India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహాశివరాత్రి కోసం ముస్తాబైన ఆలయం నుంచి శివలింగాన్ని దొంగిలించిన ఘటన గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో జరిగింది. అరేబియా సముద్రపు ఒడ్డున ఉన్న శ్రీ భిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉన్న పురాతన శివలింగాన్ని నిన్న దొంగలు ఎత్తుకెళ్లారు. లింగం కనిపించకపోవడంతో ఆలయ అధికారులు స్కూబా డైవర్లతో సముద్రంలో గాలిస్తున్నారు. శివరాత్రి ముందు రోజే ఇలా జరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

TG: ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతులు, రీజినల్ రింగ్ రోడ్, ఇతర ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. CM వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి ఉన్నారు. ఈ ఏడాదిలో ప్రధానితో రేవంత్ భేటీ కావడం ఇదే తొలిసారి.

ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు జీతాలు పెంచినట్లు సమాచారం. మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారికి గరిష్ఠంగా 20% వరకు హైక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు కేటగిరీల్లో 5-7%, 7-10%, 10-20% మేర పెంచినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గతేడాది నుంచే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఈ మేరకు ఇప్పటికే వారికి లెటర్స్ పంపినట్లు తెలుస్తోంది. ఇటీవల ట్రైనీ ఉద్యోగులను నిర్దయగా తొలగించిందని సంస్థపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

TG: హైదరాబాద్ నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. గోల్నాక చర్చి నుంచి ఛే నంబర్ మీదుగా అంబర్‌పేట్ వరకు నిర్మించిన ఈ పైవంతెనపై నేటి నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. రూ.445 కోట్లతో 1.65 కి.మీ పొడవునా 4 లేన్లతో దీన్ని నిర్మించారు. 2018లో దీనికి శంకుస్థాపన చేశారు. ఉప్పల్ నుంచి MGBS, సిటీ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ తగ్గనుంది.

TG: 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తీసుకురాలేదని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైరయ్యారు. SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలారని దుయ్యబట్టారు. 96 గంటలు దాటినా ముందడుగు వేయడం లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం పగుళ్లు, శ్రీశైలం అగ్నిప్రమాదంపై కారుకూతలు కూసిన మేధావులు SLBC విషయంలో మాత్రం నోరెత్తడం లేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు.

జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు, నాగ సాధువులు, అఘోరాలు పుణ్య స్నానమాచరించారు. ఈ క్రమంలో పలు ఫొటోలు వైరలయ్యాయి. పైన స్వైప్ చేసి ఫొటోలను చూడొచ్చు.

త్రినాథరావు దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మజాకా’ థియేటర్లలో విడుదలైంది. తండ్రి కొడుకులు తమ ప్రేమను దక్కించుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. సందీప్ కిషన్, రావు రమేశ్, మురళీ శర్మల నటన, ఎమోషనల్, కామెడీ సీన్లు, సొమ్మసిల్లిపోతున్నవే సాంగ్ ఈ సినిమాకు ప్లస్. సాగదీత, స్లో సీన్లు, ఊహించేలా కథ ఉండటం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్.
WAY2NEWS RATING: 2.25/5

మనుషులకు మూడో కన్ను అంటే శివుడి మాదిరి నుదుటిపై ఉంటుందని కాదు. భౌతికం కానివాటిని చూడగలగడం, అంతర్ముఖులం కావడం అని అర్థం. కర్మ స్మృతుల కారణంగా మానవుడు దేన్నైనా ఉన్నది ఉన్నట్లు చూడలేడని, అలా చూసేందుకు లోతులకు చొచ్చుకుపోగలిగే, జ్ఞాపకాలతో కలుషితం కాని ఓ కన్ను కావాలని పండితులు చెబుతారు. అంతర్ దృష్టి ఏర్పడినప్పుడు మనలోని స్పష్టతను ప్రపంచంలో ఏదీ చెదరగొట్టదు. అదే జ్ఞానంతో కూడిన నిజమైన మూడో కన్ను.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65,127 మంది భక్తులు దర్శించుకోగా, 19,307 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు సమకూరింది.

శివరాత్రి రోజు మీ లైఫ్‌స్టైల్‌కు తగిన ఉపవాసాన్ని ఎంచుకోవాలి.
*నిర్జల ఉపవాసం: చాలా కఠినంగా ఉంటుంది. ఎటువంటి ఆహారం, లిక్విడ్ తీసుకోరు. షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులు ఇది చేయవద్దు.
*ఫలాహార ఉపవాసం: అరటి, యాపిల్, దానిమ్మ, జామ, పాలు, మజ్జిగ, పళ్లరసాలు, డ్రైఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు.
*ఏక భుక్త వ్రతం: ఉదయం భోజనం చేసి మిగతా రోజంతా పండ్లు తీసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.