news

News February 28, 2025

జగన్ కుట్రలతో జాగ్రత్త: సీఎం చంద్రబాబు

image

AP: YS జగన్ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలను CM చంద్రబాబు హెచ్చరించారు. గతంలో వివేకా హత్య, కోడికత్తి డ్రామాల నెపం TDPపైన వేశారని వివరించారు. అప్పుడు అప్రమత్తంగా లేకపోవడంతో ఎన్నికల్లో నష్టపోయామని, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఈ కుట్రలను పసిగట్టలేకపోయిందని పేర్కొన్నారు. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలోనూ కుట్ర ఉందని, పోలీసులు CC ఫుటేజ్ అడిగినా ఇవ్వలేదని చెప్పారు.

News February 28, 2025

మెరుగుపడిన Q3 GDP.. 6.2%గా నమోదు

image

FY2024-25 మూడో త్రైమాసికంలో భారత ఎకానమీ 6.2% వృద్ధిరేటు నమోదు చేసింది. రెండో త్రైమాసికంలోని 5.6%తో పోలిస్తే కొంత మెరుగైంది. గ్రామీణ ఆదాయం పెరగడం, ఖరీఫ్ దిగుబడులు మెరుగ్గా ఉండటం ఇందుకు దోహదపడింది. గత ఏడాది క్యూ3 వృద్ధిరేటైన 9.5%తో పోలిస్తే మాత్రం బాగా తక్కువే. తయారీ, మైనింగ్ రంగాల ప్రదర్శన మెరుగ్గా లేకపోవడమే ఇందుకు కారణం. మొత్తంగా ఈ ఆర్థిక ఏడాదిలో GDP 6.5%గా ఉంటుందని NSO అంచనా వేసింది.

News February 28, 2025

ఏఐ ఎఫెక్ట్.. 1350 మంది ఉద్యోగుల తొలగింపు

image

సాంకేతికంగా అద్భుతాలు సృష్టిస్తున్న’AI’ ఉద్యోగులకు శాపంగా మారుతోంది. అమెరికాలో ఆటోడెస్క్ అనే సాప్ట్‌వేర్ కంపెనీ 1350మందిని తొలగించింది. దీని ద్వారా మిగిలిన డబ్బును ‘ఏఐ’ టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే 41శాతం కంపెనీలు ‘ఏఐ’తో ఉద్యోగులను తగ్గించుకుంటామని ప్రకటించాయి. జాబ్‌స్కిల్స్ రిక్వైర్‌మెంట్ తరచుగా మారుతుండటంతో కొత్తవి నేర్చుకోవటం ఎంప్లాయ్స్‌కి ఇబ్బందిగా మారుతోంది.

News February 28, 2025

32,438 ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే లాస్ట్

image

రైల్వేలో 32,438 గ్రూప్-డీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. వాస్తవానికి ఈనెల 22నే గడువు ముగియాల్సి ఉండగా RRB మరో 7 రోజులు పొడిగించింది. మార్చి 4-13 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. టెన్త్ లేదా ITI పాసైన వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి వయో పరిమితిలో సడలింపు ఉంది. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
సైట్: https://www.rrbapply.gov.in/

News February 28, 2025

ట్రేడింగ్ యాక్టివిటీ 30% డౌన్: జెరోధా ఫౌండర్

image

స్టాక్‌మార్కెట్లు గరిష్ఠాలకు చేరినట్టే పతనమూ అవుతున్నాయని జెరోధా ఫౌండర్ నితిన్ కామత్ అన్నారు. ‘ఇకపై సూచీల గమనం ఎటో తెలియదు. బ్రోకింగ్ ఇండస్ట్రీ మాత్రం ఇబ్బంది పడుతోంది. మొత్తంగా 30% యాక్టివిటీ పడిపోయింది. ట్రేడర్లు తగ్గారు. వాల్యూమ్ తగ్గింది. జెరోధా ఆరంభించాక 15ఏళ్లలో తొలిసారి డీగ్రోత్ చూస్తున్నాం. ఇలాగైతే STT ద్వారా ప్రభుత్వం ఆశించిన ₹80K CR కాదు అందులో 50% అయిన ₹40K CR సైతం రాద’ని అంచనా వేశారు.

News February 28, 2025

ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 52% ఓట్లు: పురందీశ్వరి

image

AP: రాజకీయాల్లో మచ్చలేని పార్టీ బీజేపీ అని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి తెలిపారు. గతంలో స్కాముల ప్రభుత్వాలను చూస్తే ఇప్పుడు ప్రధాని మోదీ నేతృత్వంలో స్కీముల సర్కారును చూస్తున్నామన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 52 శాతం సీట్లు వస్తాయని ఓ సర్వేలో తేలిందని చెప్పారు. ఇవాళ ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహితంగా ఉందని కొనియాడారు.

News February 28, 2025

మోకాళ్లలోతు మంచులోనూ..!

image

ఉత్తరాఖండ్‌ చమోలి-బద్రినాథ్ హైవేపై <<15607625>>గ్లేసియర్ బరస్ట్<<>> కారణంగా ఆ ప్రాంతమంతా మోకాళ్లలోతు మంచు పేరుకుపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా మోకాళ్లలోతు మంచు పేరుకుపోయింది. దీంతో అక్కడ చిక్కుకున్న కార్మికులను కాపాడటం ఆర్మీకి కష్టతరమవుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సైనికులు తీవ్రంగా శ్రమించి ఇప్పటి వరకు 10 మందిని రక్షించి వైద్య సహాయం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు.

News February 28, 2025

అకౌంట్లోకి డబ్బులు.. కీలక ప్రకటన

image

TG: రైతుభరోసా డబ్బుల జమపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. 3 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతన్నలకు నిధుల విడుదల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించాలని పేర్కొన్నారు. రైతులకు అందుతున్న ఆర్థిక సాయం, పథకాల అమలు పురోగతిపై బ్యాంకర్లతో చేసిన సమీక్షలో మంత్రి ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించారు.

News February 28, 2025

చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఎక్కడ?: బుగ్గన

image

AP: ప్రజల తీర్పుతో మంచి పాలన చేయకుండా బడ్జెట్‌లోనూ YCPపై విమర్శలు ఎందుకని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. బడ్జెట్‌లో అసలు సూపర్ సిక్స్ అమలుకు కేటాయింపులు లేవని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో ప్రజలు అప్పుల పాలయ్యారని తెలిపారు. సీఎం చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఎక్కడ జరుగుతోందో కూటమి నేతలు చెప్పాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారులో వృద్ధి ఎక్కడని నిలదీశారు.

News February 28, 2025

లిరిసిస్టుకు సారీ చెప్పిన స్టార్ హీరోయిన్

image

కంగనా రనౌత్, జావెద్ అక్తర్ వివాదం సమసింది. వీరిద్దరూ పరస్పరం వేసుకున్న పరువు నష్టం దావా కేసులను వెనక్కి తీసుకున్నారు. ‘ఇన్నేళ్ల తర్వాత ఈ వ్యవహారం ముగిసింది. నాకు కలిగించిన అసౌకర్యానికి ఆమె క్షమాపణ చెప్పారు’ అని అక్తర్ బాంద్రా కోర్టు వద్ద మీడియాకు తెలిపారు. 2016లో Email అంశంపై హృతిక్ రోషన్‌తో కంగనా బహిరంగంగా గొడవపడ్డారు. దీనిపై రోషన్ కుటుంబానికి సారీ చెప్పాలని అక్తర్ కోరడంతో ఈ వివాదం మొదలైంది.