news

News February 28, 2025

అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌కు సీఎం అభినందనలు

image

AP: అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మెడికో అంబుల వైష్ణవిని నియమిస్తూ CRDA ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును ఆమె కలవగా అభినందనలు తెలిపారు. రాజధానిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆమెకు సూచించారు. వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఆమె ఇప్పటివరకు రాజధాని నిర్మాణానికి రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.

News February 28, 2025

ఉగ్రవాదిని అనుకుని గన్‌తో కాల్చబోయారు: సునీల్ శెట్టి

image

వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి జరిగిన కొన్ని రోజులకు తనకు USలో భయానక పరిస్థితి ఎదురైనట్లు సునీల్ శెట్టి వెల్లడించారు. ‘2001లో నేను కాంటే మూవీ షూటింగ్ తర్వాత LAలోని హోటల్‌కు వెళ్తుండగా నా లుక్‌ను చూసి టెర్రరిస్టు అని అనుమానించారు. కిందికి రాకపోతే కాల్చేస్తామని పోలీసులు హెచ్చరించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సంకెళ్లు వేశారు. హోటల్ మేనేజర్ నేనెవరో చెప్పడంతో వదిలేశారు’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News February 28, 2025

CT: వర్షంతో నిలిచిన మ్యాచ్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన AFG 273 పరుగులు చేయగా, ఆసీస్ 12.5 ఓవర్లలో 109 పరుగులు చేసింది. మరోవైపు పవర్ ప్లేలో అత్యధిక పరుగులు(10 ఓవర్లలో 90) చేసిన జట్టుగా ఆసీస్ నిలిచింది. ఇక AUS ప్లేయర్ హెడ్ ఆ జట్టు తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(34 బంతుల్లో 51) చేశారు. ఇరు జట్లు సెమీస్ చేరేందుకు ఈ మ్యాచ్ ఫలితం కీలకంగా ఉంది.

News February 28, 2025

రోజులో ఏ సమయంలో నీళ్లు తాగాలంటే?

image

ఉదయం పరగడుపునే 1 లీటర్ నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి తాగలేని వారు కాస్త గ్యాప్ ఇచ్చి తాగాలి. గోరు వెచ్చటి నీటిని తాగితే వ్యర్థాలు, టాక్సిన్స్ సులభంగా బయటకు వెళ్తాయి. పేగులు శుభ్రంగా మారతాయి. అలాగే భోజనానికి అరగంట ముందు, అరగంట తర్వాత నీరు తాగాలి. ఇలా చేస్తే నీళ్లు జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. వ్యాయామానికి ముందు గ్లాసు నీరు తీసుకోవాలి. నిద్ర పోయేముందు ఓ గ్లాసు నీరు తాగాలి.

News February 28, 2025

రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాం: రేవంత్

image

TG: పదేళ్ల BRS పాలనలో వరంగల్‌కు ఏం చేశారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘వరంగల్‌కు ఎయిర్‌పోర్టు కావాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడిని నేనే అడిగా. భూసేకరణను క్లియర్ చేసి ఎయిర్‌పోర్టు, రింగ్ రోడ్డు కావాలని ఢిల్లీలో నివేదికలు అందించాకే కదలిక వచ్చింది. ఢిల్లీకి ఇందుకే వెళ్తున్నాం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నేనే సాధించా. రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాం’ అని CM స్పష్టం చేశారు.

News February 28, 2025

కిషన్ రెడ్డి బెదిరింపులకు భయపడం: రేవంత్ రెడ్డి

image

TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెదిరింపులకు భయపడమని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన వల్లే మెట్రో, మూసీ ప్రాజెక్టులు ఆగిపోయాయని పునరుద్ఘాటించారు. మోదీ ప్రభుత్వం ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలని నిలదీశారు. అధికారం కోల్పోతారనే కులగణనకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావట్లేదన్నారు.

News February 28, 2025

APలో రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ముందా?: సీఎం రేవంత్ రెడ్డి

image

TG: BJP, NDA పాలిత రాష్ట్రాల్లో బీసీ ఉప కులాల జాబితాలో ముస్లిం మైనార్టీలు ఉన్నారని CM రేవంత్ వెల్లడించారు. ‘APలో NDA ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? అక్కడ బీసీ మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా కిషన్ రెడ్డి? భావోద్వేగాలను రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారా? APలో SC వర్గీకరణ ఎందుకు చేయడం లేదు? మాదిగలకు ద్రోహం చేయడం లేదా?’ అని CM ప్రశ్నించారు.

News February 28, 2025

స్కూళ్లకు శుభవార్త: మంత్రి లోకేశ్

image

APలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఇది చాలా విప్లవాత్మకమైన నిర్ణయమని చెప్పారు. దీని ద్వారా స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. టీచర్లు, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గిస్తుందని అంచనా వేశారు. బడ్జెట్‌లో పాఠశాల విద్యకు ₹31,805 కోట్లు, ఉన్నత విద్యకు ₹3506 కోట్లు కేటాయించామని, దీని ద్వారా విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని లోకేశ్ వెల్లడించారు.

News February 28, 2025

టన్నెల్ ఘటన.. BIG UPDATE

image

TG: SLBC టన్నెల్‌ ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెస్క్యూ సిబ్బంది గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం మొత్తం స్కానింగ్ చేశారు. ఐదు చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు. చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులు అక్కడే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేపట్టారు. కాగా ఆ ఎనిమిది మంది చనిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

News February 28, 2025

సెల్‌ఫోన్ల రికవరీలో అనంతపురం టాప్

image

AP: సెల్‌ఫోన్ల రికవరీలో అనంతపురం జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో రికవరీ చేసిన 1183 ఫోన్లను బాధితులకు అప్పగించారు. 2022 నుంచి మొత్తం 11,378 మొబైల్స్‌ రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.21.08 కోట్లు ఉంటుందని వెల్లడించారు. మొబైల్ చోరీకి గురైనా/పోయినా <<10494424>>CEIR పోర్టల్‌లో<<>> రిజిస్టర్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.