India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు సిద్ధమైంది. నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తోంది. దీని కోసం రేవంత్ సర్కారు రూ.150 కోట్లు కేటాయించగా గైడ్ లైన్స్ ఖరారు కావాల్సి ఉంది. 30 రోజుల్లో 90వేల మంది సిబ్బందితో ఈ గణన పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు ఫైనల్ చేసి ప్రకటన చేసే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్‌తో టీమ్ఇండియా ఈరోజు రెండో టీ20 ఆడనుంది. ఈమ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులు చేస్తే కోహ్లీ రికార్డును సమం చేయవచ్చు. అత్యంత తక్కువ T20 మ్యాచుల్లో 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచారు. విరాట్ 73 మ్యాచుల్లో 2500 పరుగుల మార్క్‌ను దాటారు. SKY 72 మ్యాచుల్లో 2461 రన్స్ చేశారు. పాక్ బ్యాటర్ బాబర్ 67 మ్యాచుల్లోనే 2500రన్స్ చేసి ప్రథమ స్థానంలో ఉన్నారు.
AP: బాపట్ల జిల్లాను రద్దు చేసే ప్రసక్తే లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. పుకార్లను నమ్మొద్దని ప్రజలను కోరారు. బాపట్ల జిల్లా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో కొత్తగా మార్కాపురం జిల్లా, హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామనే చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు.
TG: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇది గడీల పాలన కాదని, ప్రజా పాలన అని పేర్కొన్నారు. ఈ నెల 11న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలకు భూమి పూజలు చేస్తామన్నారు. మరోవైపు మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయబోమని ఆయన వెల్లడించారు.
పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ ఓ కార్యక్రమంలో కలుసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నిర్మాత DVV దానయ్య కూడా వీరితో ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రభాస్‌తో నీల్ సినిమాలు చేయాల్సి ఉంది. ఒకవేళ చెర్రీతో సినిమా ఉంటే మరో రెండేళ్లకు పట్టాలెక్కే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ అటవీ ప్రాంతంలో టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అయితే, వారిలో ఒక జవాన్ చాకచక్యంగా ఉగ్రవాదుల నుంచి తప్పించుకుని వెనక్కి వచ్చారు. మరో జవాన్ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నిన్ననే జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూలో తమకు పట్టున్న రెండు స్థానాల్లో BJP ఓటమి పాలైంది. హిందూ ఓటర్లు అధికంగా ఉన్న బానీ, రాంబన్ నియోజకవర్గాల్లో ఓటమి చవి చూసింది. బానీ స్థానంలో BJP అభ్యర్థి జెవాన్‌లాల్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థి రామేశ్వర్ సింగ్ ఏకంగా 18,672 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాంబన్‌లో NC అభ్యర్థి అర్జున్ సింగ్ 8,869 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో ఈ రెండు స్థానాల్లో BJP నెగ్గింది.
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఏపీని కూడా రైల్వే శాఖ భాగం చేసిందని కూటమి ఎంపీలకు CM చంద్రబాబు తెలిపారు. తొలి దశలో దక్షిణాదిలో చెన్నై, బెంగళూరు మీదుగా మైసూరు, ముంబై నుంచి HYD వరకు ట్రైన్‌లను ప్రతిపాదించారు. తాజాగా బెంగళూరు, చెన్నై, HYD, అమరావతి నగరాలను కలిపేలా ప్రతిపాదనలు తయారవుతున్నాయని బాబు వెల్లడించారు. నివేదిక సిద్ధం అయ్యాక రైల్వే శాఖ వివరాలు వెల్లడిస్తుందన్నారు.
హరియాణాలోని మహేంద్రగఢ్, పానిపట్‌లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఈవీఎం బ్యాటరీల పర్సంటేజ్‌తో ఈసీకి ఫిర్యాదు చేశారు. EVMలలో 99% బ్యాటరీ ఉన్నచోట BJP, 60-70% ఉన్నచోట కాంగ్రెస్ లీడ్‌లో ఉందని, కుట్ర జరిగిందని ఆరోపించారు. దీనిపై ఈసీ స్పందిస్తూ ‘EVMలలో ఆల్కలీన్ బ్యాటరీలు వాడుతున్నాం. ఇది వోల్టేజీని బట్టి పర్సంటేజ్ తక్కువగా చూపిస్తుంది. ఫలితాలకు బ్యాటరీకి సంబంధం లేదు’ అని పేర్కొంది.
రోజంతా చురుగ్గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలా ఉత్సాహంగా ఉండాలంటే మానసిక, శారీర ఆరోగ్యం బాగుండాలి. అందుకోసం ప్రతిరోజు కాసేపు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. టిఫిన్ స్కిప్ చేయొద్దు. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. రోజూ పుష్కలంగా నీళ్లు తాగాలి. సమయానికి నిద్రపోవాలి. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
Sorry, no posts matched your criteria.