news

News October 13, 2024

కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోంది: హరీశ్

image

TG: PAC ఛైర్మన్, మండలి చీఫ్ విప్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘మండలి చీఫ్ విప్‌గా మహేందర్ రెడ్డిని ఎలా నియమిస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. అనర్హత పిటిషన్ ఛైర్మన్ దగ్గర పెండింగ్‌లో ఉంది. వేటు వేయాల్సిన ఛైర్మనే మహేందర్‌ను చీఫ్ విప్‌గా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై సమాధానం ఇవ్వాలి. PAC ఛైర్మన్ విషయంలోనూ ఇలానే చేశారు’ అని ఆయన ధ్వజమెత్తారు.

News October 13, 2024

రాష్ట్ర పండుగగా ‘వాల్మీకి జయంతి’

image

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17న వాల్మీకి జయంతిని అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహించాలని ఆదేశించింది. అనంతపురంలో రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహించనుంది. ఇందులో సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉంది.

News October 13, 2024

ఏపీ ప్రభుత్వంపై ప్రవీణ్ కుమార్ ఫైర్

image

IPS పీవీ సునీల్ కుమార్‌పై ఏపీ ప్రభుత్వం <<13613964>>క్రమశిక్షణ చర్యలు<<>> తీసుకోవడాన్ని BRS నేత, మాజీ IPS ప్రవీణ్ కుమార్ ఖండించారు. ‘ఆయన ట్విటర్‌లో పెట్టిన పోస్టులో తప్పేముంది? మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని అనడం సర్వీస్ రూల్స్ ఉల్లంఘించడం ఎట్లయితది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదివితే అప్పుడైనా అర్థమైతదేమో’ అంటూ సీఎం చంద్రబాబును ప్రవీణ్ ట్యాగ్ చేశారు.

News October 13, 2024

సిద్దిఖీ హత్య మా పనే: బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన

image

MH మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హ‌త్య త‌మ ప‌నే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు గ్యాంగ్ స‌భ్యుడొక‌రు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్ప‌టికే ఇద్ద‌రిని అరెస్టు చేశారు. విచార‌ణ సంద‌ర్భంగా నిందితులు బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలను అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. ఈ హత్యతో ముంబైలో తన ప్రాభవాన్ని చాటుకోవడమే గ్యాంగ్‌స్టర్ ఉద్దేశ్యమని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

News October 13, 2024

దాతలు రూ.కోట్లు ఇస్తుంటే బాబు ‘పులిహోర’ చేస్తున్నారు: అంబటి

image

AP: వరద సాయం నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ‘వరద బాధితుల కోసం దాతలు రూ.కోట్లు ఇస్తున్నారు. బాబుగారేమో ‘‘పులిహోర’’ చేస్తున్నారు’ అని సెటైర్లు వేశారు. మరోవైపు దాతలు రూ.కోట్లు ఇస్తుంటే రూ.కోటి విరాళం ప్రకటించిన మాజీ సీఎం జగన్ మాత్రం ఇంకా ఇవ్వలేదని టీడీపీ శ్రేణులు అంబటికి కౌంటర్ ఇస్తున్నారు.

News October 13, 2024

హీరోయిన్‌తో టాలీవుడ్ హీరో ఎంగేజ్‌మెంట్(PHOTOS)

image

తెలుగు హీరో నారా రోహిత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రతినిధి-2 మూవీ హీరోయిన్ శిరీష(సిరిలెల్లా)తో రోహిత్ నిశ్చితార్థం జరిగింది. HYD నోవాటెల్‌లో AP సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, MLA బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆమె వేలికి ఉంగరం తొడిగారు. వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. అటు డిసెంబర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.

News October 13, 2024

సిగ్న‌ల్ ట్యాంప‌రింగ్ అనుమానాలపై NIA దర్యాప్తు

image

చెన్నై శివారులో భాగ‌మ‌తి ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో సిగ్న‌ల్ ట్యాంప‌రింగ్ అనుమానాలపై NIA విచార‌ణ ప్రారంభించింది. మెయిన్ లైన్‌లో ఉండాల్సిందిగా సిగ్న‌ల్ ఇచ్చినా రైలు లూప్‌లైన్‌లోకి ప్ర‌వేశించ‌డం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో సిగ్న‌ల్ ట్యాంప‌రింగ్ జ‌రిగిందా? లేదా కుట్ర కోణం ఉందా? అన్న విష‌యంలో ద‌ర్యాప్తు జరుగుతోంది. కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

News October 13, 2024

రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్

image

ఉత్త‌రాఖండ్‌ రూర్కీ స‌మీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఉంచిన‌ ఖాళీ గ్యాస్ సిలిండ‌ర్ క‌ల‌క‌లం రేపింది. ధంధేరా- లాండౌరా స్టేష‌న్ల మ‌ధ్య ఉద‌యం 6:35కి గూడ్స్ రైలు వెళ్తోంది. ఈ క్రమంలో ట్రాక్‌పై సిలిండర్‌ను గుర్తించిన లోకోపైల‌ట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఘ‌ట‌నా స్థలానికి పాయింట్స్‌మెన్ చేరుకొని ఖాళీ సిలిండ‌ర్‌గా గుర్తించారు. ఆగ‌స్టు నుంచి దేశంలో ఇలాంటి 18 ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.

News October 13, 2024

పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలివే..

image

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. OCT, NOV, DECలో భారీగా వివాహాలు జరగనున్నాయి. ఈ 3 నెలల్లోని కొన్ని తేదీలను పండితులు పెళ్లి ముహూర్తాలుగా నిర్ణయించారు. ఇప్పటికే NOV, DECలో ముహూర్తాలు పెట్టగా, ఈనెలలోనూ నిన్నటి నుంచి పెళ్లిళ్లు మొదలయ్యాయి. OCTలో 13,16,20,27, NOVలో 3,7,8,9,10,13,14,16,17, DECలో 5,6,7,8,11,12, 14,15, 26 తేదీలు వివాహాలకు అనుకూలమైనవని పండితులు వెల్లడించారు.

News October 13, 2024

విమానాల్లో పేజర్లు, వాకీటాకీలపై ఇరాన్ నిషేధం

image

ప్రతీకార దాడులు తప్పవన్న ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ జాగ్ర‌త్త‌ప‌డుతోంది. హెజ్బొల్లా పేజ‌ర్ల పేలుళ్ల త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌కు ఆస్కారం ఇవ్వ‌కుండా ఇరాన్ విమాన‌యాన శాఖ వీటిపై నిషేధం విధించింది. ప్ర‌యాణికులు మొబైల్ ఫోన్లు మిన‌హా పేజ‌ర్లు, వాకీటాకీల‌ను విమాన క్యాబిన్‌లో, చెక్-ఇన్‌లో తీసుకెళ్ల‌లేరు. దుబాయ్ నుంచి వ‌చ్చి, వెళ్లే విమానాల్లో స‌హా దుబాయ్ మీదుగా వెళ్లే విమానాల్లో ఈ నిషేధాన్ని విధించారు.

error: Content is protected !!