India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: నంద్యాల జిల్లా ఆత్మకూరులోని నీలితొట్ల వీధిలో కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోవడం కలకలం రేపింది. మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నీరు ఎలా కలుషితం అయ్యిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఈ ఏడాది టీమ్ఇండియా మరో మూడు మ్యాచులు ఆడే అవకాశముంది. ఆసియా కప్-2025లో అన్నీ కుదిరితే ఇరుజట్లు మూడు సార్లు తలపడతాయని సమాచారం. గ్రూప్ దశలో ఓసారి, సూపర్ ఫోర్ దశలో మరోసారి, ఫైనల్ వరకు వెళ్తే ఇంకోసారి తలపడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీ శ్రీలంక లేదా యూఏఈలో జరిగే అవకాశం ఉంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.

AP: విజయవాడ కోర్టులో మేజిస్ట్రేట్ వద్ద వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆస్తమా ఉందని, తనతో పాటు సెల్‌లో మరొకరిని ఉంచాలని కోరారు. భద్రతాపరంగా తనకు ఇబ్బంది లేదని వివరించారు. సెల్‌లో మరొకరిని ఉంచేందుకు ఇన్‌ఛార్జ్ జడ్జిగా తాను ఆదేశించలేనన్న న్యాయమూర్తి, సెల్ మార్పు కోసం రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేయాలని ఆదేశించారు. వంశీ సెల్ వద్ద వార్డెన్‌ను ఉంచాలని జైలు అధికారులకు జడ్జి స్పష్టం చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో PAK చెత్త రికార్డు నమోదు చేసింది. గత 23 ఏళ్లలో ఒక ICC టోర్నీకి ఆతిథ్యమిస్తూ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవని జట్టుగా నిలిచింది. చివరిసారిగా 2000లో కెన్యా ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది. 1996 తర్వాత పాక్‌కు ICC టోర్నమెంట్ నిర్వహించే అవకాశం వచ్చింది. దీంతో తమ జట్టు ప్రదర్శనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. PAK టీమ్ పరిస్థితి దిగజారిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టిక్‌టాక్‌కు పోటీగా రీల్స్ కోసమే ఇన్‌స్టాగ్రామ్ ప్రత్యేకంగా ఓ యాప్ తీసుకురానుంది. ఇందులో వర్టికల్ స్క్రోల్ ఫీచర్‌తోపాటు 3 నిమిషాల వీడియోలకూ అనుమతి ఉంటుందని సమాచారం. క్రియేటర్ల కోసం మెటా గత నెల ఎడిట్స్ యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది IOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. USలో టిక్‌టాక్‌పై నిషేధ కత్తి వేలాడుతున్న వేళ దాని మార్కెట్‌ను సొంతం చేసుకునేందుకు మెటా పావులు కదుపుతోంది.

AP: సీఎం చంద్రబాబును భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష కలిశారు. వెలగపూడిలోని సచివాలయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. నూతన క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణకు సంబంధించి వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీఎం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

మహారాష్ట్రకు చెందిన నీలమ్ షిండే అనే యువతి USలో హిట్ అండ్ రన్‌లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉంది. కూతురి కోసం అక్కడికెళ్లడానికి తండ్రి ప్రయత్నించగా ముంబై వీసా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తాము వీసా ఆఫీస్‌కు వెళితే సమస్య వినడానికి కూడా సిబ్బంది ఆసక్తి చూపలేదని వాపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం, విదేశాంగ మంత్రి జైశంకర్ చొరవచూపాలని కోరుతున్నారు.

గుడ్లు అంటే చాలామందికి ఇష్టం. వాటిని వండేటప్పుడు, తినేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. గుడ్లను అతిగా ఉడికిస్తే పోషకాలు తగ్గిపోతాయి. 20 నిమిషాలపాటు ఉడికించాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న గుడ్లు తినకూడదు. దానిలో ఉండే రుచి తగ్గిపోతుంది. గుడ్లను నేరుగా పాన్ లేదా వంటపాత్రలో పగలగొట్టకూడదు. గుడ్డు పెంకుపై ఉండే బ్యాక్టీరియా వీటిలోకి చేరుతుంది. వేరే పాత్రలో ఫిల్టర్ చేశాకే ఉపయోగించాలి.

కోళ్లకు బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న వేళ మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో దేశంలోనే తొలిసారి ఓ పెంపుడు పిల్లిలో ఈ H5N1 వైరస్ బయటపడింది. దీంతో మనుషులకూ సోకే అవకాశం ఉందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. కరోనా మాదిరిగానే ఈ వైరస్ ఆకృతి మార్చుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రాణాంతకం కాదంటున్నారు. కాగా అమెరికా సహా పలు దేశాల్లో జంతువులు, మనుషులకూ ఈ వైరస్ సోకింది.

TG: SLBC ప్రమాదంపై BRS నేతల విమర్శలపై మంత్రి ఉత్తమ్ ఘాటుగా స్పందించారు. ‘శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు చనిపోతే, కాళేశ్వరం కూలి ఆరుగురు, పాలమూరు పంప్‌హౌస్‌లో ప్రమాదంలో ఆరుగురు చనిపోయినా వెళ్లలేదు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే KCR కదల్లేదు. మాజీ సీఎం ఫామ్‌హౌస్ దగ్గర్లోని మాసాయిపేట రైలు ప్రమాదంలో చిన్నారులు చనిపోతే స్పందించకుండా ఇప్పుడు రాజకీయమా?’ అని ధ్వజమెత్తారు.
Sorry, no posts matched your criteria.