news

News February 26, 2025

ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవే

image

1.సోమనాథ్ (గుజరాత్) , 2.మల్లికార్జున (శ్రీశైలం), 3.మహాకాళ ( మధ్యప్రదేశ్) ,4. ఓంకారేశ్వర (మధ్యప్రదేశ్), 5.వైద్యనాథ్ (ఝార్ఖండ్), 6.భీమశంకర (మహారాష్ట్ర), 7. రామేశ్వరం (తమిళనాడు), 8.నాగేశ్వర (గుజరాత్),9. విశ్వేశ్వర (ఉత్తరప్రదేశ్), 10.త్రయంబకేశ్వర్ (మహారాష్ట్ర),11. కేదార్‌నాథ్ (ఉత్తరాఖండ్) 12. ఘృష్ణేశ్వరం (మహారాష్ట్ర)

News February 26, 2025

బాలీవుడ్ నటుడి విడాకుల వార్తలపై క్లారిటీ

image

బాలీవుడ్ నటుడు గోవింద విడాకులు తీసుకోబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన సన్నిహితులు స్పందించారు. భార్య సునీతతో గోవిందకు అభిప్రాయభేదాలు ఉన్నాయని, అయితే అవి విడాకులు తీసుకునేంత పెద్దవి కాదని ఆయన మేనేజర్ చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విడాకుల వార్తలన్నీ అవాస్తవమని గోవింద మేనకోడలు ఆర్తిసింగ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరారు.

News February 26, 2025

సంతాన ప్రాప్తి కలిగించే జ్యోతిర్లింగం ఘృష్ణేశ్వరం

image

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహారాష్ట్రలో ఉండే<<15583713>> ఘృష్ణేశ్వర<<>> ఆలయం చివరిది. స్థల పురాణం ప్రకారం శివుడి భక్తురాలి కుమారుణ్ని ఒక మహిళ కొలనులో విసిరేస్తుంది. దీంతో బాలుడు చనిపోతాడు. అంత బాధలోనూ ఆ మాత శంకరున్ని యధావిధిగా పూజిస్తుంది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆమె కుమారునికి ప్రాణం పోస్తాడు. అనంతరం భక్తురాలి కోరిక మేరకు అక్కడే వెలుస్తాడు. ఈ క్షేత్రాన్నిదర్శిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.

News February 26, 2025

‘నమశ్శివాయ’ అంటే ఏంటో తెలుసా?

image

‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రంలో ‘న, మ, శి, వా, య’ అనే పంచాక్షరాలు ఉన్నాయి.
1. ‘న’ అంటే నభం- ఆకాశం
2. ‘మ’ అంటే మరుత్- గాలి
3. ‘శి’ అంటే శిఖి- అగ్ని
4. ‘వా’ అంటే వారి- నీరు
5. ‘య’ అంటే యజ్ఞం- భూమి

News February 26, 2025

వెండితెరపై ‘శివుడు’

image

టాలీవుడ్‌లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణువు పాత్రలతో పాటు శివుడి పాత్రలోనూ స్టార్ హీరోలు అలరించారు. ఎన్టీఆర్(దక్షయజ్ఞం), కృష్ణంరాజు (శ్రీ వినాయక విజయం), శోభన్ బాబు(పరమానందయ్య శిష్యుల కథ), మెగాస్టార్ చిరంజీవి(శ్రీ మంజునాథ), జగపతిబాబు(పెళ్లైన కొత్తలో-సాంగ్‌లో) భోళా శంకరుడి పాత్రలో కనిపించారు. వీరిలో ఎవరు శివుడి పాత్రలో మెప్పించారో కామెంట్ చేయండి?

News February 26, 2025

పాండవులు నిర్మించిన క్షేత్రం కేదార్‌నాథ్

image

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉత్తరాఖండ్‌లోని <<15578815>>కేదార్‌నాథ్<<>> క్షేత్రం 11వది. మహాభారత యుద్ధం తర్వాత వ్యాసమహర్షి సలహా ప్రకారం, పాండవులంతా కేదార్‌నాథ్ వెళ్లి శివుని ఆలయం నిర్మించి, క్షమాపణ కోరుతూ తపస్సు చేశారని స్థలపురాణం చెబుతోంది. ఆదిశంకరాచార్యులు ఇక్కడే నిర్వాణం పొందారు. విపరీతమైన మంచు కారణంగా ఈ మందిరం ఏప్రిల్- నవంబర్‌ల మధ్యే తెరిచి ఉంటుంది. కాలినడకన, గుర్రాలు, డోలీలపై ఈ ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.

News February 26, 2025

శివలింగాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు

image

మహాశివరాత్రి కోసం ముస్తాబైన ఆలయం నుంచి శివలింగాన్ని దొంగిలించిన ఘటన గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో జరిగింది. అరేబియా సముద్రపు ఒడ్డున ఉన్న శ్రీ భిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉన్న పురాతన శివలింగాన్ని నిన్న దొంగలు ఎత్తుకెళ్లారు. లింగం కనిపించకపోవడంతో ఆలయ అధికారులు స్కూబా డైవర్లతో సముద్రంలో గాలిస్తున్నారు. శివరాత్రి ముందు రోజే ఇలా జరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News February 26, 2025

ప్రధానితో సీఎం రేవంత్ భేటీ

image

TG: ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతులు, రీజినల్ రింగ్ రోడ్‌, ఇతర ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. CM వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి ఉన్నారు. ఈ ఏడాదిలో ప్రధానితో రేవంత్ భేటీ కావడం ఇదే తొలిసారి.

News February 26, 2025

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు జీతాల పెంపు!

image

ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు జీతాలు పెంచినట్లు సమాచారం. మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారికి గరిష్ఠంగా 20% వరకు హైక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు కేటగిరీల్లో 5-7%, 7-10%, 10-20% మేర పెంచినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గతేడాది నుంచే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఈ మేరకు ఇప్పటికే వారికి లెటర్స్ పంపినట్లు తెలుస్తోంది. ఇటీవల ట్రైనీ ఉద్యోగులను నిర్దయగా తొలగించిందని సంస్థపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

News February 26, 2025

HYDలో అందుబాటులోకి వచ్చిన మరో ఫ్లైఓవర్

image

TG: హైదరాబాద్ నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. గోల్నాక చర్చి నుంచి ఛే నంబర్ మీదుగా అంబర్‌పేట్ వరకు నిర్మించిన ఈ పైవంతెనపై నేటి నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. రూ.445 కోట్లతో 1.65 కి.మీ పొడవునా 4 లేన్లతో దీన్ని నిర్మించారు. 2018లో దీనికి శంకుస్థాపన చేశారు. ఉప్పల్ నుంచి MGBS, సిటీ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ తగ్గనుంది.