news

News February 28, 2025

కారు ఇన్సూరెన్స్‌లో ఈ 4 యాడ్ ఆన్స్ తప్పనిసరి!

image

* జీరో డిప్రెసియేషన్: దీనివల్ల ఫుల్ క్లెయిమ్ అందుతుంది.
* ఇంజిన్ ప్రొటెక్షన్: ఇది యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల ఇంజిన్ రిపైర్, రీప్లేస్‌మెంట్ సదుపాయం ఉంటుంది.
* రోడ్ సైడ్ అసిస్టెంట్: ప్రయాణంలో మీ కారు బ్రేక్ డౌన్ అయితే టోయింగ్, ఫ్యూయల్ అందించడం, బ్యాటరీ తదితర రిపైర్స్ చేస్తారు.
* కంన్జ్యూమబుల్ కవరేజీ: రిపేర్ సమయంలో ఇంజిన్ ఆయిల్, నట్లు, బోల్టులు, బ్రేక్ ఆయిల్ వంటి వాటికీ రీయింబర్స్‌మెంట్.

News February 28, 2025

హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటి?: కనిమొళి

image

తమిళులపై కేంద్రం హిందీ భాషను రుద్దడంపై DMK MP కనిమొళి తీవ్రంగా మండిపడ్డారు. అసలు హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నించారు. ఆ భాష వల్ల ఏం సాధిస్తామన్నారు. తాను ఎన్నడూ హిందీ నేర్చుకోలేదని, స్కూలుకెళ్లే తన కుమారుడూ ఆ భాషను నేర్చుకోవడం లేదన్నారు. TNలోని ప్రతీ విద్యార్థికి హిందీ రావాలని లేదని తెలిపారు. నూతన విద్యావిధానాన్ని అమలు చేయనందుకు కేంద్రం రూ.5000Cr ఫండ్స్‌ను నిలిపివేసిందని ఆరోపించారు.

News February 28, 2025

CT: మరో సంచలనమా?.. దాసోహమా?

image

మొన్న ENGను చిత్తు చేసిన అఫ్గాన్ ఇవాళ AUSతో పోరుకు సిద్ధమవుతోంది. మ.2.30 గంటలకు ఇరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ చేరనుండగా ఓడిన టీమ్ ఇంటిబాట పట్టనుంది. ENGను ఓడించి ఊపులో ఉన్న AFG.. AUSను కూడా కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ అది అంత ఈజీ కాదు. ICC టోర్నీలంటే రెచ్చిపోయే AUS.. AFGపై విరుచుకుపడే అవకాశం ఉంది. మరి మరో సంచలనం నమోదవుతుందో? AUSకు AFG దాసోహం అవుతుందో?

News February 28, 2025

‘కన్నప్ప’ ఆఫర్‌ను రెండుసార్లు రిజెక్ట్ చేశా: అక్షయ్ కుమార్

image

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’లో శివుడి క్యారెక్టర్ చేసేందుకు ముందు 2 సార్లు ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశానని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తెలిపారు. కానీ ఆ పాత్రకు తానే సరిగ్గా సరిపోతానంటూ విష్ణు చెప్పిన విధానం నచ్చడంతో అంగీకరించినట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రం విడుదల తర్వాత శివుడి గురించి ఎవరు ఆలోచించినా అక్షయ్ రూపమే దర్శనమిస్తుందని విష్ణు అన్నారు. కన్నప్ప APR 25న రిలీజ్ కానుంది.

News February 28, 2025

అంతరిక్షంలోకి హాలీవుడ్ సింగర్

image

హాలీవుడ్ సింగర్ కేటి పెర్రీ స్పేస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ ఈ ఏడాది న్యూ షెపర్డ్ స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపనుంది. అందులో ఆరుగురు సభ్యులు గల మహిళా బృందం వెళ్లనుంది. పెర్రీతో పాటు బెజోస్ ఫియాన్సీ సాంచెజ్, నటి గెయిల్ కింగ్, సామాజిక కార్యకర్త అమండా, నిర్మాత కరియన్నె ఫ్లిన్, నాసా మాజీ రాకెట్ సైంటిస్ట్ ఐషా బొవే వెళ్లనున్నారు.

News February 28, 2025

త్రివేణీ సంగమం వద్ద అగ్నిప్రమాదం

image

మహా కుంభమేళా జరిగిన ప్రాంతంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో ఓ వ్యక్తి గాయపడగా అతడిని ఆసుపత్రికి తరలించారు. త్రివేణీ సంగమం వద్ద ఉన్న శాస్త్రి బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మహా కుంభమేళా జరిగిన రోజుల్లోనూ పలుమార్లు అగ్నిప్రమాదాలు సంభవించాయి. బుధవారంతో కుంభమేళా ముగిసింది.

News February 28, 2025

చరిత్రలో ఈరోజు.. ఫిబ్రవరి 28

image

* జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం
* ప్రపంచ దర్జీల దినోత్సవం
* 1927- భారత మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ జననం
* 1928- విద్యా, సామాజికవేత్త తుమ్మల వేణుగోపాల రావు జననం
* 1948- రంగస్థల నటీమణి పువ్వుల రాజేశ్వరి జననం
* 1963- భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మరణం(ఫొటోలో)

News February 28, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 28, 2025

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: ఏటా ఫిబ్రవరి 4న ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వం మరోసారి తన నిబద్ధతను చాటుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దినోత్సవం నాడు అవగాహన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, వ్యక్తులను గుర్తించి అవార్డులు ఇవ్వడం, సంక్షేమ శిబిరాలు నిర్వహించడం వంటివి చేయనుంది.

News February 28, 2025

SEBI చీఫ్‌గా తుహిన్ కాంత పాండే

image

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) చీఫ్‌గా తుహిన్ కాంత పాండేను కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. తుహిన్ సెబీ ఛైర్మన్‌‌గా మూడేళ్లు పదవిలో ఉండనున్నారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న మాధవి పురీ బుచ్ పదవీకాలం నిన్నటితో ముగిసింది. కాగా ఇటీవల ఆమె తీవ్ర ఆర్థిక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.