India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ తెలిపారు. నిన్న Xలో ప్రజలతో కేటీఆర్ సంభాషణలను BRS ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని, ప్రజల పక్షాన కొట్లాడడమే తమ ప్రస్తుత బాధ్యత అని చెప్పారు. BRS నేతలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. కాగా అక్కడి ఓటర్ల జాబితాను పరిశీలించగా రాష్ట్రంలో మొత్తం 9.7 కోట్ల ఓటర్లు ఉంటే 100ఏళ్ల వయసు పైబడిన వారు ఏకంగా 47,392 ఉన్నట్లు తేలింది. ఈసారి ఎన్నికల్లో ఓటు వేయనున్న అత్యంత వృద్ధ ఓటర్ వయసు 109ఏళ్లు. 18-19ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 22,22,704గా ఉంది.
TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, మార్కెట్‌కు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులు 8897281111 హెల్ప్‌లైన్ నంబరు సేవలను వినియోగించుకోవాలని కోరారు. కాగా అకాల వర్షాలకు మార్కెట్లలో ఉన్న పత్తి తడిచిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
దీపావళి సందర్భంగా రిలీజైన ‘జై హనుమాన్’ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చిందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. జాతీయ అవార్డు గ్రహీత నటుడు రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రకు జీవం పోశారంటూ ట్వీట్ చేశారు. ‘అద్భుతమైన పరివర్తన, ఖచ్చితమైన పరిపూర్ణత, మీ నిబద్ధత జై హనుమాన్‌ని అసాధారణమైనదిగా మార్చాయి. మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు, ఇంకా జై హనుమాన్ ప్రయాణాన్ని మీతో ప్రారంభించేందుకు ఎగ్జైట్‌గా ఉన్నా’ అని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు కలకలం రేపాయి. TGలోని వికారాబాద్(D) దోమ పీఎస్ పరిధిలో 8వ తరగతి చదువుతున్న బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం చేేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఏపీలోని తూ.గో(D) కడియం(M)కు చెందిన వివాహిత మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. అదే గ్రామానికి చెందిన నలుగురు ఆమెను హత్యాచారం చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
నిన్నటి IPL రిటెన్షన్స్‌లో MS ధోనీని కేవలం రూ.4కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. అయితే గతేడాది రూ.12కోట్లు తీసుకున్న Mr.కూల్‌ను ఈసారి కేవలం రూ.4కోట్లకే తీసుకోవడానికి కారణం అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్. దీని ప్రకారం గత 5ఏళ్లలో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని క్రికెటర్‌ను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణిస్తారు. వారిని రూ.4కోట్లకే రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో దాన్ని CSK వినియోగించుకుంది.
➣సీఎస్కే – రూ. 55 కోట్లు ➣MI – రూ. 45 కోట్లు ➣కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 51 కోట్లు ➣RR – రూ. 41 కోట్లు ➣పంజాబ్ కింగ్స్ – రూ. 110.5 కోట్లు ➣లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 69 కోట్లు ➣SRH – రూ. 45 కోట్లు ➣GT – రూ. 69 కోట్లు ➣RCB – రూ. 83 కోట్లు ➣DC – రూ. 73 కోట్లు
➥➥KKR, RR ఆరుగురిని రిటైన్ చేసుకోగా పంజాబ్ ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లనే అట్టిపెట్టుకుని అత్యధిక పర్స్ వాల్యూ కలిగి ఉంది.
దేశవ్యాప్తంగా దీపావళి వెలుగులు విరజిమ్మాయి. నింగిలోకి దూసుకెళ్లే రాకెట్లు, భారీ ఔట్లతో ఊరూవాడా మోత మోగింది. అయితే పండుగ అందరికీ ఘనం కాదు కదా. ఖర్చు పెట్టలేని వారు ఎందరో ఉన్నారు. అయితే ఢిల్లీలో ఓ రిక్షావాలా తనకు ఉన్నంతలో పండుగను జరుపుకున్న తీరు ఆకట్టుకుంటోంది. రిక్షాను కొవ్వొత్తులతో నింపి దీపావళి విజయ కాంతులు తన జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
AP: ఏలూరు(D) దెందులూరులో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగడంపై MLA చింతమనేని ప్రభాకర్ స్పందించారు. YCP అరాచక శక్తులు జనసేనలో చేరి గొడవలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. అలాంటి నేతలకు పెన్షన్లు పంచే హక్కు లేదని అన్నారు. జనసేన పేరుతో వారంతా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వచ్చారన్నారు. భౌతిక దాడులకు పాల్పడితే ఊరుకోమని హెచ్చరించారు. దీనిపై జనసేన అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న సినిమా టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ ఖరారు చేస్తూ స్పెషల్ పోస్టర్ పోస్ట్ చేశారు. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండనుంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందించారు. కాగా వచ్చే ఏడాది జనవరి 10న రామ్ చరణ్ నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ కూడా విడుదలవనుంది.
Sorry, no posts matched your criteria.