news

News October 17, 2024

తగ్గేదే లే అంటోన్న పంత్

image

పరిస్థితులు ఎలా ఉన్నా రిషభ్ పంత్ మాత్రం తన దూకుడు తగ్గదని మరోసారి నిరూపించారు. NZతో తొలి టెస్టులో భారత్ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో పంత్ క్రీజులోకి వచ్చారు. బంతి స్వింగ్ అవుతుండటంతో తన ట్రేడ్‌మార్క్ షాట్‌కు ప్రయత్నించారు. పంత్ ధైర్యం చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం జైస్వాల్ (12*), పంత్ (13) నెమ్మదిగా కుదురుకుంటున్నారు.

News October 17, 2024

21న కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం

image

తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 8 మెడికల్ కాలేజీలను ఈ నెల 21న ప్రారంభించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వీటిని CM రేవంత్‌తో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలోని కాలేజీని ప్రారంభించాలని CMను కోరినట్లు సమాచారం. జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, నర్సంపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైన సంగతి తెలిసిందే.

News October 17, 2024

పంత్‌కు షాక్.. ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ పటేల్?

image

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటికే హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌ను తప్పించగా, కెప్టెన్ రిషభ్ పంత్‌పైనా వేటు వేయనున్నట్లు సమాచారం. అతని స్థానంలో అక్షర్ పటేల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే పంత్‌ను రూ.18 కోట్లకు రిటెన్షన్ చేసుకుంటుందని తెలుస్తోంది. కాగా తాను వేలంలో పాల్గొంటే ఎంత రేటు రావొచ్చని ఇటీవల రిషభ్ చేసిన <<14336476>>ట్వీట్<<>> వైరలైన విషయం తెలిసిందే.

News October 17, 2024

తెలంగాణ పత్తి రైతులపై ఎందుకీ వివక్ష?: హరీశ్ రావు

image

TG: గుజరాత్ పత్తికి మద్దతు ధరగా క్వింటాకు ₹8,257 చెల్లిస్తున్న కేంద్రం.. తెలంగాణ పత్తికి ₹7,521 మాత్రమే ఇవ్వడం దుర్మార్గమని హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర రైతులపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. ‘వన్ నేషన్-వన్ ట్యాక్స్, వన్ ఎలక్షన్, వన్ రేషన్ కార్డ్, వన్ మార్కెట్ అని ఊదరగొట్టే కేంద్రం వన్ నేషన్- వన్ MSP ఎందుకు ఇవ్వట్లేదు. ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఎందుకుంది?’ అని Xలో నిలదీశారు.

News October 17, 2024

పుష్ప-2 నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

image

అల్లు అర్జున్-రష్మిక జంటగా నటిస్తున్న పుష్ప-2 రిలీజ్‌(డిసెంబర్ 6)కు మరో 50 రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సీరియస్‌గా కుర్చీలో కూర్చొన్న బన్నీ లుక్ ఆకట్టుకుంటోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, రావు రమేశ్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

News October 17, 2024

జంక్ ఫుడ్‌తో డిప్రెషన్

image

జంక్ ఫుడ్‌తో ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని అనేక అధ్యయనాల్లో తేలింది. అలాంటి ఆహారం వల్ల డిప్రెషన్ కూడా పెరుగుతుందని తాజాగా మానసిక వైద్యుడు డేనియల్ అమెన్(US) వెల్లడించారు. ఇప్పటికే ఒత్తిడితో బాధపడుతున్నవారు జంక్ ఫుడ్‌ను వెంటనే మానేయాలని సూచిస్తున్నారు. శరీరంలోని మైక్రోబయోమ్ మానసిక స్థితిని ప్రభావితం చేసే రసాయనాలను ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు.

News October 17, 2024

అప్రమత్తంగా ఉండండి.. సీఎం చంద్రబాబు ఆదేశం

image

AP: రాష్ట్రంలో వాయుగుండం ప్రభావం, భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సాగు నీటి ప్రాజెక్టులు, చెరువులు, వాగుల్లో వరద ప్రవాహాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో పలు చోట్ల భారీ వర్షాలు పడినట్లు సంబంధిత కలెక్టర్లు సీఎంకు వివరించారు.

News October 17, 2024

మళ్లీ వర్షం.. ఆగిన ఆట

image

NZతో జరుగుతోన్న మొదటి టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. భారత్ స్కోర్ 13/3 వద్ద ఉండగా వర్షం ప్రారంభమైంది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మైదానాన్ని కవర్లతో కప్పారు. రోహిత్ 2 పరుగులు చేసి ఔట్ కాగా, విరాట్, సర్ఫరాజ్ డకౌట్ అయ్యారు. జైస్వాల్ (8), పంత్ (3) క్రీజులో ఉన్నారు. సౌథీ, హెన్రీ, విలియం ఒక్కో వికెట్ తీశారు.

News October 17, 2024

IPL: రోహిత్ శర్మ ఏ టీమ్ అంటే?

image

ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను రిటైన్ చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 31లోగా ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ప్లేయర్ల లిస్టును బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. ముంబై రోహిత్, హార్దిక్, బుమ్రా, సూర్యలను రిటైన్ చేసుకోవచ్చని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తెలిపింది. ఇదే జరిగితే రోహిత్ శర్మకు ముంబై కెప్టెన్సీ ఛాన్స్ ఇస్తుందో లేదా పాండ్యను కొనసాగిస్తుందో అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News October 17, 2024

సిద్దిపేట కుంకుమ పువ్వు వచ్చేస్తోంది!

image

TG: సిద్దిపేట కుంకుమ పువ్వు.. ఇకపై ఈ బ్రాండ్ మార్కెట్‌లో లభించనుంది. కశ్మీర్ లాంటి చల్లని వాతావరణంలో సాగయ్యే ఈ పంటను DXN కంపెనీ ఏరోఫోనిక్స్ టెక్నాలజీతో సాగు చేసి ఔరా అనిపించింది. సిద్దిపేట అర్బన్(M) మందపల్లిలో ఈ కంపెనీ ఉంది. ఇక్కడ కుంకుమ పువ్వు సాగవడానికి అవసరమయ్యే పరిస్థితుల్ని ఓ గదిలో ఏర్పాటు చేశారు. 40 వేల మొక్కలతో ఎకరా స్థలంలో రావాల్సిన 600 గ్రాముల పువ్వు గది విస్తీర్ణంలోనే సాగు అయ్యింది.

error: Content is protected !!