news

News October 8, 2024

UAE నుంచి భారత్‌కు $100bns పెట్టుబడులు: పీయూష్ గోయల్

image

రాబోయే సంవత్సరాల్లో UAE నుంచి $100bns పెట్టుబడులను భారత్ ఆకర్షిస్తుందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డేటా సెంటర్లు, AI, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్ ఇన్ఫ్రా రంగాల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రోత్సాహకంగా వారికి ఉచితంగా భూములు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఈక్విటీల్లో UAE ప్రత్యక్ష పెట్టుబడులు $20bnsగా ఉన్నాయి. 2023లోనే $3bns వచ్చాయి.

News October 8, 2024

రేపు టీడీపీలో చేరనున్న మోపిదేవి, మస్తాన్‌రావు

image

AP: ఆగస్టు 29న వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రేపు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పసుపు కండువాలు కప్పుకోనున్నారు. వారివెంట పెద్దఎత్తున అనుచరులు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది. 2019 డిసెంబర్‌లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మస్తాన్‌రావు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరనున్నారు.

News October 8, 2024

ప్రభుత్వానికి వైన్ డీలర్ల విజ్ఞప్తి

image

AP: కూటమి ప్రభుత్వానికి ఏపీ వైన్ డీలర్ల సంఘం కీలక విజ్ఞప్తి చేసింది. నూతన మద్యం పాలసీలోని నిబంధనను 21(5) మార్చాలని కోరింది. హైవేలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు పాఠశాలల నుంచి మద్యం షాపులు ఉండాల్సిన నిర్దేశిత దూరాన్ని కాలినడక ఆధారంగా కొలిచే విధానాన్ని తొలగించడాన్ని ఆక్షేపించింది. ఒకే లైనులో కొలత వేయాలన్న నిబంధన షాపుల ఏర్పాటుకు అవాంతరంగా మారుతుందని పేర్కొంది.

News October 8, 2024

BIG BREAKING: ఆధిక్యంలో కాంగ్రెస్

image

హరియాణా ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 14 చోట్ల కాంగ్రెస్, 9 చోట్ల బీజేపీ లీడ్‌లో ఉంది. జమ్మూకశ్మీర్‌లో NC-INC 12, బీజేపీ 11, పీడీపీ ఒక చోట, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నారు.

News October 8, 2024

REWIND: మరణంలోనూ వీడని అక్కాచెల్లెళ్ల బంధం

image

ఇజ్రాయెల్‌ పైకి హమాస్‌ దాడి చేసి ఏడాది పూర్తయింది. ఈదాడిలో ఇద్దరు అక్కాచెల్లెలు మరణించిన ఘటనను గుర్తుచేస్తూ ‘ఇజ్రాయెల్’ ట్వీట్ చేసింది. ‘ఇద్దరు అక్కాచెల్లెళ్లకు సంబంధించిన కథ ఇది. వీరిద్దరూ కలిసి జీవిస్తూ, కలిసి నృత్యం చేస్తూ, కలిసి మరణించారు. ఓ మ్యూజికల్ ఫెస్టివల్‌పై హమాస్ జరిపిన దాడిలో ఇద్దరు సోదరీమణులు దుర్మరణం చెందారు. జీవితంలో ఎప్పటికీ విడిపోని వీరు మరణంలోనూ కలిసే ఉన్నారు’ అని పేర్కొంది.

News October 8, 2024

20,310 దరఖాస్తులు.. రూ.406 కోట్ల ఆదాయం

image

ఏపీలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనుంది. మొత్తం 3,396 దుకాణాలకు గాను నిన్న రాత్రి వరకు 20,310 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా విజయనగరంలో 1,689 దరఖాస్తులొచ్చాయి. రూ.2 లక్షల నాన్ రీఫండ్‌బుల్ రుసుముతో ప్రభుత్వానికి రూ.406. 20కోట్ల ఆదాయం లభించింది. నేడు, రేపు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

News October 8, 2024

వాలంటీర్లపై ఎల్లుండి కీలక నిర్ణయం?

image

AP: గ్రామ, వార్డు వాలంటీర్ల కొనసాగింపుపై ఎల్లుండి క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వారికి రూ.10,000 జీతం పెంచి విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉండగా, ఎన్నికల టైమ్‌లో 1.09 లక్షల మంది రాజీనామా చేశారు. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.

News October 8, 2024

వారికి నేరుగా ఇంటర్‌లో ప్రవేశాలు: మంత్రి పొన్నం

image

TG: గురుకులాల్లో పదో తరగతి పాసైన విద్యార్థులకు నేరుగా ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనిపై విద్యాశాఖకు ఆదేశాలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ప్రత్యేక పరీక్ష నిర్వహించేవారిమని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకులాల్లో పది పాసైనా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. గురుకులాల్లో 8వ తరగతి నుంచే NCC, NSS, స్కౌట్స్ అండ్ గైడ్స్, రెడ్ క్రాస్ వంటి అంశాల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.

News October 8, 2024

Stock Markets: నెగటివ్ సిగ్నల్స్.. నేడూ నష్టాలేనా!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజూ నష్టపోయే అవకాశమే ఉంది. ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్సే అందుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిక్కీ, స్ట్రెయిట్ టైమ్స్, హాంగ్‌సెంగ్, తైవాన్ వెయిటెడ్, కోస్పీ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సోమవారం US సూచీలూ ఎరుపెక్కాయి. అనిశ్చితి, వెస్ట్ ఏషియా యుద్ధం, క్రూడాయిల్ రేట్లకు తోడు భారత్‌కు FPIల దెబ్బ ఎక్కువగా ఉంది. ఇక్కడి పెట్టుబడులను చైనా మార్కెట్లకు బదిలీ చేస్తున్నారు.

News October 8, 2024

హరియాణా: హ్యాట్రిక్ కొట్టిన చరిత్రే లేదు

image

హరియాణా ప్రజలు ఇప్పటి వరకు వరుసగా మూడోసారి ఎవరికీ పట్టం కట్టిన చరిత్ర లేదు. గరిష్ఠంగా రెండుసార్లే ఒక పార్టీకి అధికారం అప్పజెప్పారు. 1968, 72లో; 2005, 09లో కాంగ్రెస్‌ను గెలిపించారు. 2014, 19లో బీజేపీని అందలమెక్కించారు. దీనికి బ్రేక్ చేసి హ్యాట్రిక్ అందుకోవాలన్న బీజేపీ కల నెరవేరేలా లేదు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కే తీర్పునిచ్చాయి. JJP ఓటు బ్యాంకు వారికే బదిలీ అయినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

error: Content is protected !!