news

News November 1, 2024

SPF భద్రత వలయంలో సచివాలయం

image

తెలంగాణ సచివాలయ భద్రత బాధ్యతలను నేటి నుంచి SPF(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) చూసుకోనుంది. గతంలో TGSP బెటాలియన్‌కు చెందిన సిబ్బంది సచివాలయ భద్రతను చూసుకున్నారు. అయితే రాష్ట్ర విభజనకు ముందు ఈ బాధ్యతలు SPF చూసుకునేది. BRS ప్రభుత్వం TGSPకి అప్పగించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ సచివాలయ బాధ్యతలను SPFకు అప్పగించింది.

News November 1, 2024

భారీగా డ్రగ్స్ పట్టివేత

image

TG: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను DRI అధికారులు తనిఖీ చేయగా 7కేజీల హైడ్రోఫోనిక్ వీడ్ లభ్యమైంది. NTPS చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీజ్ చేసిన ఈ నిషేధిత పదార్థం విలువ రూ.7కోట్లు ఉంటుందని సమాచారం.

News November 1, 2024

సూర్య-జ్యోతికల పిల్లలను చూశారా?

image

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన సినిమాల కోసం ఆత్రుతగా ఎదురుచూసేవారున్నారు. అయితే, తన భార్య నటి జ్యోతికతో తప్ప పిల్లలతో ఆయన మీడియా ముందు కనిపించరు. తాజాగా కుటుంబమంతా కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ ఫొటో వైరలవుతోంది. దీంతో ఈ దంపతుల పిల్లలు ఇంత ఎదిగిపోయారా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News November 1, 2024

రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా: కేటీఆర్

image

TG: పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ తెలిపారు. నిన్న Xలో ప్రజలతో కేటీఆర్ సంభాషణలను BRS ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని, ప్రజల పక్షాన కొట్లాడడమే తమ ప్రస్తుత బాధ్యత అని చెప్పారు. BRS నేతలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

News November 1, 2024

మహారాష్ట్రలో 100ఏళ్ల ఓటర్లు 47,000 మంది

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. కాగా అక్కడి ఓటర్ల జాబితాను పరిశీలించగా రాష్ట్రంలో మొత్తం 9.7 కోట్ల ఓటర్లు ఉంటే 100ఏళ్ల వయసు పైబడిన వారు ఏకంగా 47,392 ఉన్నట్లు తేలింది. ఈసారి ఎన్నికల్లో ఓటు వేయనున్న అత్యంత వృద్ధ ఓటర్ వయసు 109ఏళ్లు. 18-19ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 22,22,704గా ఉంది.

News November 1, 2024

పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష

image

TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, మార్కెట్‌కు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులు 8897281111 హెల్ప్‌లైన్ నంబరు సేవలను వినియోగించుకోవాలని కోరారు. కాగా అకాల వర్షాలకు మార్కెట్లలో ఉన్న పత్తి తడిచిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

News November 1, 2024

రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రకు జీవం పోశారు: ప్రశాంత్

image

దీపావళి సందర్భంగా రిలీజైన ‘జై హనుమాన్’ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చిందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. జాతీయ అవార్డు గ్రహీత నటుడు రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రకు జీవం పోశారంటూ ట్వీట్ చేశారు. ‘అద్భుతమైన పరివర్తన, ఖచ్చితమైన పరిపూర్ణత, మీ నిబద్ధత జై హనుమాన్‌ని అసాధారణమైనదిగా మార్చాయి. మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు, ఇంకా జై హనుమాన్ ప్రయాణాన్ని మీతో ప్రారంభించేందుకు ఎగ్జైట్‌గా ఉన్నా’ అని తెలిపారు.

News November 1, 2024

బాలికపై నలుగురు మైనర్ల అత్యాచారం

image

తెలుగు రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు కలకలం రేపాయి. TGలోని వికారాబాద్(D) దోమ పీఎస్ పరిధిలో 8వ తరగతి చదువుతున్న బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం చేేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఏపీలోని తూ.గో(D) కడియం(M)కు చెందిన వివాహిత మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. అదే గ్రామానికి చెందిన నలుగురు ఆమెను హత్యాచారం చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

News November 1, 2024

ధోనీకి రూ.4కోట్లే ఎందుకో తెలుసా?

image

నిన్నటి IPL రిటెన్షన్స్‌లో MS ధోనీని కేవలం రూ.4కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. అయితే గతేడాది రూ.12కోట్లు తీసుకున్న Mr.కూల్‌ను ఈసారి కేవలం రూ.4కోట్లకే తీసుకోవడానికి కారణం అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్. దీని ప్రకారం గత 5ఏళ్లలో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని క్రికెటర్‌ను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణిస్తారు. వారిని రూ.4కోట్లకే రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో దాన్ని CSK వినియోగించుకుంది.

News November 1, 2024

రిటెన్షన్ల అనంతరం IPL జట్ల పర్స్ వాల్యూ..

image

➣సీఎస్కే – రూ. 55 కోట్లు ➣MI – రూ. 45 కోట్లు ➣కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 51 కోట్లు ➣RR – రూ. 41 కోట్లు ➣పంజాబ్ కింగ్స్ – రూ. 110.5 కోట్లు ➣లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 69 కోట్లు ➣SRH – రూ. 45 కోట్లు ➣GT – రూ. 69 కోట్లు ➣RCB – రూ. 83 కోట్లు ➣DC – రూ. 73 కోట్లు
➥➥KKR, RR ఆరుగురిని రిటైన్ చేసుకోగా పంజాబ్ ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లనే అట్టిపెట్టుకుని అత్యధిక పర్స్ వాల్యూ కలిగి ఉంది.