలని వారు స్పష్టం చేశారు.
TG: ఉద్యోగాల్లో <<14392971>>రిజర్వేషన్లు <<>>ఉండాలా? వద్దా? అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చదువులోనూ రిజర్వేషన్లు, మళ్లీ ఉద్యోగాల్లోనూ అవసరమా? మెరిట్(ప్రతిభ) ఆధారంగానే జాబ్స్ ఇవ్వాలని కొందరు అంటున్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల వారు పైకి రావాలంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు ఉండాలా? వద్దా? మీరేమంటారు?
పాకిస్థాన్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌ను నియమించాలని పీసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌తో పీసీబీ ఛైర్మన్ నఖ్వీ చర్చించినట్లు సమాచారం. ఈ నెల 28న రిజ్వాన్ పేరును పీసీబీ అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకు బాబర్ ఆజమ్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.