news

News October 6, 2024

DSC పోస్టుల ఎంపికపై కీలక నిర్ణయం

image

TG: పలువురు DSC అభ్యర్థులు 2, 3 పోస్టులకు ఎంపికవడం, వారు ఒక పోస్టులో చేరితే వందల ఖాళీలుండటం ప్రతిసారీ జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తుంది. ఆ తర్వాత SGTల లిస్ట్ ఇస్తుంది. మొదటి జాబితాలో ఉన్నవారెవరైనా రెండో లిస్టులోనూ ఉంటే ఆ పేరును తొలగించేలా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది.

News October 6, 2024

చిన్నారి మర్డర్‌పై టీడీపీ Vs వైసీపీ

image

AP: పుంగనూరులో చిన్నారి అస్పియా <<14288103>>మర్డర్<<>> అధికార, విపక్షాల మధ్య రాజకీయ దుమారానికి తెరతీసింది. ఇది ప్రభుత్వ హత్యేనని YCP ఆరోపించింది. ఇప్పటికే బాలిక ఫ్యామిలీని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు. ఈనెల 9న జగన్ కూడా పుంగనూరుకు వెళ్లనున్నారు. మరోవైపు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హోంమంత్రి అనిత చెప్పారు. చిన్నారి తండ్రిని CM చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడించారు.

News October 6, 2024

ఈ విషయాన్ని గమనించారా?

image

మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా LTE, VoLTE అనే గుర్తును నెట్‌వర్క్ బార్ పక్కన చూసుంటారు. అయితే, అలా ఎందుకు ఉందో చాలా మందికి తెలియదు. VoLTE అంటే వాయిస్ ఓవర్ లాంగ్-టర్మ్ ఎవల్యూషన్. మెరుగైన కాలింగ్ ఫీచర్‌, వాయిస్& డేటాను ఏకకాలంలో ఉపయోగించే సామర్థ్యాన్ని ఇది అందిస్తుంది. HD వాయిస్, వీడియో కాలింగ్, రిచ్ కాల్ సర్వీస్‌ల వంటి మెరుగైన కాలింగ్ ఫీచర్‌లు పొందవచ్చు. ఇది 2011లో అందుబాటులోకి వచ్చింది.

News October 6, 2024

స్వర్ణయుగంలోకి రెసిడెన్షియల్ స్కూల్స్: భట్టి

image

TG: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌తో రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్ స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రూ.5వేల కోట్లతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్‌ స్కూల్స్‌ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. దసరా ముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా పనులకు భూమి పూజ చేస్తామని తెలిపారు. భవనాల డిజైన్‌లకు సంబంధించిన ఫొటోలను ఆయన Xలో పంచుకున్నారు.

News October 6, 2024

7 నెలల్లో స్కూళ్ల నిర్మాణాలు పూర్తి: భట్టి

image

TG: అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని, 7 నెలల్లో ఆ నిర్మాణాలు పూర్తి చేస్తామని డిప్యూటీ CM భట్టి చెప్పారు. దేశానికే ఆదర్శంగా ఈ స్కూల్స్ ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కూల్ ఉంటుందని, ఒక్కో స్కూలుకు రూ.25కోట్లు ఖర్చు చేస్తామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

News October 6, 2024

రిలయన్స్ వల్ల ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు ₹24 కోట్ల న‌ష్ట‌ం

image

రిల‌య‌న్స్‌ సంస్థతో స్పాన్సర్‌షిప్ ఒప్పంద త‌ప్పిదాల వ‌ల్ల భారత ఒలింపిక్ సంఘానికి ₹24 కోట్ల న‌ష్ట‌ం వాటిల్లిన‌ట్టు కాగ్ లెక్క‌గ‌ట్టింది. 2022-2028 వరకు ఆసియా క్రీడ‌లు, కామ‌న్వెల్త్ గేమ్స్‌, Olympicకు Principal Partnerగా రిల‌య‌న్స్‌తో ఒప్పందం జరిగింది. త‌దుప‌రి 2026-30 వింట‌ర్ ఒలింపిక్స్‌, యూత్ ఒలింపిక్ హ‌క్కుల‌నూ రిల‌య‌న్స్‌కు కేటాయించారు. కానీ ఆ మేరకు నిధుల ఒప్పందం జ‌ర‌గ‌లేద‌ని కాగ్ పేర్కొంది.

News October 6, 2024

RBI వడ్డీరేట్ల కోత లేనట్టేనా!

image

RBI MPC అక్టోబర్ మీటింగ్‌లో రెపోరేట్ల కోత ఉండకపోవచ్చని సమాచారం. రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్టు కమిటీ భావిస్తోందని తెలిసింది. వెస్ట్ ఏషియాలో యుద్ధంతో క్రూడాయిల్ ధరలు ఎగిశాయి. దీంతో ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే వడ్డీరేట్ల కోత కోసం డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే. 2023, ఫిబ్రవరి నుంచి రెపోరేట్ 6.5 శాతంగా ఉంది.

News October 6, 2024

INDvPAK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

image

ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా టీమ్ ఇండియా అమ్మాయిలు నేడు పాకిస్థాన్‌తో తలపడుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
పాక్: మునీబా అలీ, గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా, తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా, సాదియా ఇక్బాల్
భారత్: మంధాన, షఫాలీ, హర్మన్‌ప్రీత్, రోడ్రిగ్స్, రిచా, దీప్తి, అరుంధతి, సజన, శ్రేయాంక, శోభన, రేణుక

News October 6, 2024

చంద్రబాబుకు ఇప్పుడు బైబిల్ కావాలి: VSR

image

AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం’ అంటూ ఓ ట్వీట్ చేశారు. అందులో ‘పవిత్ర రంజాన్, మిలాద్ ఉన్ నబి అయిపోయాయి. పవిత్ర దసరా అయిపోవస్తోంది. పవిత్ర క్రిస్మస్ వస్తుంది‌గా వేషం మార్చాలి. అర్జెంట్‌గా బైబిల్ కావాలి. ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్’ అని రాసుకొచ్చారు. బాబువి ఊసరవెల్లి రాజకీయాలు అని ఆయన విమర్శించారు.

News October 6, 2024

ఏపీ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల

image

రాష్ట్రంలో జరుగుతున్న టెట్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈనెల 3న ప్రారంభమైన పరీక్షలు 21న ముగియనున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన పరీక్షల కీని వెబ్‌సైట్లో పెట్టింది. మిగిలిన కీలను పరీక్షల తర్వాతి రోజున రిలీజ్ చేయనుంది. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు టెట్‌కు అప్లై చేశారు. ఫైనల్ కీని అక్టోబర్ 27న, నవంబర్ 2న ఫలితాలు విడుదల చేస్తారు.
వెబ్‌సైట్: <>aptet.apcfss.in<<>>

error: Content is protected !!