news

News August 30, 2024

పాన్ మసాలాలు కావవి.. నికోటిన్ బాంబులు

image

దేశంలో రోడ్డు ప్రమాదాలు, తుపాకీ గుళ్లతో పోలిస్తే గుట్కా, పాన్ మసాలాలతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారని టాటా ACTREC శాస్త్రవేత్తలు అన్నారు. పొగరాని పొగాకు ఉత్పత్తులైన (SLT) ఖైనీ, గుట్కా, పాన్ మసాలా, మిష్రీ గుల్, క్రీమీ స్నఫ్, డ్రై స్నఫ్ ప్రమాదకరమని చెప్పారు. ఇవి వ్యసనపరులుగా మారుస్తాయన్నారు. చాలా SLTల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని, 2 కెమికల్స్ శరీరంలో సులభంగా చేరిపోయి కిక్కిస్తాయని పేర్కొన్నారు.

News August 30, 2024

పిల్లలు ఎలా పుట్టారో చెప్తేనే అడ్మిషన్.. నెట్టింట విమర్శలు!

image

పిల్లలను స్కూల్‌లో చేర్పించేటప్పుడు యాజమాన్యం పలు విషయాలను తెలుసుకుంటుంది. తల్లిదండ్రుల వివరాలతో పాటు పిల్లల పేరు& DOBని తెలపాల్సి ఉంటుంది. అయితే, ముంబైలోని ఓ ప్రీస్కూల్‌లో మాత్రం దరఖాస్తు ఫారమ్‌లో విద్యార్థి ఎలా పుట్టారో తెలపాలని అడిగారు. నార్మల్ డెలివరీనా, నెలలు నిండకుండా పుట్టాడా?, సర్జరీ ద్వారా డెలివరీ చేశారా? అని ప్రశ్నించారు. విద్య చెప్పేందుకు ఇవన్నీ ఎందుకని నెటిజన్లు మండిపడుతున్నారు.

News August 30, 2024

హిడెన్ కెమెరాల ఘటనపై సీఎం ఆగ్రహం

image

AP: ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల <<13972426>>ఘటనపై<<>> CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. విద్యార్థినుల ఆందోళనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, హాస్టల్‌లో రహస్య కెమెరాలు గుర్తించలేదని SP గంగాధర రావు తెలిపారు. విద్యార్థినులు ఆందోళనకు గురి కావొద్దన్నారు.

News August 30, 2024

చరిత్రలోనే అత్యధిక స్థాయికి సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు

image

సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు చరిత్రలోనే అత్యధికంగా 83వేలకు చేరుకున్నాయి. 2009లో జడ్జిల సంఖ్యను 26 నుంచి 31కు పెంచినా సమస్య తీరలేదు. గత పదేళ్లలో పెండింగ్ కేసులు 8 రెట్లు పెరిగాయి. కొవిడ్‌ ముందు 65వేలుగా ఉన్న ఈ సంఖ్య 2021లో 70వేలు, 2022లో 79వేలకు ఎగిసింది. చివరి రెండేళ్లలో 4000 పెరగడంతో 83వేలకు చేరాయి. ఇందులో 27,604 (33%) ఏడాది క్రితానివే. ఈ సంవత్సరం 38,996 తాజా కేసులు రాగా 37,158 ముగిశాయి.

News August 30, 2024

పెండింగ్ కేసులు: హైకోర్టుల్లో 59 లక్షలు, ట్రయల్ కోర్టుల్లో 4.5 కోట్లు

image

దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో పెండింగ్ కేసులు గతంలో ఎన్నడూ చూడని స్థాయికి పెరిగాయి. 2014లో 41 లక్షలుగా ఉన్న ఇవి 2023లో ఏకంగా 61 లక్షలకు చేరాయి. అయితే ఈ ఏడాది కాస్త తగ్గి 59 లక్షలకు దిగొచ్చాయి. గత దశాబ్ద కాలంలో కేసులు తగ్గింది ఈ ఒక్కసారే. ఇక ట్రయల్ కోర్టుల సంగతి చెప్పనలవి కాదు. 2014లో 2.6 కోట్లున్న పెండింగ్ కేసులు ఇప్పుడు 4.5 కోట్లకు ఎగబాకాయి. విచారించే కొద్దీ కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి.

News August 30, 2024

నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా: రేవంత్

image

TG: కవిత బెయిల్‌ పట్ల తాను చేసిన <<13959638>>వ్యాఖ్యలపై<<>> సుప్రీంకోర్టు <<13967881>>ఆగ్రహం<<>> వ్యక్తం చేయడంపై CM రేవంత్ రెడ్డి స్పందించారు. భారత న్యాయవ్యవస్థపై తనకు అంతులేని విశ్వాసం ఉందన్నారు. కొన్ని వార్తాపత్రికలు తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించి, కోర్టును కించపరిచినట్లు పేర్కొన్నాయన్నారు. ఏదేమైనా న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రతను నమ్మే వ్యక్తిగా తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.

News August 30, 2024

History Created: తొలిసారి నిఫ్టీ @ 25200

image

NSE నిఫ్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. చరిత్రలో తొలిసారి 25200 స్థాయిని అధిగమించింది. ఉదయం 25,249 వద్ద మొదలైన సూచీ 77 పాయింట్ల లాభంతో 25,229 వద్ద కదలాడుతోంది. ఇక BSE సెన్సెక్స్ 215 పాయింట్లు పెరిగి 82,345 వద్ద చలిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినా అన్ని రంగాల సూచీలు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. సూచీలు పెరుగుతున్నా BSE మార్కెట్ బ్రెడ్త్ మాత్రం బయ్యర్లకు అనుకూలంగా లేదు.

News August 30, 2024

బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా ఘటనపై విచారణకు ఆదేశం

image

AP: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీ <<13972426>>ఘటనపై <<>>మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ‘హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారించాలి. తప్పుచేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాలేజీల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి’ అని స్పష్టం చేశారు.

News August 30, 2024

ఏపీలోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

image

అల్పపీడన ప్రభావంతో ఇవాళ ఏపీలోని 15 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ప్రకటించింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వానలు పడొచ్చని పేర్కొంది.

News August 30, 2024

ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు YSR పేరు తొలగింపు

image

AP: కొత్త మెడికల్ కాలేజీలకు గత ప్రభుత్వం పెట్టిన YSR పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 2023-24లో ప్రారంభమైన ఐదు, 2024-25లో ప్రారంభించాలని నిర్ణయించిన మరో 5 కాలేజీలకు YSR పేరు పెడుతూ గత ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంది. పలాసలోని కిడ్నీ రీసెర్చి సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కడపలోని క్యాన్సర్ ఆస్పత్రులకూ YSR పేరును ఉపసంహరించింది.