India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలోని చాలా జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, యాదాద్రి, WGL, సూర్యాపేట, సిద్దిపేట, RR, కరీంనగర్, నల్గొండ, మెదక్, ఖమ్మం, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల తదితర జిల్లాల్లో మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. కాగా ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
TG: గ్రూప్-1 పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సీఎస్ శాంతకుమారి సూచించారు. గ్రూప్-1 పరీక్షకు ఏర్పాట్లను సమీక్షించారు. మెయిన్స్‌కు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు. మెయిన్స్ నిర్వహణకు 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పటిష్ఠ బందోబస్తుతో పాటు విస్తృత పర్యవేక్షణ ఉండాలన్నారు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను అతని పన్వెల్ ఫామ్ హౌజ్ వద్ద హత్య చేసేందుకు రూ.25 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నట్లు నావీ ముంబై పోలీసులు తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న ఐదుగురి పేర్లను ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. పాక్ నుంచి ఆయుధాలు తీసుకొచ్చి హత్యకు ప్లాన్ చేశారని చెప్పారు. కాగా బాంద్రా నివాసంలో కాల్పుల ఘటన అనంతరం పోలీసులు చేసిన దర్యాప్తులో ఈ కుట్ర వెలుగు చూసింది.
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. 24,900 సపోర్ట్ లెవల్ బ్రేకవ్వడంతో నిఫ్టీ 221 పాయింట్లు పతనమై 24,749 వద్ద క్లోజైంది. ఇక సెన్సెక్స్ 497 పాయింట్లు తగ్గి 81,006 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఐటీ సూచీ మాత్రం 503 పాయింట్లు పెరిగి 42,734 వద్ద ముగిసింది. FIIలు వెళ్లిపోవడం, నెగటివ్ సెంటిమెంటే క్రాష్‌కు కారణాలు. బజాజ్ ఆటో షేర్ 13.11% క్రాష్ అయింది. ఆటో, రియల్టీ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.
బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ ఇండియా 46 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో భారత కోచ్ గౌతమ్ గంభీర్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘ఒకేరోజులో 400 రన్స్ కొట్టాలన్నా, 2 రోజుల పాటు ఆడాలన్నా చేయగలిగే జట్టులా ఉండాలని మేం కోరుకుంటున్నాం. టెస్టు క్రికెట్ విషయంలో అటువంటి మార్పు టీమ్‌లో రావాలి’ అని ఓ ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నారు.
భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమైన బెంగళూరు పిచ్‌పై కివీస్ ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతున్నారు. ఓపెనర్లు కాన్వే, లాథమ్ తొలి వికెట్‌కు 67 పరుగులు రాబట్టారు. IND బ్యాటర్లు బౌండరీలు కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బందిపడగా NZ ప్లేయర్లు అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాదుతున్నారు. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లాథమ్ ఔట్ కాగా కాన్వే(65) సెంచరీ వైపు దూసుకెళ్తున్నారు. యంగ్ 22* రన్స్ చేశారు. ప్రస్తుతం NZ స్కోర్ 107/1.
సూపర్ స్టార్ రజినీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వేట్టయన్’. ఈ సినిమా తెలుగులో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సినిమాకు ప్రీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు జ్ఞానవేల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వేట్టయన్ కథను నిజ జీవితాల్లోనుంచే తీసుకున్నట్లు చెప్పారు. తర్వాతి ప్రాజెక్టుల గురించి నవంబర్‌లో వెల్లడిస్తానన్నారు.
విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. మూడు రోజుల్లోనే డజనుకుపైగా విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలొచ్చాయి. అయితే, ఎయిర్ ఇండియాకు చెందిన 5 విమానాల్లో బాంబులు పెట్టినట్లు ఓ X యూజర్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ‘5 విమానాల్లో పేలుడు పదార్థాలను అమర్చా. త్వరగా దిగిపోండి’ అని @psychotichuman0 అనే X యూజర్ ఎయిర్ ఇండియాకు హెచ్చరించాడు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
TG: మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను సర్కార్ రెండేళ్లకోసారి పెంచుతోంది. ఈసారి వివిధ రకాల బ్రాండ్లపై రూ.20-150 వరకు పెంచాలని బ్రూవరీలు కోరాయి. ఈమేరకు త్వరలోనే ప్రభుత్వం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మద్యం ఆదాయాన్ని ఎక్సైజ్ శాఖ అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాలూ ధరల పెంపునకు మరో కారణంగా తెలుస్తోంది.
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. NOV 18లోపు ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపర్చాలని ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లపై ఆ దేశంలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆమె బంగ్లాను వీడిన సంగతి తెలిసిందే. ఆమెపై క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యాయి. కాగా ఆమె భారత్ చేరుకున్న తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.
Sorry, no posts matched your criteria.