news

News February 26, 2025

ZADRAN: ఇది కదా హీరోయిజం అంటే..!

image

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ (177) భారీ సెంచరీతో చెలరేగారు. కాగా జద్రాన్ గాయం కారణంగా 6 నెలలు క్రికెట్‌కు దూరమయ్యారు. గతేడాది చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత రికవరీ అయిన జద్రాన్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుతున్నారు. ఏకంగా అఫ్గాన్ తరఫున అత్యధిక స్కోరు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కారు. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.

News February 26, 2025

BIG BREAKING: పోసాని కృష్ణమురళి అరెస్ట్

image

TG: వైసీపీ మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు HYD రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్‌మెంట్‌లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీకి తరలిస్తున్నారు. కాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.

News February 26, 2025

రేపు స్కూళ్లకు సెలవు

image

APలో MLC ఎన్నికల కారణంగా కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఉండనుంది. గుంటూరు-కృష్ణా పట్టభద్రుల, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల, విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం టీచర్స్ MLC ఎన్నిక నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని DEOలు ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. మీకు రేపు సెలవు ఇచ్చారా? తెలంగాణలోనూ <<15581975>>సెలవు <<>>ఇచ్చారు.

News February 26, 2025

తేళ్లు, బొద్దింకలు కూడా తిన్నా: కామాక్షి భాస్కర్ల

image

తాను చైనాలో ఎంబీబీఎస్ చదువుకునే సమయంలో తేళ్లు, బొద్దింకలు కూడా తిన్నానని హీరోయిన్ కామాక్షి భాస్కర్ల తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి వంటకాలు ట్రై చేస్తానని చెప్పారు. ‘చైనాలో ఒకప్పుడు గ్రీనరీ ఉండేది కాదు. తినడానికి కూరగాయలు కూడా దొరికేవి కాదు. అందుకే కనిపించిన జీవుల్ని చంపి తినడం వారికి అలవాటైంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ‘మా ఊరి పొలిమేర’ సిరీస్ చిత్రాలతో కామాక్షి ఫేమస్ అయిన విషయం తెలిసిందే.

News February 26, 2025

సిగ్గులేని జీడి గింజలా రేవంత్ వ్యవహారం: KTR

image

BRS ప్రభుత్వం పనులు ఆపేయడం వల్లే SLBC ప్రమాదం జరిగిందన్న CM వ్యాఖ్యలపై KTR మండిపడ్డారు. ‘సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేంటి సిగ్గు అన్నదట. అలా ఉంది రేవంత్ వ్యవహారం. బాధ్యత గల CM అయితే రెస్క్యూ ఆపరేషన్‌పై దృష్టి పెట్టేవాడివి. ఎన్నికలు, ఢిల్లీ టూర్లకు తిరిగే నీకు పాలన అంటే ఏంటో తెలుసా? SLBC డిజైన్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని KCR ఎప్పుడో చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపించండి’ అని ట్వీట్ చేశారు.

News February 26, 2025

దేశ ప్రజలందరికీ కొత్త పెన్షన్ స్కీం

image

దేశ ప్రజల కోసం యూనివర్సల్ పెన్షన్ స్కీం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందించేలా, నిర్మాణ కార్మికులు, గిగ్ వర్కర్లకు మేలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత పెన్షన్ పథకాలనూ దీనిలో చేర్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న, చేయని వారు, వ్యాపారం చేసే వారూ దీని ప్రయోజనాలు పొందేలా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే దీని విధివిధానాలు ప్రకటించనున్నట్లు సమాచారం.

News February 26, 2025

నందమూరి మోక్షజ్ఞకు ప్రశాంత్ వర్మ ఝలక్?

image

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా నుంచి ప్రశాంత్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందించేందుకు ప్రశాంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించే అవకాశాలున్నట్లు సమాచారం.

News February 26, 2025

శివరాత్రి.. మీరేం చేస్తున్నారు?

image

మహాశివరాత్రి రోజు భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేస్తూ భగవంతుడి సేవలో తరిస్తారు. కొందరు శైవ క్షేత్రాలలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనడం, శివ కథాపారాయణలు, శివ నామస్మరణ చేయడం, పాటలు వినడం, భక్తి సినిమాలు చూడటం వంటివి చేస్తుంటారు. మరి జాగరణ సమయంలో మీరేం చేస్తారు? కామెంట్ చేయండి.

News February 26, 2025

CT: వ్యక్తిగత స్కోరులో జద్రాన్ రికార్డు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ అదిరిపోయే ఇన్నింగ్స్‌తో దుమ్ములేపారు. 146 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేశారు. దీంతో CTలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్‌గా జద్రాన్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకూ ఈ రికార్డు ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌పై ఉండేది. డకెట్ తర్వాత నాథన్ ఆస్టిల్ (145*), ఆండీ ఫ్లవర్ (145), గంగూలీ (141) ఉన్నారు.

News February 26, 2025

BREAKING: పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

image

CUET-PG-2025 పరీక్షల షెడ్యూల్‌ను UGC విడుదల చేసింది. మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు CBT విధానంలో పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 43 షిఫ్టుల్లో 90 నిమిషాల చొప్పున పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. మొత్తం 157 సబ్జెక్టులకు సంబంధించి 4.12 లక్షల మంది పరీక్షలకు హాజరవుతారని పేర్కొంది. పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.