India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు భారత్‌కు వచ్చారు. తన సతీమణి సాజిదా మహ్మద్‌తో కలిసి ఆయన న్యూఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ముయిజ్జు దేశంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, జైశంకర్ తదితరులతో భేటీ అవుతారు. తాజ్‌మహల్ సందర్శన అనంతరం ఆయన ముంబై, బెంగళూరులో జరిగే పలు వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు.
TG: ఎవరు అడ్డుపడినా మూసీ నది ప్రక్షాళన ఆగదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మూసీ ప్రక్షాళనకు అడ్డుతగులుతున్న BJP MP ఈటల రాజేందర్ కూడా BRS నేతల అడుగుజాడల్లోనే నడుస్తున్నారని సీఎం విమర్శించారు. మూసీ పరీవాహకంలో ఉంటున్న పేదల జీవితాలు బాగుపడవద్దా? అని ప్రశ్నించారు. నిర్వాసితులు అవుతారని ఆలోచిస్తే ప్రాజెక్టులు ఎలా సాధ్యమవుతాయన్నారు.
ఏపీలోని పలు జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ntr, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
JKలో NC-కాంగ్రెస్ కూటమికి మద్దతుపై PDP నేతలు సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని NC చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్వాగతించారు. BJPకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామని PDP సంకేతాలిచ్చింది. దీనిపై ఫరూక్ స్పందిస్తూ ‘అందరం ఒకే లక్ష్యంతో ఉన్నాం. ద్వేషాన్ని నాశనం చేయాలి. JKని ఏకం చేయాల్సి ఉంది’ అని తెలిపారు. Exit Pollsపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. Oct 8న ఎవరి స్థానం ఏంటో తెలుస్తుందన్నారు.
మానవ శరీరంలోని అన్ని భాగాలు వయసును బట్టి పెరుగుతూ ఉంటాయి. అయితే, ఓ ఇంద్రియం మాత్రం చనిపోయేవరకు ఒకే సైజులో ఉంటుందని కార్నెల్ యూనివర్సిటీ న్యూరోబయాలజిస్ట్ చెప్పారు. ‘గర్భంలో ఉన్నప్పటి నుంచి పుట్టిన మూడు నెలల వరకు కళ్లు వేగంగా పెరుగుతాయి. అప్పటి నుంచి ఒకే పరిమాణంలో ఉంటాయి. అదే ముక్కు, చెవులు మాత్రం పెరుగుతాయి’ అని తెలిపారు. అయితే, మరికొందరు మాత్రం 20 ఏళ్ల వరకు కళ్లు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు.
TG: 20ఏళ్లుగా పేదల్లో ఉన్న తనకు పేదోడి దుఃఖం తెలియదా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా? ZP మెంబర్ నుంచి సీఎం అయ్యాను. వాళ్లందర్నీ ఎలా ఆదుకోవాలో చెప్పండి. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పు చేసింది. పేదల కోసం మరో రూ.10వేల కోట్లు అప్పు చేద్దాం. KCRకు 1000ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది. BRS ఖాతాలో రూ.1500కోట్లున్నాయి. అదంతా పేదల డబ్బే’ అని రేవంత్ అన్నారు.
బంగ్లాదేశ్‌తో ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ లెవన్‌లో మయాంక్ యాదవ్‌ను ఆడించాల్సిందేనని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు. ‘మయాంక్ లాంటి ఫాస్ట్ బౌలర్‌ను స్క్వాడ్‌లోకి తీసుకుంటే కచ్చితంగా ఆడించాల్సిందే. తన ఫస్ట్ క్లాస్ మ్యాచుల రికార్డును పట్టించుకోకుండా జాతీయ జట్టుకి తీసుకున్నారు. అలాంటప్పుడు అతడికి అవకాశం ఇవ్వాల్సిందే. కత్తిని కొనేది దాచుకునేందుకు కాదుగా?’ అని ప్రశ్నించారు.
TG: గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ అన్నారు. నిరుద్యోగులు కాంగ్రెస్‌కు అండగా నిలిచి గెలిపించారని ఆయన గుర్తు చేసుకున్నారు. కొత్తగా నియమితులైన ఇంజినీర్లకు హైదరాబాద్‌లోని శిల్పారామంలో సీఎం నియామకపత్రాలు అందించారు. ఉద్యోగుల కళ్లలో సంతోషం చూడాలనే దసరాకు ముందు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. దీంతో 20 ఓవర్లకు పాకిస్థాన్ కేవలం 105/8 రన్స్ చేసింది. ఆ జట్టులో అత్యధిక స్కోరర్ నిదా దార్(28) కావడం గమనార్హం. ఇక భారత బౌలర్లలో అరుంధతీరెడ్డి 3, శ్రేయాంకా పాటిల్ 2 వికెట్లు తీయగా రేణుకా సింగ్, దీప్తిశర్మ, ఆశా శోభన ఒక్కో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 20 ఓవర్లలో 106 రన్స్ చేయాలి.
తన కుమారులు అభయ్, భార్గవ్‌లను సినిమాల్లోకి తీసుకొస్తారా? అన్న ప్రశ్నకు జూ.ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానమిచ్చారు. తన అభిప్రాయాలు, ఇష్టాలను వారిపై రుద్దడం నచ్చదన్నారు. వాళ్లిద్దరి ఆలోచనా తీరులో ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పారు. ‘మూవీల్లోకి రావాలి.. యాక్టింగ్‌లోనే రాణించాలని వాళ్లను ఫోర్స్ చేయను. ఎందుకంటే నా పేరెంట్స్ నన్ను అలా ట్రీట్ చేయలేదు. పిల్లలకు వారి సొంత ఆలోచనలు ఉండాలనుకుంటా’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.