India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ పరిధిలోని ESI ఆస్పత్రుల్లో 600 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. MHSRB ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 124, స్టాఫ్ నర్సులు-272, ఫార్మాసిస్ట్-99, ల్యాబ్ టెక్నీషియన్-34, ANM-54, రేడియోగ్రాఫర్ 5 సహా మరికొన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు.
TGలోని HYD, KMM, NLG, SRPT, MBNR, ములుగు, భద్రాద్రి, NRPT, నాగర్ కర్నూల్, RR, వికారాబాద్, MHBD, SRD, WNP, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు APలో మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి, గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని APSDMA పేర్కొంది.
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6 నుంచి హాలిడేస్ ఇచ్చారు. స్కూళ్లకు మాత్రం 3 నుంచి 14 వరకు సెలవులు ఇవ్వడంపై ఇంటర్ పలు లెక్చరర్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బతుకమ్మ, దసరా చాలా ముఖ్యమైన పండుగలు అని, అందరికీ ఒకేలా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. మరోవైపు ఏపీలో స్కూళ్లకు, కాలేజీలకు రేపటి నుంచి హాలిడేస్ రానున్నాయి. గాంధీ జయంతి కావడంతో నేడు కూడా సెలవే.
AP: ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వాలని విద్యార్థులు, లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకూ దసరా సెలవులు ఇచ్చినా, ప్రైవేట్ కాలేజీలకు 3, 4, 5 తేదీల్లో క్లాసులు నిర్వహించుకునేలా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల మధ్య తేడా ఎందుకుని, ఇవాళ్టి నుంచే సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు.
AP: పదో తరగతి హిందీ పుస్తకంలో నాలుగు పాఠాలను తొలగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. NCERT పాఠ్యాంశాలు బోధించేందుకు, చదివేందుకు క్లిష్టతరంగా ఉన్నాయన్న ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తొలగించిన వాటిలో పద్యభాగంలో 7వ పాఠం ఆత్మత్రాణ్, గద్యభాగంలో 11వ పాఠం తీసరి కసంకే శిల్పకార్ శైలేంద్ర్, 12వ పాఠం అబ్ కహ దౌసరోంకే దుఃఖ్ సే దుఃఖీ హోనేవాలే, ఉపవాచకంలో 3వ పాఠం టోపీ శుక్ల ఉన్నాయి.
AP: అధికారం చేపట్టిన 110 రోజుల్లో పింఛన్ల కోసం కూటమి ప్రభుత్వం రూ.12,508 కోట్లు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘1వ తేదీనే 98% మంది లబ్ధిదారులు ఇంటి వద్దనే పింఛను అందుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 64.38 లక్షల మందికి పింఛను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
TG: స్వయం సహాయక బృందాల కోసం ప్రభుత్వం మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనుంది. వీటి కోసం ఒక్కో నియోజకవర్గంలో 2-3 ఎకరాల భూమి సేకరించాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఒక్కో పార్కులో రెండంతస్తుల భవనాలను నిర్మించాలన్నారు. ప్రస్తుతం ఉన్న 65 లక్షల SHGలను 75 లక్షలకు పెంచాలని సూచించారు.
గాంధీజీ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. రోజువారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకునేవారు. ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే దంపుడు బియ్యాన్ని మాత్రమే తినేవారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలనే ఇష్టపడేవారు. చక్కెరను పక్కనబెట్టి బెల్లం టీ తాగేవారు. రోజూ 15 కి.మీ నడవడంతో పాటు ప్రాణాయామం, వ్యాయామాలు చేసేవారు. ధూమపానం, మద్యపానం, మాంసాహారానికి బాపూజీ దూరం.
చాలా ఏళ్లుగా ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ఉంటోంది. 1948లో తొలిసారిగా ఇజ్రాయెల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించింది అమెరికానే. 1967లో పశ్చిమాసియాపై రష్యా ఆధిపత్యం పెరిగిపోకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంది. దీంతో అమెరికా దృష్టిని ఇజ్రాయెల్ ఆకర్షించింది. మిడిల్ ఈస్ట్‌పై పట్టుకు ఇజ్రాయెల్ తమకు ఉపయోగపడుతుందని స్నేహబంధం కొనసాగిస్తూ వస్తోంది. అలాగే అమెరికాలో యూధులు రాజకీయంగా చాలా ప్రభావం చూపగలరు.
న్యూజిలాండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ తప్పుకున్నారు. అతని స్థానంలో బ్యాటర్ టామ్ లాథమ్ కెప్టెన్‌గా నియామకం అయ్యారు. అక్టోబర్ 16 నుంచి INDతో జరిగే 3 మ్యాచుల టెస్ట్ సిరీస్ నుంచి లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. IND, NZ మధ్య OCT 16 నుంచి బెంగళూరులో తొలి టెస్ట్, 24 నుంచి పుణేలో రెండో టెస్ట్, నవంబర్ 1 నుంచి ముంబైలో మూడో టెస్ట్ జరగనుంది.
Sorry, no posts matched your criteria.