news

News March 1, 2025

శివకుమార్ పార్టీని చీలుస్తారు: బీజేపీ నేత

image

కర్ణాటక కాంగ్రెస్‌లో చీలికలు వచ్చేఅవకాశముందని ప్రతిపక్ష బీజేపీ నేత అశోక ఆరోపించారు. ఏక్‌నాథ్ శిందే తరహాలో ఆ పార్టీని ఉపముఖ్యమంత్రి డి.కే శివకుమార్ బీజేపీలో విలీనం చేసే అవకాశముందని తెలిపారు. నవంబర్16న కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు జరగనుందని జోస్యం చెప్పారు. అయితే శివరాత్రి వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు డి.కే శివకుమార్ పాల్గొనటంతో పుకార్లు రేగాయి. ఉప ముఖ్యమంత్రి దీన్ని ఖండించారు.

News March 1, 2025

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులను నేరుగా క్యూలైన్లలోకి పంపుతుండటంతో, ఉ.7గంటల వరకు కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఉ.8 గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇకపై భక్తులను కంపార్ట్‌మెంట్లలోకి పంపనున్నారు. వారు శ్రీవారిని దర్శించుకోవడానికి దాదాపు 8గంటల సమయం పట్టే అవకాశం ఉంది. నిన్న 52,731 మంది దర్శించుకోగా 17,664 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.24 కోట్లు వచ్చింది.

News March 1, 2025

ఇంటర్ పరీక్షలు.. విద్యార్థి ఆత్మహత్య

image

TG: పరీక్షల ఒత్తిడి ఇంటర్ విద్యార్థి ప్రాణాలు బలితీసుకుంది. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన దీక్షిత్ రాజు(17) మియాపూర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈనెల 5 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈక్రమంలోనే నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయాడు. విద్యార్థి దశలో పరీక్షలు ఒక భాగమని, వాటికి భయపడొద్దని మానసిక నిపుణులు చెబుతున్నారు.

News March 1, 2025

ట్రెండింగ్‌లో #MenToo

image

మూవీ ఇండస్ట్రీని ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కుదిపేశాయి. అవకాశాల కోసం ఇండస్ట్రీలో పురుషుల అవసరాలు తీర్చాలని కొందరు నటీమణులు చెప్పగా #METO0 అంటూ పలువురు బయటికొచ్చారు. ఇటీవల, భార్యల వేధింపులు తట్టుకోలేక భర్తలు సూసైడ్ చేసుకుంటున్నారు. అతుల్ సుభాష్ మొదలుకొని మానవ్ శర్మ వరకు దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో తమనూ భార్యలు వేధిస్తున్నట్లు #MenToo అని పోస్టులు పెడుతున్నారు.

News March 1, 2025

నేటి నుంచి EAPCET దరఖాస్తుల స్వీకరణ

image

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు నిర్వహించే EAP-CET దరఖాస్తుల స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 4వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ దీన్‌కుమార్ తెలిపారు. గతనెల 25నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా 15% నాన్-లోకల్ కన్వీనర్ కోటా అంశంపై స్పష్టత కోసం ప్రభుత్వం వాయిదా వేసింది. నిన్న దీనిపై <<15604020>>నిర్ణయం<<>> తీసుకోగా నేటి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది.

News March 1, 2025

రూ.3.2లక్షల కోట్ల బడ్జెట్‌లో.. రూ.లక్ష కోట్ల అప్పు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో రూ.3.2లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా, తాజా బడ్జెట్ అమలుకు రూ.లక్ష కోట్ల అప్పు అవసరం కానుంది. ఇందులో బహిరంగ మార్కెట్ నుంచి రూ.80వేల కోట్లు, కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థల నుంచి మిగతా రుణం తీసుకోనున్నట్లు బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, రూ.3.22లక్షల కోట్లలో రెవెన్యూ రాబడి రూ.2.17లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేసింది.

News March 1, 2025

ఆధార్ కార్డు లేకపోయినా ఆసుపత్రుల్లో వైద్యం: ప్రభుత్వం

image

TG: ఆధార్ లేకపోయినా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఉస్మానియాలో ఆధార్ లేకపోతే వైద్యం చేయడంలేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం ప్రభుత్వ స్పందనను అడిగింది. ఉస్మానియాతో పాటు ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా ఆధార్ లేకున్నా వైద్యం అందిస్తామని, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని ప్రభుత్వ లాయర్ స్పష్టం చేశారు. దీంతో పిల్‌ను ధర్మాసనం ముగించింది.

News March 1, 2025

6న తెలంగాణ క్యాబినెట్ భేటీ

image

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 6న రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లులపై చర్చించనుంది. వీటిని ఆమోదించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనుంది. అనంతరం వాటిని పార్లమెంటుకు పంపి చట్టం చేయాలని కేంద్రాన్ని కోరనుంది. ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైనా క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News March 1, 2025

భారత్‌లో రేపట్నుంచి రంజాన్ మాసం ప్రారంభం

image

భారత్‌లో రేపట్నుంచి (మార్చి 2) రంజాన్ మాసం మెుదలుకానున్నట్లు ఇస్లాం మతపెద్దలు ప్రకటించారు. శుక్రవారం దేశంలో ఎక్కడా నెలవంక దర్శనం కాకపోవడంతో ఆదివారం నుంచి ఉపవాసాలు చేపట్టనున్నారు. అయితే సౌదీఅరేబియాలో నెలవంక దర్శనం కావడంతో నేటినుంచి అక్కడ రంజాన్ మాసం ప్రారంభం కానుంది.

News March 1, 2025

నేడు చిత్తూరు జిల్లాలో CM చంద్రబాబు పర్యటన

image

AP: CM చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జీడి నెల్లూరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లు అందజేయనున్నారు. అనంతరం ఆయన రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించి విజయవాడకు తిరుగు పయనమవుతారు. మరోవైపు, మంత్రి లోకేశ్ ఇవాళ మంత్రాలయంలో పీఠాధిపతి చేతుల మీదుగా గురువైభోత్సవం అవార్డు అందుకోనున్నారు.