news

News October 14, 2024

జానీ మాస్టర్‌కు షాక్

image

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు కొట్టివేసింది. అత్యాచారం కేసులో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

News October 14, 2024

సల్మాన్ ఖాన్‌పై బిష్ణోయ్ పగ ఎందుకు?

image

బిష్ణోయ్ తెగ కృష్ణ జింక‌ల్ని ప‌విత్రంగా భావిస్తుంది. వీటిని వేటాడాడన్న‌ ఆరోపణలతో స‌ల్మాన్ ఖాన్‌పై బిష్ణోయ్ ప‌గ పెంచుకున్నాడు. స‌ల్మాన్‌ స్నేహితులనీ టార్గెట్ చేశాడు. సింగ‌ర్ గిప్పీ నివాసం వ‌ద్ద కాల్పులు జ‌రిపించాడు. స‌ల్మాన్ ఇంటి బ‌య‌ట కాల్పుల వెనుక‌, కెనడాలో AP ధిల్లాన్ హత్యకు కుట్ర, బాబా సిద్దిఖీ హ‌త్య వెనుక బిష్ణోయ్ మాస్ట‌ర్‌మైండ్! సిద్ధూ మూసేవాలా హత్యతో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు తెరమీదకొచ్చింది.

News October 14, 2024

ప్రశాంత్ నీల్, లోకేశ్ డైరెక్షన్‌లో చరణ్ నెక్ట్స్ మూవీస్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పీడ్ పెంచారు. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్న చరణ్ మరో రెండు సినిమాలను లాక్ చేశారు. బుచ్చిబాబు సినిమా ముగిసిన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారు. అనంతరం తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇటీవల లోకేశ్ చెప్పిన కథకు ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ఇటు గేమ్ ఛేంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది.

News October 14, 2024

దసరా ఎఫెక్ట్.. రూ.1,100కోట్ల మద్యం తాగారు!

image

TG: దసరా పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.1,100కోట్లకు పైగా మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. గత 10 రోజుల వ్యవధిలో 10 లక్షల 44 వేల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్లు పేర్కొన్నారు. అమ్మకాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టాప్‌లో నిలిచింది. ఆ తర్వాతి 3 స్థానాల్లో కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలు ఉన్నాయి.

News October 14, 2024

APలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్: CM

image

AP: అమరావతిలో రతన్ టాటా పేరుతో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా దీనిని మారుస్తామన్నారు. ‘MSME, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు 5% ఇన్సెన్టివ్స్ ఇస్తాం. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10% ప్రోత్సాహకం అందిస్తాం’ అని పరిశ్రమలపై సమీక్షలో సీఎం వెల్లడించారు.

News October 14, 2024

రేపటి నుంచి మళ్లీ ‘మూసీ’ కూల్చివేతలు.. ఇళ్ల ముందు బోర్డులు

image

TG: మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలను మంగళవారం నుంచి పునఃప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మూసీ రివర్ బెడ్‌పై 2,116 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. కాగా కూల్చివేతల పున:ప్రారంభం నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని 100మందికి పైగా ఇళ్ల యజమానులు తమ ఇళ్లకు ఫ్లెక్సీలు వేలాడదీశారు. తమ ఇళ్లను కూల్చివేయవద్దని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని అందులో పేర్కొన్నారు.

News October 14, 2024

దివ్యాంగులు ఈ సైటులో దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగం: మంత్రి సీతక్క

image

TG: దివ్యాంగుల జాబ్ పోర్టల్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఇకపై దివ్యాంగులు కంపెనీల చుట్టూ ఉద్యోగాల కోసం తిరగాల్సిన అవసరం లేదని, <>పోర్టల్‌లో <<>>రిజిస్ట్రేషన్ చేసుకుంటే అర్హత ప్రకారం ఉద్యోగాలు వస్తాయన్నారు. సంక్షేమ శాఖ నిధుల్లో దివ్యాంగులకు 5% కేటాయిస్తున్నామని, ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ 4% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాల్లో వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

News October 14, 2024

Stock Market: లాభాల్లో ముగిశాయి

image

అధిక వెయిటేజీ HDFC స‌హా, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సోమ‌వారం లాభాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 591 పాయింట్ల‌తో 81,973 వ‌ద్ద‌, నిఫ్టీ 163 పాయింట్ల లాభంతో 25,127 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. Wipro, TechM, HdfcLife, Hdfc Bank, LT టాప్ గెయినర్స్. ONGC, Maruti, Tata Steel, Bajaj Finance, Adanient టాప్ లూజ‌ర్స్‌. అటు BSEలో 20 షేర్లు లాభాలు గడించాయి.

News October 14, 2024

అతని గ్యాంగ్‌లో 700 మంది షూటర్లు!

image

మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశంలో మరోసారి మార్మోగుతోంది. దాదాపు 700 మంది షూట‌ర్ల‌తో ఉత్త‌ర భార‌తంలో త‌న గ్యాంగ్‌ను విస్త‌రించాడు. బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్ర‌త్య‌ర్థి గ్యాంగ్‌ల‌ను ఎదుర్కొంటూ, పైచేయి కోసం హ‌త్యలు చేయ‌డం ప్రారంభించింది. బిష్ణోయ్ స్నేహితుడు రాకీ స‌హ‌కారంతో నేరాల‌కు పాల్ప‌డ్డాడు. రాజ‌స్థాన్‌, పంజాబ్‌, హ‌రియాణాలో సామ్రాజ్యాన్ని విస్త‌రించాడు.

News October 14, 2024

రాడార్ స్టేషన్ ఏర్పాటుకు BRS వ్యతిరేకం: KTR

image

TG: దామగుండం అడవుల్లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి BRS వ్యతిరేకమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పష్టం చేశారు. CM ఓవైపు మూసీకి మరణశాసనం రాస్తూ, మరోవైపు సుందరీకరణ చేస్తారా అని ప్రశ్నించారు. 10ఏళ్ల పాలనలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి తమపై ఎంత ఒత్తిడి తెచ్చినా తాము అంగీకరించలేదని కేటీఆర్ వెల్లడించారు. దీనికి వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి BRS పోరాటం చేస్తుందన్నారు.

error: Content is protected !!