news

News October 6, 2024

World Bankకు సలహాలిచ్చే స్థాయికి భారత్: ఫేమస్ ఎకానమిస్ట్

image

సలహాలు తీసుకోవడం మానేసి ప్రపంచ బ్యాంకుకే సలహాలు ఇచ్చే స్థితికి భారత్ చేరిందని ఎకానమిస్ట్ జగదీశ్ భగవతి అన్నారు. ‘మనమిప్పుడు సరికొత్త యుగానికి చేరాం. నాయకత్వమే కీలకం. గతంలో పాలసీలు, ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా దేశం వెనకబడే ఉండేది. కరెక్ట్ టైమ్‌లో మోదీ PM కావడం అదృష్టం. వ్యవస్థలు మారాలని ఆయన ముందు నుంచే చెప్తున్నారు. కేంబ్రిడ్జ్ సహా మేధావులకు లేని కన్విక్షన్ ఆయన సొంతం. అందుకే ఆయనిష్టం’ అని చెప్పారు.

News October 6, 2024

JK: పాక్ ఆయుధాలు, బాంబుల్ని సీజ్ చేసిన ఆర్మీ

image

JK పూంఛ్ జిల్లాలోని జుల్లాస్ ఏరియాలో డేంజరస్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. నమ్మదగిన వారి సమాచారంతో భారత సైన్యం రోమియోఫోర్స్ శనివారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది. అనుమానిత టెర్రరిస్టు బ్యాగును స్వాధీనం చేసుకుంది. ఇందులో AK 47, పాకిస్థానీ పిస్టల్, RCIED, టైమ్ బాంబులు, స్టవ్ IED, IED పరికరాలు, చైనీస్ గ్రెనేడ్లు ఉన్నాయి. ఇవన్నీ రెడీ టు యూజ్ మోడ్‌లో ఉన్నాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

News October 6, 2024

ENCOUNTER: మృతుల్లో 13 మంది మహిళలు

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించగా, అందులో 13 మంది మహిళలు ఉన్నారని బస్తర్ ఐజీ సుందర్ రాజన్ వెల్లడించారు. మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ PLGA 6 బెటాలియన్ సభ్యులని తెలిపారు. అందులో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ తూర్పు బస్తర్ ఇన్‌ఛార్జ్ నీతి అలియాస్ ఊర్మిళ కూడా ఉన్నారని, ఆమెపై రూ.25 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు.

News October 6, 2024

డ్వాక్రా మహిళలకు ‘స్ఫూర్తి’ పథకం.. వివరాలివే

image

AP: రైతులు, చేతివృత్తిదారులకు అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వ ‘స్ఫూర్తి’ పథకాన్ని రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కేంద్రంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలుత 11 జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటుచేస్తారు. ఒక్కో క్లస్టర్‌లో 1,000-1,500మంది మహిళలుంటారు. ఒక్కో ప్రాజెక్టుకు కేంద్రం రూ.5కోట్లు(ఇందులో 90% రాయితీ) ఇస్తుంది. రైతులు, చేతివృత్తిదారుల నుంచి ధాన్యం, వస్తువులను సేకరించి అమ్మకాలు చేపడతారు.

News October 6, 2024

ఏపీకి ప్రత్యేకంగా ‘NCC అకాడమీ’కి కృషి: డిప్యూటీ డైరెక్టర్ జనరల్

image

APకి NCC అకాడమీ లేకపోవడంతో విద్యార్థులకు అవకాశాలు తగ్గుతున్నాయని ఎన్‌సీసీ తెలుగు రాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదనరెడ్డి తెలిపారు. అకాడమీ ఏర్పాటుకు స్థలం కోసం వెతుకుతున్నామన్నారు. ‘ఉమ్మడి APలో ప్రీ రిపబ్లిక్ డే క్యాంపుల్లో 124 మందిని ఎంపిక చేసేవాళ్లం. అకాడమీలు లేకపోవడంతో అదే సంఖ్యను కొనసాగిస్తున్నాం. కొత్తవి ఏర్పాటైతే ఆయుధ శిక్షణ, పరేడ్ గ్రౌండ్ సౌకర్యాలు సమకూరుతాయి’ అని పేర్కొన్నారు.

News October 6, 2024

శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

image

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామి వారిని 75,552 మంది భక్తులు దర్శించుకోగా 35,885 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.54 కోట్లు సమకూరింది.

News October 6, 2024

45 ఏళ్లలో 102TMCలు.. ‘శ్రీశైలం’లో తగ్గిన కెపాసిటీ

image

AP: శ్రీశైలం ప్రాజెక్టులో 1976లో 308.06TMCల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. ప్రాజెక్టులో పూడిక పెరిగిపోవడంతో 2021 నాటికి కెపాసిటీ 205.95TMCలకు పడిపోయింది. 45 ఏళ్లలో 102TMCల సామర్థ్యం తగ్గిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జలసంఘం కలిసి రిమోట్ సెన్సింగ్, హైడ్రో గ్రాఫిక్ సర్వేల ద్వారా ఈ అధ్యయనం చేశాయి. ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకోవాలని సాగునీటి నిపుణులు కోరుతున్నారు.

News October 6, 2024

విజయం ట్రంప్‌దే.. ‘Polymarket’ అంచనా

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్వల్ప తేడాతో విజయం సాధించే అవకాశం ఉందని ‘Polymarket’ అంచనా వేసింది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ట్రంప్‌కు 50.1%, కమలా హారిస్‌కు 48.9% ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రెడిక్షన్ మార్కెట్ గా ‘Polymarket’ కంపెనీ గుర్తింపు పొందింది. కాగా, అమెరికా ఎన్నికలకు ఇంకా 31 రోజులు మిగిలి ఉన్నాయి.

News October 6, 2024

ఇవాళ, రేపు వర్షాలు

image

TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, వికారాబాద్, మల్కాజిగిరి, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 6, 2024

ఇవాళ పాకిస్థాన్‌తో భారత్ పోరు

image

ఇవాళ మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. తొలి మ్యాచులో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమితో భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారీ విజయం నమోదు చేయాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 15 టీ20లు జరగ్గా భారత్ 12, పాక్ 3 మ్యాచుల్లో విజయం సాధించాయి. కాగా మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

error: Content is protected !!