India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాని, ప్రియాంక మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఇప్పటికే థియేటర్లలో రూ.100కోట్ల+ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం ఈనెల 26 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. OTT ప్రేక్షకులను సైతం మెప్పిస్తూ దేశవ్యాప్తంగా నంబర్ 1లో ట్రెండ్ అవుతోందని హీరో నాని ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సాలిడ్ మ్యూజిక్ అందించారు.
ఈ ఏడాది తొలి 9 నెలల్లో 62 కంపెనీలు రూ.64,513 కోట్లను ఐపీవోల ద్వారా సమీకరించాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో మరో రూ.60,000 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. హ్యుందాయ్ ఇండియా, స్విగ్గీ, NTPC గ్రీన్ ఎనర్జీ, ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వారీ ఎనర్జీస్ తదితర కంపెనీలు ఐపీవోలకు రానున్నాయి. 2021లో రూ.1.19 లక్షల కోట్లు సమీకరించగా, ఈ ఏడాది రూ.1.25 లక్షల కోట్లు దాటనుంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
AP: నైపుణ్య గణన కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ మంగళగిరిలో ప్రారంభమవనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి యువతీయువకుల విద్యార్హతలు, ఉద్యోగ రంగం, నిరుద్యోగిత తదితర 25 రకాల ప్రశ్నలతో సమాచారం సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సర్వే మొదలవుతుంది. ఈ వివరాలతో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణను ప్రభుత్వం ఇప్పిస్తుంది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 12న టీ20 మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు. మొదటి టీ20 అక్టోబర్ 6న గ్వాలియర్ (మధ్యప్రదేశ్), రెండో 9న టీ20 ఢిల్లీలో, మూడో టీ20 12న HYDలో జరగనున్నాయి.
AP: ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులందరికీ OCT 14లోగా APAAR(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కార్డులు ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. దీనిపై తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించాలని సూచించింది. ఈ కార్డులో విద్యార్థి పేరు, బర్త్‌డే, ఫొటో, క్యూఆర్ కోడ్, 12 అంకెలతో గుర్తింపు నంబర్ ఉంటుంది. పిల్లల అకడమిక్ సమాచారం, ప్రోగ్రెస్ వివరాలన్నీ ఇందులో నిక్షిప్తమవుతాయి.
AP: మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు వీలుగా ‘AP రెగ్యులరేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్’ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ జస్టిస్ నజీర్ ఆమోదించారు. న్యాయశాఖ ఇవాళ ఉదయం గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించనుంది. నూతన మద్యం పాలసీ విధివిధానాలతో నేడు సాయంత్రం లేదా రేపు ఉదయం ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులివ్వనుంది. OCT 10-11 నాటికి లైసెన్సుల ప్రక్రియ పూర్తవనుంది.
J&K ఎన్నికల ప్రచారంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ గాని భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే IMFని కోరుతున్న మొత్తం కంటే ఎక్కువ ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి ఉండేవారమని తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అస్త్రంగా చేసుకున్న పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలపై ఏకాకిగా మారిందని విమర్శించారు.
AP: ఇంద్రకీలాద్రిపై OCT 3 నుంచి 12 వరకు జరిగే దసరా మహోత్సవాల్లో ఎలాంటి పొరపాట్లు తలెత్తినా అధికారులదే బాధ్యత అని మంత్రి రామనారాయణరెడ్డి హెచ్చరించారు. 13 ప్రభుత్వ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. VVIP దర్శనాలకు ఉ.8-10, మ.2-4 గంటల వరకు, వృద్ధులు, దివ్యాంగులకు సా.4-5 గంటల వరకు టైం స్లాట్ కేటాయించినట్లు తెలిపారు. OCT 9న అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు.
ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘12th ఫెయిల్’కు ప్రీక్వెల్ రాబోతోంది. IIFA 2024 ఈవెంట్లో చిత్రనిర్మాత విధు వినోద్ చోప్రా ఈ విషయాన్ని చెప్పారు. ‘జీరో సే షురువాత్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతున్నట్లు పేర్కొన్నారు. నటీనటుల్లో ఎలాంటి మార్పు ఉండదని, డిసెంబర్ 13న విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ‘12th ఫెయిల్’ చిత్రంలో విక్రాంత్ మాస్సే, మేధా శంకర్‌లు జంటగా నటించారు.
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.
Sorry, no posts matched your criteria.