news

News September 25, 2024

భూమికి భారంగా చైనా డ్యామ్!

image

చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. ఏకంగా 10 ట్రిలియన్ గాలన్ల నీరు అందులో నిల్వ ఉంటుంది. అంత బరువు ఒకేచోట నిల్వ ఉండటం భూమి గమనాన్ని ప్రభావితం చేస్తోంది. 0.06 సెకన్ల మేర భూ పరిభ్రమణ వేగం నెమ్మదించిందని పరిశోధకులు చెబుతున్నారు. దాని వల్ల సూర్యుడి నుంచి 2 సెంటీమీటర్ల దూరం పెరిగిందన్నారు. ఈ డ్యామ్ కారణంగా భూకంపాలు, పెను విపత్తులు సంభవిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News September 25, 2024

ఆసీస్‌కు మన బౌలింగ్ వేడి తగులుతుంది: మంజ్రేకర్

image

ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు భారత్ తమ అత్యుత్తమ పేస్ దళాన్ని తీసుకెళ్లాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించారు. ‘బుమ్రా, షమీ, సిరాజ్, ఆకాశ్ దీప్‌తో కూడిన టీమ్ ఇండియా పేస్ బ్యాటరీ ఎన్నడూ లేనంత బలంగా ఉంది. ఆస్ట్రేలియాకు ఆ వేడి కచ్చితంగా తగులుతుంది. మన ప్లేయర్స్ బ్యాటింగ్ బాగా చేయడమే కీలకం. సీనియర్లు బరువును మోయాలి. భారత్ ఈసారి కూడా సిరీస్ గెలుస్తుందనే అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

News September 25, 2024

VIRAL: ఆఫీస్ కుర్చీలో కూర్చొని ఆటో డ్రైవింగ్!

image

బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ ఆటోలోని సీటును తొలగించి, ఆఫీసు కుర్చీని బిగించుకున్నారు. అందులో కూర్చొని డ్రైవ్ చేస్తున్నారు. దీనిని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆయనకు బ్యాక్ పెయిన్ వచ్చి అలా చేశారేమో అంటూ పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇది మోటార్ వెహికల్ యాక్ట్‌కు విరుద్ధమని పేర్కొంటున్నారు.

News September 25, 2024

రేపటి నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్

image

తెలంగాణలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ప్రొవిజినల్ జాబితాను కాళోజీ వర్సిటీ ఇవాళ విడుదల చేయనుంది. రేపు తుది మెరిట్ లిస్ట్‌ విడుదల కానుంది. గురువారం నుంచి రాష్ట్రంలో ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

News September 25, 2024

సెప్టెంబర్ 25: చరిత్రలో ఈరోజు

image

1920: ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జననం
1939: బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం
1974: ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురగదాస్ జననం
1958: స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నవ లక్ష్మీనారాయణ మరణం
2019: హాస్యనటుడు వేణుమాధవ్ మరణం
2020: ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం మరణం
➣వరల్డ్ ఫార్మాసిస్ట్ డే

News September 25, 2024

ఒకే చట్టం పరిధిలోని యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు

image

AP: రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో యూనివర్సిటీ వీసీలను నియమిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని యూనివర్సిటీలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కరికులమ్ మార్పునకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో ఏఐ వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

News September 25, 2024

యక్ష ప్రశ్నలు అన్న పదం ఎలా వచ్చిందో తెలుసా..?

image

యక్ష ప్రశ్నలు అన్న పదం మహాభారతం నుంచి వచ్చింది. ఓ పని మీద అడవికి వెళ్లిన భీమార్జున నకుల సహదేవులు సరస్సులో నీరు తాగేందుకు యత్నించగా వారిని ఓ యక్షుడు అడ్డుకుంటాడు. తన ప్రశ్నలకు సమాధానం చెబితే నీరు తాగొచ్చని చెబుతాడు. చెప్పలేకపోయిన ఆ నలుగురూ చనిపోతారు. వారి కోసం వెళ్లిన ధర్మరాజు యక్షుడి ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పి అన్నదమ్ముల్ని బతికించుకుంటాడు. అప్పటినుంచి యక్షప్రశ్నలన్న పేరు వాడుకలోకి వచ్చింది.

News September 25, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 25, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: సెప్టెంబర్ 25, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:53 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6:05 గంటలకు ✒ జొహర్: మధ్యాహ్నం 12:08 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4:29 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6:10 గంటలకు ✒ ఇష: రాత్రి 7.22 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 25, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!