news

News March 1, 2025

కేజ్రీవాల్ రావణుడు, ఆతిశీ శూర్పణఖ: BJP MLA

image

కేజ్రీవాల్, ఆతిశీని ఢిల్లీ BJP MLA గజేంద్ర యాదవ్ రావణుడు, శూర్పణఖతో పోలుస్తూ విమర్శలు గుప్పించారు. ‘రామాయణంలో రావణుడు, కుంభకర్ణుడు హతమవుతారు. కానీ శూర్పణఖ బతికిపోతుంది. ఇక్కడ కూడా ఓటమితో కేజ్రీవాల్, సిసోడియా రాజకీయ భవిష్యత్తు ముగిసింది. కానీ ఆతిశీ గెలిచారు. అందుకే ఆమె శూర్పణఖ లాంటివారు’ అని ఎద్దేవా చేశారు. ఇక తాము చేసే మంచిని చూసి ఆప్ నేతలెప్పుడూ ఏడుస్తూనే ఉంటారని ఆయన విమర్శించారు.

News March 1, 2025

వచ్చే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు

image

ఇటీవల ముగిసిన మహా కుంభమేళా మళ్లీ 144 ఏళ్లకు రానుండగా వచ్చే ఐదేళ్లలో 4 కుంభమేళాలు జరగనున్నాయి. 2027లో హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా ఉంటుంది. అదే ఏడాది జులై 17 నుంచి ఆగస్టు 17 వరకు మహారాష్ట్రలోని నాసిక్‌కు 40 కి.మీ దూరంలో ఉండే త్రయంబకేశ్వర్‌లో మరో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక్కడి కొండల్లోనే గోదావరి నది పుట్టింది. 2028లో ఉజ్జయిని, 2030లో ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలు జరుగుతాయి.

News March 1, 2025

ఇంకా నయం జెలెన్‌స్కీని ట్రంప్ కొట్టలేదు: రష్యా

image

ట్రంప్, జెలె‌న్‌స్కీ వాగ్వాదంపై రష్యా స్పందించింది. ఇంతటి గొడవలో జెలెన్‌స్కీని ‘కొట్టకుండా’ ట్రంప్ చాలా సంయమనం పాటించారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. మీటింగ్‌లో ఆయన అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు. ఇక వైట్‌హౌస్‌లో జరిగిన ఘటన జెలెన్‌‌స్కీకి చెంపదెబ్బ లాంటిదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ పేర్కొన్నారు. ఆయనను ‘అవమానం జరిగిన పంది’గా అభివర్ణించారు.

News March 1, 2025

సజ్జల డైరెక్షన్‌లోనే పవన్, లోకేశ్‌ను తిట్టా.. పోసాని రిమాండ్ రిపోర్ట్‌

image

AP: నటుడు పోసాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపర్చారు. YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకే పవన్, లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించానని పోసాని చెప్పినట్లు పేర్కొన్నారు. తాను మాట్లాడిన మాటలను సజ్జల కుమారుడు భార్గవ్‌ SMలో వైరల్ చేసేవాడని తెలిపారు. సజ్జల అనుమతితోనే HYDలో ప్రెస్‌మీట్ నిర్వహించి పవన్‌ను వ్యక్తిగతంగా తిట్టినట్లు పోసాని అంగీకరించారని వెల్లడించారు.

News March 1, 2025

అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు: ట్రంప్

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలె‌న్‌స్కీతో గొడవపై ట్రంప్ స్పందించారు. ఆయన వైట్‌హౌస్‌ బయట మీడియాతో మాట్లాడారు. ‘అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు. ఎప్పుడైతే ఆయన శాంతి స్థాపనకు సిద్ధపడతారో అప్పుడే మళ్లీ ఇక్కడికి వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా అంతకుముందు ట్రంప్‌తో జెలె‌న్‌స్కీ వాగ్వాదానికి దిగడాన్ని US ఉపాధ్యక్షుడు వాన్స్ తప్పుబట్టారు. మీడియా ముందు తమ అధ్యక్షుడిని అగౌరవపరిచారని మండిపడ్డారు.

News March 1, 2025

మాకు శాశ్వత శాంతి కావాలి: జెలె‌న్‌స్కీ

image

వైట్‌హౌస్‌లో US అధ్యక్షుడు ట్రంప్‌తో వాగ్వాదం అనంతరం భేటీ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు. ‘థాంక్యూ US. మీ మద్దతుకు కృతజ్ఞతలు. థాంక్యూ ప్రెసిడెంట్. ఉక్రెయిన్‌కు శాశ్వత శాంతి కావాలి. మేం అందుకోసమే పనిచేస్తున్నాం’ అని రాసుకొచ్చారు. కాగా రష్యాతో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనుకోవడం లేదని, జెలెన్‌స్కీ శాంతిని కోరుకోవడం లేదని అంతకుముందు ట్రంప్ ఆరోపించారు.

News March 1, 2025

WPL: టేబుల్ టాప్‌లో ఢిల్లీ

image

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 123 పరుగులు చేసింది. ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు రెచ్చిపోయారు. కెప్టెన్ లానింగ్(60*) అర్ధసెంచరీ చేయగా షఫాలీ 28 బంతుల్లో 43 రన్స్ చేశారు. 10వ ఓవర్లో షఫాలీ ఔటైనా రోడ్రిగ్స్‌తో కలిసి కెప్టెన్ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 8 పాయింట్లతో ఢిల్లీ తొలి స్థానానికి చేరింది.

News March 1, 2025

ఇంటర్ పరీక్షలు.. సీఎస్ కీలక సూచనలు

image

TG: ఇంటర్ పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి సూచించారు. పరీక్షల నిర్వహణపై వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. చేతి గడియారంతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని తెలిపారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చూడాలని పోలీసులను సీఎస్ ఆదేశించారు.

News March 1, 2025

చరిత్రలో ఈరోజు.. మార్చి 1

image

* 1901- ఆంధ్ర రాష్ట్ర తొలి శాసనసభాపతి నల్లపాటి వెంకటరామయ్య జననం
* 1968- భారత మాజీ వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవి జన్మదినం
* 1969- ఇండియన్ రైల్వేస్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ప్రవేశపెట్టారు. తొలి రైలు ఢిల్లీ, కోల్‌కతా మధ్య నడిచింది
* 1986- తెలుగు సింగర్ కారుణ్య పుట్టినరోజు

News March 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.