India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెస్టుల్లో ఒక కాలెండర్ సంవత్సరంలో అత్యధిక సిక్సులు కొట్టిన జట్టుగా భారత్ అవతరించింది. ఈ ఏడాది 14 ఇన్నింగ్స్‌లలోనే 90 సిక్సులు కొట్టి చరిత్ర లిఖించింది. బంగ్లాతో 2వ టెస్టులో ఈ ఫీట్ సాధించి, 2022లో ఇంగ్లండ్ (29 ఇన్నింగ్స్‌లలో 89 సిక్సులు) నెలకొల్పిన రికార్డును తిరగరాసింది. ఈ ఏడాది మరిన్ని టెస్టు మ్యాచులున్న నేపథ్యంలో భారత్ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది.
TG: దసరా, బతుకమ్మ పండుగల రద్దీ దృష్ట్యా 6వేల స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు TGSRTC ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి 15 వరకు తెలంగాణ నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు ఈ బస్సులు నడుపుతున్నామంది. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో MGBS, JBS, LB నగర్, ఉప్పల్, ఆరాంఘర్, KPHB నుంచి సర్వీసులు ఉంటాయంది. విజయవాడ, బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సమయాభావం తగ్గించేలా గచ్చిబౌలి ORR మీదుగా బస్సులు తిప్పుతామంది.
AP: దసరా రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు APSRTC ప్రకటించింది. అక్టోబర్ 4-20 వరకు 6100 బస్సులు నడుపుతామని, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఇతర నగరాలకు బస్సులు తిప్పుతామంది. అక్టోబర్ 4-11 వరకు 3040 బస్సులు, అక్టోబర్ 12-20 వరకు 3060 బస్సులు తిరుగుతాయని చెప్పింది. ఈ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని, ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన ‘కాంతార’కు రిషబ్ శెట్టి ప్రీక్వెల్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాంతారలో హీరో తండ్రి పాత్రలో కూడా రిషబ్ కనిపించారు. ప్రీక్వెల్‌లో ఆయన కథ ఉంటుందని సమాచారం. ఆ పాత్రకు తండ్రి రోల్‌లో మోహన్‌లాల్ కనిపిస్తారని కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రీక్వెల్‌పై తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి.
రేపటి నుంచి <<14234046>>PM E-DRIVE<<>> అమలుకానుంది. EV 2Ws, 3Ws, అంబులెన్స్‌లు, ట్రక్కులపై రాయితీ కోసం ఈ స్కీం పోర్టల్‌లో ఆధార్ అథెంటికేషన్‌తో ఈ-వోచర్ జనరేట్ చేయాలి. వోచర్ లింక్ ఫోన్‌కు వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకొని సంతకం చేసి డీలర్‌కు ఇవ్వాలి. డీలర్ కూడా దీనిపై సంతకం చేసి పోర్టల్‌లో సబ్మిట్ చేస్తారు. ఇద్దరూ సంతకాలు చేసిన వోచర్ SMS వస్తుంది. తద్వారా EV తయారీదారు రీయింబర్స్ క్లైం చేసుకుంటారు.
AP: తిరుమల లడ్డూ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కల్తీ నెయ్యిని సరఫరా చేశారంటూ TTD ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే శాంపిల్స్ సేకరణ, దాన్ని విశ్లేషించడంలో అధికారులు నిబంధనలు పాటించలేదని రాజశేఖరన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అరెస్ట్ సహా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోరారు. బెయిల్ మంజూరులో ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానన్నారు.
తిరుమల లడ్డూ విషయంలో సుప్రీం కోర్టు AP CM చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తవ్వకముందే ప్రకటన చేయాల్సిన అవసరం ఏముందంటూ ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో ‘CBN Should Apologize Hindus’ అన్న హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వైసీపీ ఈ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తోందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా, హిందువులందరూ CBNని క్షమాపణ అడుగుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలు తేల్చిచెబుతున్నారు.
కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా చంద్రుడిపై ఉష్ణోగ్రతలు తగ్గాయని భారత పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వారి నివేదిక ప్రకారం.. 2017-23 మధ్యకాలంలో చంద్రుడిపై 6 వివిధ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతల్ని నాసా ఆర్బిటర్ డేటా సాయంతో స్టడీ చేశారు. ఈక్రమంలో లాక్‌డౌన్ కాలంలో చందమామపై టెంపరేచర్ గణనీయంగా తగ్గిందని గుర్తించారు. కాలుష్యం తగ్గడంతో భూమి నుంచి వెలువడే రేడియేషన్ కూడా తగ్గడమే దీనికి కారణం కావొచ్చని వారు అంచనా వేశారు.
TG: హైడ్రాకు ఎంఐఎం ఎమ్మెల్యేలు హెచ్చరికలు జారీ చేశారు. పాతబస్తీలో సర్వేకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. ఇప్పటివరకు తమ ఇలాఖాలోకి వచ్చే ధైర్యం ఎవరూ చేయలేదని చెప్పారు. బుల్డోజర్లు వస్తే తమ పైనుంచే వెళ్లాలని అల్టిమేటం జారీ చేశారు.
మహారాష్ట్రలోని షోలాపూర్(D) షెట్పాల్ గ్రామంలో నాగుపాములు కుటుంబసభ్యుల్లా ఇంట్లోనే తిరుగుతుంటాయి. గ్రామస్థులు ఎంతో ప్రేమగా చూసుకుంటుండగా పిల్లలు వాటితో ఆడుకుంటారు. సర్పాలను శివుడి ప్రతిరూపాల్లా భావిస్తూ ఇంట్లో అవి ఉండే ప్రాంతాన్ని దేవాలయంగా పరిగణిస్తుంటారు. ఇప్పటివరకు ఈ విషసర్పాలు కాటేసిన ఘటనలు గ్రామంలో వినిపించలేదు. పాము-మనుషుల మధ్య ఉన్న బంధాన్ని చూసేందుకు పర్యాటకులు ఆ గ్రామాన్ని సందర్శిస్తుంటారు.
Sorry, no posts matched your criteria.