news

News April 14, 2025

మే నాటికి GPOల నియామకం: మంత్రి పొంగులేటి

image

TG: రాష్ట్రంలోని 10,956 గ్రామాల్లో మే నాటికి గ్రామ పాలనాధికారుల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుతం 480 మంది సర్వేయర్లు ఉన్నారని, వారి సంఖ్యను 1000కి పెంచుతామని తెలిపారు. ‘భూ భారతి’ చట్టాన్ని జూన్ 2లోగా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తామన్నారు. ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

News April 14, 2025

‘రాజీవ్ యువ వికాసం’.. నేడే చివరి తేదీ.. గడువు పొడిగిస్తారా?

image

TG: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అయితే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు దరఖాస్తుదారులు చెబుతున్నారు. గడువును ఈనెలాఖరు వరకు లేదా మరో 10 రోజులపాటు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇప్పటివరకు 14 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం.

News April 14, 2025

రెండ్రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండలు మండుతాయని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది. తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు కోస్తాంధ్ర, యానాం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల రాష్ట్రంలో రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

News April 14, 2025

సిక్స్ కొట్టినా, వికెట్ తీసినా రూ.లక్ష.. ఎందుకో తెలుసా?

image

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)కు చెందిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమ బ్యాటర్లు కొట్టే ప్రతి సిక్సర్‌కు, బౌలర్లు తీసే ప్రతి వికెట్‌కు లక్ష పాకిస్థానీ రూపాయల($356) చొప్పున పాలస్తీనా చారిటబుల్ సంస్థలకు విరాళంగా ఇస్తామని ప్రకటించింది. అక్కడి పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసే వాటికి ప్రాధాన్యత ఇస్తామంది. కరాచీ కింగ్స్‌తో తొలి మ్యాచ్ తర్వాత 1.5M PKRను డొనేట్ చేసినట్లు తెలిపింది.

News April 14, 2025

ప్రపంచంలోని ప్లాస్టిక్ చెత్తలో మన వాటా 3.54%

image

ప్రపంచ వ్యాప్తంగా 2022లో 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగైతే, అందులో 95 లక్షల టన్నులతో భారతదేశం 3.54 శాతం వాటా కలిగి ఉందని నేచర్ జర్నల్‌లోని ఓ కథనం తెలిపింది. 8.15 కోట్ల టన్నుల చెత్త ఉత్పన్నంతో చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాలు ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతూనే ఉన్నా ప్రజల్లో ఆచరణ అంతంతమాత్రంగానే ఉంటోంది.

News April 14, 2025

కాంగోలో మళ్లీ అల్లర్లు.. 50 మంది మృతి

image

ఆఫ్రికా దేశం కాంగోలోని గోమాలో అల్లర్లు చెలరేగాయి. దీంతో దాదాపు 50 మంది చనిపోయారు. దీనికి రువాండా మద్దతుతో M23 రెబల్స్ చేస్తున్న దాడులే కారణమని సైన్యం ఆరోపించింది. తిరుగుబాటుదారుల చర్యల వల్ల శాంతి చర్చలకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. ‘గోమా’తోపాటు దేశంలో రెండో అతిపెద్ద నగరమైన బుకావు కూడా రెబల్స్ అధీనంలోనే ఉంది. మూడేళ్లుగా జరుగుతున్న ఘర్షణల్లో దాదాపు 7వేల మంది మరణించగా, 2.5M మంది వలస వెళ్లారు.

News April 14, 2025

IPL: చరిత్ర సృష్టించిన MI

image

ఢిల్లీతో మ్యాచ్‌లో విజయం సాధించిన MI ఓ అరుదైన రికార్డు సృష్టించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 200+ స్కోర్‌ చేసిన ప్రతిసారీ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు వరుసగా 15 మ్యాచుల్లో ఇలా గెలిచింది. DC కూడా వరుసగా 13 సందర్భాల్లోనూ ఓడిపోలేదు. అయితే 200+ స్కోర్‌ను CSK 21 సార్లు డిఫెండ్ చేసుకోగా ఐదుసార్లు ఓడిపోవడం గమనార్హం. ఆ తర్వాత RCB(W-19, L-5), SRH(W-15, L-2) ఉన్నాయి.

News April 14, 2025

‘థగ్ లైఫ్’ పూర్తి.. KH237పై కమల్ ఫోకస్

image

మణిరత్నం డైరెక్షన్‌లో ‘థగ్ లైఫ్’ షూటింగ్ పూర్తవడంతో మరో చిత్రంపై కమల్ హాసన్ ఫోకస్ చేశారు. అన్బు-అరీవు దర్శకత్వంలో KH237 సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, జులై/ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం కమల్ తన బాడీ లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

News April 14, 2025

తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు

image

TG: 30 ఏళ్ల పాటు జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా నేడు రాష్ట్రంలో SC వర్గీకరణ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు, నిబంధనలు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి కాపీని CM రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్‌‌కుమార్ రెడ్డితో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మరోవైపు, సుప్రీం తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని ఉత్తమ్ తెలిపారు.

News April 14, 2025

టూవీలర్లలో హీరో.. కార్లలో మారుతి

image

టూవీలర్ల అమ్మకాల్లో హీరో మోటార్స్ ఇండియాలో టాప్‌లో దూసుకెళ్తోంది. డీలర్స్ అసోసియేషన్ ఫాడా డేటా ప్రకారం 2024-25లో ఆ కంపెనీ 54లక్షల బైకులను విక్రయించింది. 48లక్షల వాహనాల విక్రయాలతో హోండా రెండో స్థానంలో ఉంది. అలాగే, కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ అగ్రస్థానంలో ఉంది. 2024-25లో సుమారు 16.72లక్షల కార్లను అమ్మింది. ఇదే కంపెనీ గతేడాది 16.08లక్షల వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ 2వ ప్లేస్ దక్కించుకుంది.