news

News February 28, 2025

పోసాని బెయిల్ పిటిషన్.. సోమవారం విచారణ

image

APFDC మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. ఆయన తరఫు న్యాయవాది రైల్వేకోడూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జడ్జి విచారణకు స్వీకరించలేదు. రేపటి నుంచి ట్రైనింగ్‌కు వెళ్తున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శని, ఆదివారం సెలవు కావడంతో సోమవారమే విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను రాజంపేట సబ్‌జైలుకు తరలించారు.

News February 28, 2025

ఫేక్ జాబ్ నోటిఫికేషన్‌తో స్కామర్ల కొత్త మోసం..!

image

ఉద్యోగ వేటలో ఉన్న వారిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచుతున్నారు. లింక్డ్‌ఇన్‌లో ఫేక్ జాబ్ నోటిఫికేషన్లను స్కామర్లు పోస్ట్ చేస్తున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ‘జాబ్ అప్లై చేసిన వారికి స్కామర్లు కాల్ చేసి ‘Grass Call’ అనే వీడియో కాల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. దీనిద్వారా సదరు వ్యక్తి ఫోన్, కంప్యూటర్‌లోని డేటా, బ్యాంక్ వివరాలతో సహా ప్రైవసీ సమాచారాన్ని తస్కరిస్తున్నారు’ అని వారు తెలిపారు.

News February 28, 2025

బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం: బొత్స

image

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సూపర్-6లోని ఒకట్రెండు పథకాలు తప్ప మిగిలిన వాటి ఊసే లేదని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ‘ఈ బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలకు అన్యాయమే. ఆత్మ స్తుతి పర నిందగానే బడ్జెట్ సాగింది. జగన్‌ను తిట్టడం.. చంద్రబాబు, లోకేశ్‌ను పొగడడం తప్ప ఏమీ లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News February 28, 2025

Income Tax కొత్త షాక్

image

పన్ను ఎగవేతదారులను పట్టుకొనేందుకు IT Dept ఏ దారీ వదలడం లేదు. కుటుంబ సభ్యుల వివరాలు, గ్రాసరీస్, షాపింగ్, లైఫ్‌స్టైల్ కోసం ఎవరెంత ఖర్చు పెడుతున్నారో చెప్పాలని కొందరిని కోరినట్టు తెలిసింది. చెప్పకపోతే ఏటా రూ.కోటి ఖర్చుచేసినట్టు భావిస్తామని హెచ్చరించింది. లగ్జరీ లైఫ్‌స్టైల్, అధిక ఆదాయం ఉన్నప్పటికీ తక్కువ డబ్బు విత్‌డ్రా చేస్తుండటంతో ఇలా చేసింది. వారికి మరో ఆదాయ వనరు ఉన్నా చెప్పడం లేదని భావిస్తోంది.

News February 28, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, హెడ్, స్మిత్, లబూషేన్, ఇంగ్లిస్, కేరీ, మ్యాక్స్‌వెల్, డ్వార్షియష్, ఎల్లిస్, జంపా, జాన్సన్.
అఫ్గాన్: గుర్బాజ్, జద్రాన్, అటల్, రహ్మత్, హస్మతుల్లా, ఒమర్జాయ్, నబీ, నాయబ్, రషీద్, నూర్, ఫరూఖీ.

News February 28, 2025

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వాణీ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో వెల్లడించారు. తమ జీవితంలోకి చిన్నారి రాబోతున్నట్లు హింట్ ఇస్తూ ఫొటోను పోస్ట్ చేశారు. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ఈ అమ్మడు 2023లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ బ్యూటీ భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించారు.

News February 28, 2025

ఆ రేపిస్టుల కన్నా పిశాచాలే మేలేమో!

image

ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీత లోకంలో.. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో.. మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృ హృదయ నిర్వేదం.. అని వేటూరి రాసింది అక్షరసత్యం. రేపిస్టుల దారుణాలను చూస్తే వారి కన్నా పిశాచాలే మేలేమో అనిపిస్తోంది. పుణేలో బస్సులో యువతిపై అత్యాచారం. గ్వాలియర్లో ఐదేళ్ల <<15601122>>చిన్నారి<<>>పై అఘాయిత్యం. రక్తపు మడుగులో పడున్న ఆమె మర్మాంగాలకు 29 కుట్లు పడ్డాయి. ఏం చేస్తే వీళ్లు మారేను!

News February 28, 2025

విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదు: స్టాలిన్

image

Ai కాలంలో విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ‘ట్రాన్స్‌లేషన్ కోసం టెక్నాలజీ రావడంతో భాషకు అడ్డంకులు తొలగిపోయాయి. పిల్లలను అదనపు భాషతో ఇబ్బంది పెట్టొద్దు. వాళ్లు మదర్ టంగ్‌తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో పట్టు కోసం ఇంగ్లిష్ నేర్చుకుంటే చాలు’ అని ట్వీట్ చేశారు. కాగా, NEPలో భాగంగా దేశవ్యాప్తంగా స్థానిక భాషతో పాటు హిందీ, ఇంగ్లిష్ తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.

News February 28, 2025

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు: షర్మిల

image

AP: కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్ అంతా అంకెల గారడీ, అభూత కల్పన అని వైఎస్ షర్మిల విమర్శించారు. ‘ఇది పస లేని బడ్జెట్. రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ అంతా డొల్ల. సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.11 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటే రూ.6300 కోట్లే కేటాయించారు. తల్లికి వందనం నిధుల్లో కోత పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి ఊసే లేదు’ అని మండిపడ్డారు.

News February 28, 2025

బ్లడ్‌బాత్: రూ.50లక్షల కోట్లు హాంఫట్

image

అంతర్జాతీయ పరిణామాలతో స్టాక్‌మార్కెట్లు కుదేలవుతున్నాయి. సెప్టెంబర్ నాటి గరిష్ఠ స్థాయుల నుంచి బెంచ్‌మార్క్ సూచీలు భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో ₹50లక్షల కోట్ల సంపద ఆవిరైంది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 గరిష్ఠ స్థాయి నుంచి 25% పతనమవ్వడంతో ₹5.25లక్షల కోట్లు, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 పీక్ నుంచి 21% తగ్గడంతో ₹13.35లక్షల కోట్లు కరిగిపోయాయి. ఇక నిఫ్టీ50 14% క్రాష్ అవ్వడంతో ₹31.94లక్షల కోట్ల నష్టం వచ్చింది.