news

News October 14, 2024

రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని అన్ని స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్లు ప్రమాదకర స్థితిలో ఉంటే వాటిల్లో ఉంటున్న విద్యార్థులను సమీపంలోని సురక్షిత భవనాల్లోకి తరలించాలని సూచించారు. అటు వారం రోజుల్లో ప్రసవించే అవకాశం ఉన్న గర్భిణులను ఆస్పత్రుల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.

News October 14, 2024

మునావ‌ర్ ఫారూఖీ హ‌త్య కుట్ర.. భ‌గ్నం!

image

స్టాండ‌ప్ క‌మేడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ హ‌త్య‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ Sepలో చేసిన కుట్ర‌ను నిఘా వ‌ర్గాలు భ‌గ్నం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీలో జ‌రిగిన ఓ కాల్పుల కేసు విచారణలో ఈ కుట్ర వివరాలు వెలుగుచూశాయి. అయితే, అప్పటికే ఢిల్లీ వెళ్తున్న మునావర్‌పై విమానంలో, హోట‌ల్‌లో రెక్కీ జ‌రిగిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఇది కచ్చితంగా అతని హత్యకు జరిగిన కుట్రగా భావించి మునావర్‌ను అక్కడి నుంచి తప్పించారు.

News October 14, 2024

ప్రముఖ కమెడియన్ కన్నుమూత

image

హాస్యనటుడు, ‘ది కపిల్ శర్మ’ షో ఫేమ్ అతుల్ పర్చురే(57) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. పలు మరాఠీ సీరియళ్లు, హిందీ సినిమాలు, టీవీ షోల్లో ఆయన ప్రేక్షకులను అలరించారు. తెలుగులో గత ఏడాది విడుదలైన ‘రూల్స్ రంజన్’ సినిమాలోనూ ఆయన నటించారు.

News October 14, 2024

ఈ జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువ: మంత్రి నారాయణ

image

AP: చెన్నై-నెల్లూరు మధ్య ఈనెల 17న తుఫాను తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. తుఫాను పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. అన్నమయ్య, కడప, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, TRPT, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. అధికారులు ఇచ్చే సూచనలను ప్రజలు పాటించాలని కోరారు.

News October 14, 2024

నటి కారుకు యాక్సిడెంట్‌.. తీవ్ర గాయాలు

image

బుల్లితెర నటి శ్రీవాణి ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె నుదుటి మీద తీవ్ర గాయం కావడంతో పాటు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. ప్రస్తుతం గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె భర్త విక్రమాదిత్య వెల్లడించారు. 3రోజుల క్రితం కుటుంబంతో కలిసి చీరాల బీచ్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. శ్రీవాణి పలు సీరియల్స్‌, టీవీ షోల్లోనూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటారు.

News October 14, 2024

కులగణనపై ఈనెల 24 నుంచి అభిప్రాయ సేకరణ

image

TG: కులగణనపై అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించాలని బీసీ కమిషన్ నిర్ణయించింది. కులగణన కార్యాచరణపై ఇవాళ తొలిసారి సమావేశమైంది. ప్రణాళిక శాఖతో కలిసి కులగణన చేయాలని నిర్ణయించింది. ఈనెల 24 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించి, వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకోనుంది. వాటిని అధ్యయనం చేసిన అనంతరం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించనుంది.

News October 14, 2024

కెనడాలో దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించిన భారత్

image

కెన‌డాతో దౌత్యప‌ర‌మైన వివాదాలు ముదిరిన నేప‌థ్యంలో అక్క‌డి హైక‌మిష‌న‌ర్ స‌హా ఇత‌ర దౌత్య‌వేత్తల్ని భార‌త్ వెన‌క్కి పిలిపించింది. ఖ‌లిస్థానీ తీవ్ర‌వాది హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ హ‌త్య కేసులో కెనడా వీరిని అనుమానితుల జాబితాలో చేర్చ‌డంతో వివాదం చెల‌రేగింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వీరి భ‌ద్ర‌త విష‌యంలో కెన‌డా ప్ర‌భుత్వ నిబద్ధత‌పై త‌మ‌కు విశ్వాసం లేనందునా అందరినీ వెనక్కి పిలిపిస్తున్న‌ట్టు తెలిపింది.

News October 14, 2024

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు బలపడనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్కూళ్లకు రేపు సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇవాళ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే.

News October 14, 2024

మోస్ట్ బ్యూటిఫుల్ వెజిటేరియన్ సెలబ్రిటీలు వీళ్లే

image

బాలీవుడ్ స్టార్లు రితేశ్ దేశ్‌ముఖ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ దేశంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ వెజిటేరియన్ సెలబ్రిటీలు-2024గా PETA(పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) గుర్తించింది. జంతు సంక్షేమం పట్ల వారి అంకితభావం, కారుణ్య జీవనశైలికి ఈ గౌరవం ఇచ్చింది. గతంలో హాటెస్ట్ వెజిటేరియన్ అవార్డు పేరిట ఇచ్చిన ఈ గుర్తింపును నటులు అమితాబ్, సోనూసూద్, ఆలియా‌ భట్, శ్రద్ధాకపూర్, అనుష్క‌శర్మ పొందారు.

News October 14, 2024

కెనడా తీరుపై భారత్ ఫైర్.. ట్రూడోవి ఓటు బ్యాంకు రాజకీయాలని మండిపాటు

image

భార‌త్-కెనడా మ‌ధ్య దౌత్య‌ప‌ర‌మైన సంఘ‌ర్ష‌ణలు మ‌రింత ముదిరాయి. ఖ‌లిస్థానీ తీవ్ర‌వాది హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ హ‌త్య కేసులో కెనడాలో భార‌త హైక‌మిష‌న‌ర్ సంజ‌య్ కుమార్ వ‌ర్మ స‌హా ఇత‌ర దౌత్య‌వేత్త‌ల‌ను అనుమానితుల జాబితాలో చేర్చ‌డంపై భార‌త్ తీవ్రంగా స్పందించింది. కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్‌కు భారత్ సమన్లు ​​పంపింది. ఇది ముమ్మాటికీ కెన‌డా PM జ‌స్టిన్ ట్రూడో ఓటు బ్యాంకు రాజ‌కీయమని విమ‌ర్శించింది.

error: Content is protected !!