India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీలోని గ్రామీణ సంస్థలకు కేంద్రం రూ.988.773 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రపంచాయతీరాజ్ శాఖ ఈ నిధులు అందించింది. 9 జడ్పీలు, 615 మండల పంచాయతీలు, 12,853 గ్రామ పంచాయతీలకు ఈ నిధులు అందిస్తారు. అత్యవసర సౌకర్యాలు, మౌలిక వసతుల కోసం ఈ నిధులు వెచ్చించుకోవచ్చు. జీతాలు, పరిపాలన ఖర్చుల కోసం వాడకూడదు.
బిహార్‌లోని సీతామర్హికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మిథిలేశ్ కుమార్ విద్యార్థినులకు కత్తులు పంపిణీ చేశారు. అమ్మాయిలను తాకిన దుర్మార్గుల చేతులను నరికేయాలని పిలుపునిచ్చారు. విజయదశమి వేడుకల్లో భాగంగా కత్తులు, తుపాకులు, ఇతర ఆయుధాలకు ఆయుధపూజ నిర్వహించారు. సోదరీమణులను తాకడానికి కూడా ఎవరూ ధైర్యం చేయకూడదని, చేస్తే నరికేయాలని స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయాలకు ప్రజలూ మద్దతు తెలపాలని కోరారు.
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ బర్త్ డే సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ స్పెషల్ విషెస్ తెలిపింది. ‘తన పనిపట్ల ఎంతో కమిటెడ్‌గా ఉంటారు. పేరుకు తగ్గట్లు అంత గంభీరంగా ఉండరు. కానీ, చాలా అగ్రెసివ్, బెస్ట్ టీచర్’ అని తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. పైన తెలిపిన వాటిలో పట్టు సాధించిన లెజెండ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది. గంభీర్ ఇన్నింగ్స్‌లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి.
ఇజ్రాయెల్‌పై 9/11 తరహా దాడులకు హమాస్ కుట్ర పన్నినట్లు IDF తెలిపింది. ఈ కుట్రకు సంబంధించిన రికార్డులను ఖాన్ యూనిస్‌లోని హమాస్ కమాండ్ సెంటర్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. టెల్ అవీవ్‌లోని 70 అంతస్తుల భవనం మోషే అవివ్, ఇజ్రాయెల్ టవర్లను నేలమట్టం చేసేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. ఈ రికార్డుల్లో ఇరాన్ ప్రతినిధులతో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ జరిపిన సంభాషణలు కూడా ఉన్నట్లు తెలిపింది.
వారం ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్ల ప్లస్‌లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ ప్రస్తుతం 81,666 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25,037 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. JSW స్టీల్, L&T, టాటా స్టీల్, HDFC, అదానీ పోర్ట్స్, రిలయన్స్, NTPC తదితర షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లు పడిపోయాయి.
AP: ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తిరుపతి నుంచి వైజాగ్ వరకు కోస్తా ప్రాంతమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, మచిలీపట్నం, కాకినాడ, విశాఖలో వానలు పడుతున్నాయి. ఈ మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల్లోనూ వానలు ప్రారంభమవుతాయని తెలిపారు.
యుద్ధవాతావరణంతో గాజాలోని ప్రజలు ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. ‘దాదాపు 2 వారాలుగా ఉత్తర గాజాలోకి ఎలాంటి ఆహారం వెళ్లలేదని UN నివేదించింది. అవసరమైన వారికి ఆహారం అందించేలా ఇజ్రాయెల్ అత్యవసరంగా యుద్ధాన్ని నిలిపివేయాలి. పౌరులను రక్షించాలి. ఆహారం, నీరు, మెడిసిన్స్ వారికి అందించాలి. మానవతా చట్టాన్ని గౌరవించండి’ అని ట్వీట్ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, సేలం జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. కావేరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరుతో పాటు మరో 15 జిల్లాలకు అక్కడి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
AP: అమరావతి నిర్మాణంపై కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. దీంతో ఇప్పటివరకూ ముళ్ల కంపలు, పిచ్చి చెట్లతో చిన్నపాటి అడవిలా దర్శనమిచ్చిన ఆ ప్రాంతమంతా చూడచక్కగా కనిపిస్తోంది. ఇటు ప్రధాన రహదారులు, ఇతర నిర్మాణాలకు టెండర్లను సైతం డిసెంబర్‌లోపు ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
AP: మద్యం షాపులకు ఇవాళ జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. షాపు దక్కించుకున్న వారు చెల్లించే తొలి విడత లైసెన్స్ రుసుముతో సుమారు రూ.300 కోట్ల ఆదాయం లభిస్తుంది. అలాగే వారం రోజులు సరకు కొనుగోలు ద్వారా మరో రూ.300 కోట్లకు పైగా వస్తుంది. ఇప్పటికే ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం లభించింది. మొత్తంగా నూతన పాలసీ ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం సమకూరుతుంది.
Sorry, no posts matched your criteria.