news

News October 15, 2024

ఈవీఎం వార్‌లోకి ఇజ్రాయెల్‌ను తెచ్చారు!

image

దేశంలో రగులుతున్న EVM రగడలోకి కాంగ్రెస్ ఇజ్రాయెల్‌ను చేర్చింది. 600Kms దూరంలోని పేజర్లను పేల్చగల ఇజ్రాయెల్ ఈవీఎంలనూ ఆపరేట్ చేయగలదని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ఆరోపించారు. PM మోదీకి ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని ఉటంకించారు. ఇన్నాళ్లూ విపక్షాల ట్యాంపరింగ్ ఆరోపణలను చాలామంది రాజకీయ ప్రచారమనే భావించారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెద్దన్నను ఇందులోకి లాగడంతో ప్రజలు ఏ వాదనను అంగీకరిస్తారో చూడాలి.

News October 15, 2024

‘కంగువ’ ఆడియో లాంచ్‌కి రానున్న ప్రభాస్!

image

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ సినిమాపై మరింత హైప్ పెంచేందుకు మేకర్స్ ప్రభాస్‌ను రంగంలోకి దింపనున్నారు. ఆడియో లాంచ్‌కి ప్రభాస్, రజినీకాంత్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. తన స్నేహితుడికి చెందిన UV క్రియేషన్స్ నిర్మిస్తుండటంతో ప్రభాస్ తప్పనిసరిగా వస్తారని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రం రూ.2వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్‌ అంచనా వేశారు.

News October 15, 2024

ఎన్నికల్లో ఉచిత హామీలతో లాభమేంటి?

image

అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలకు సులభంగా దొరికిన అస్త్రం ‘ఉచితం’. ఏ దేశమైనా ఎదగాలంటే ప్రాజెక్టులు, ఇన్ఫ్రా, రోడ్ల నిర్మాణం, ఉపాధి కల్పనకు ప్రోత్సాహకాల వంటివి ప్రకటించాలి. ఇందుకు భిన్నంగా బస్సుల్లో ఫ్రీ, కరెంటు ఫ్రీ, అకౌంట్లలోకి డబ్బుల బదిలీతో రాష్ట్ర ఖజానాలు ఖాళీ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఫ్రీబీస్‌పై అభిప్రాయం కోరుతూ కేంద్రం, ECIకి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులిచ్చింది. దీనిపై మీ కామెంట్?

News October 15, 2024

దామగుండం బయల్దేరిన రాజ్‌నాథ్ సింగ్, రేవంత్

image

TG: వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతంలో కాసేపట్లో రాడార్ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమం కోసం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి దామగుండం బయల్దేరారు.

News October 15, 2024

BUMPER OFFER: వైన్ షాప్ వదిలేస్తే రూ.కోటి!

image

AP: వ్యక్తిగతంగా వైన్ షాపులు దక్కించుకున్నవారికి సిండికేట్లు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. దుకాణ నిర్వహణ కోసం దాదాపు రూ.40 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ అంత స్థోమత లేనివారిపై సిండికేట్లు ఒత్తిడి చేస్తున్నారు. షాపు వదిలేస్తే రూ.కోటి నుంచి రూ.1.2 కోట్ల వరకు ముట్టచెబుతామని చెబుతున్నారు. అలాగే గుడ్ విల్ కింద నెల నెలా రూ.15 వేలు కూడా ఇస్తామని ప్రకటించడంతో డ్రాలో అదృష్టం వరించిన వారు ఆలోచనలో పడ్డారు.

News October 15, 2024

APPLY: కేజీబీవీల్లో 729 పోస్టులు.. ఇవాళ్టితో లాస్ట్

image

AP: రాష్ట్రంలోని కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. కుక్, వాచ్‌మెన్, స్వీపర్, చౌకీదార్ వంటి పోస్టులున్నాయి. 01-7-2024 నాటికి 42 ఏళ్లు మించని మహిళా అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్న వారు MEO ఆఫీసులో దరఖాస్తులు అందజేయాలని అధికారులు తెలిపారు. వీటిని ఔట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేయనున్నారు. ఈ నెల 22న తుది జాబితాను ప్రకటిస్తారు.

News October 15, 2024

కలికితురాయి అంటే?

image

కీర్తికిరీటంలో మరో కలికితురాయి అంటూ వార్తల్లో వింటుంటాం. అయితే, చాలా మందికి దీని అర్థం తెలియదు. ‘కలికితురాయి’ అంటే
కొంగ తల ఈకలతో చేసిన శిరోభూషణము అని అర్థం. వివరంగా చెప్పాలంటే.. కలికి అంటే మనోహరమైన, తురాయి అంటే పక్షి ఈక లేదా పువ్వుతో తయారుచేసిన మకుటాలంకారం. ఎవరైనా ఏదైనా అవార్డును, ఘనకార్యాన్ని సాధించినప్పుడు ఆ వ్యక్తి “కీర్తి కిరీటంపై కలికితురాయి ” అనే నానుడిని వాడతారు.

News October 15, 2024

గురుకులాలను శాశ్వతంగా మూసివేసేందుకు కుట్ర?: KTR

image

TG: రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే గురుకులాలను శాశ్వతంగా మూసివేసే కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోందని KTR అన్నారు. అద్దె చెల్లించకపోవడంతో గురుకులాలకు యజమానులు తాళాలు వేయడంపై ఆయన Xలో స్పందించారు. ‘ఢిల్లీకి మూటలు పంపేందుకు డబ్బులున్నాయి. కమిషన్లు వచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు రూ.వేల కోట్లు ఉన్నాయి. కానీ గురుకులాల అద్దెలు చెల్లించడానికి డబ్బులు లేవా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

News October 15, 2024

పన్నూన్ హత్యకు కుట్ర: US వెళ్లిన భారత ఇన్వెస్టిగేషన్ టీమ్

image

ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై హత్యాయత్నం కేసులో భారత అధికారి జోక్యాన్ని దర్యాప్తు చేసేందుకు భారత బృందం అమెరికాకు వెళ్లింది. ప్రధాన నిందితుడు నిఖిల్ గుప్తాతో పాటు ఆ అధికారి ఇతర సంబంధాలను పరిశీలించనుంది. ఈ మేరకు భారత్ తమకు సమాచారం ఇచ్చిందని US స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. న్యూయార్క్‌లో పన్నూన్ హత్యకు వీరిద్దరూ కుట్ర పన్నారని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

News October 15, 2024

BREAKING: ఎన్నికల్లో ఫ్రీబీస్.. కేంద్రం, ECIకి సుప్రీం కోర్టు నోటీసులు

image

ఎలక్షన్ల ముంగిట రాజకీయ పార్టీలిచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణిస్తూ ఆదేశాలివ్వాలన్న పిల్‌పై ముందడుగు పడింది. కేంద్రం, ECIకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇదే అంశంపై నమోదైన పెండింగ్ కేసులనూ ఈ పిటిషన్‌కు ట్యాగ్ చేసింది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా వెంటనే పటిష్ఠ చర్యలు తీసుకొనేలా ECIకి ఆదేశాలివ్వాలని పిటిషన్‌దారులు సుప్రీం కోర్టును కోరారు. విచారణపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

error: Content is protected !!