news

News February 26, 2025

నమాజ్ వేళలు.. ఫిబ్రవరి 26, బుధవారం

image

ఫజర్: తెల్లవారుజామున 5.24 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
ఇష: రాత్రి 7.34 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 26, 2025

TODAY HEADLINES

image

☛ నిరుద్యోగులకు త్వరలోనే రూ.3000: సీఎం చంద్రబాబు
☛ 15 ఏళ్లు కూటమిదే అధికారం: Dy.CM పవన్ కళ్యాణ్
☛ TGలో మార్చి 1న కొత్త రేషన్ కార్డులు
☛ TGSRTCలోకి త్వరలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు: సీఎం రేవంత్
☛ TG EAPCET ద‌రఖాస్తుల స్వీక‌ర‌ణ వాయిదా
☛ 2026 నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్ పరీక్షలు: CBSE
☛ ఛాంపియన్స్ ట్రోఫీ: AUS vs SA మ్యాచ్ రద్దు

News February 26, 2025

వైభవంగా శివయ్య బ్రహ్మోత్సవం(PHOTOS)

image

AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం జరిపించారు. సాయంత్రం భ్రమరాంబ అమ్మవారితో కలిసి మల్లికార్జున స్వామి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రేపు శివరాత్రి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు.

News February 26, 2025

నాలుగు కాళ్లతో 17 ఏళ్ల బాలుడు.. సర్జరీ చేసిన AIIMS వైద్యులు

image

ఢిల్లీ AIIMS వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. నాలుగు కాళ్లతో జన్మించి 17 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న UPకి చెందిన బాలుడికి కొత్త జీవితం ఇచ్చారు. పొట్టపై ఉన్న రెండు కాళ్లను విజయవంతంగా తొలగించారు. తల్లి కడుపులో కవలలు సంపూర్ణంగా ఎదగకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని డాక్టర్లు తెలిపారు. కోటి మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా 42 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు.

News February 26, 2025

భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

image

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో 206 ఉద్యోగాలకు <>నోటిఫికేషన్<<>> వెలువడింది. ఇందులో జూ.అసిస్టెంట్(ఫైర్), సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్, ఎలక్ట్రానిక్స్, ఆపరేషన్స్) జాబ్స్ ఉన్నాయి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూ.అసిస్టెంట్‌కు ₹31K-92K, సీనియర్ అసిస్టెంట్‌కు ₹36K-1.10L జీతం ఉంటుంది. MAR 24 వరకు అప్లై చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://www.aai.aero/en/careers/

News February 25, 2025

ప్రశాంత్ ‘బ్రహ్మరాక్షస్’ మూవీలో ప్రభాస్?

image

హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని సమాచారం. త్వరలోనే లుక్ టెస్టులోనూ పాల్గొంటారని టాలీవుడ్ టాక్. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ప్రశాంత్ తీయాలనుకున్న ‘బ్రహ్మ రాక్షస్’ మూవీ మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. అదే మైథలాజికల్ స్టోరీని డార్లింగ్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మార్చుతున్నట్లు తెలుస్తోంది.

News February 25, 2025

పెళ్లి చేసుకోండి.. లేదంటే ఉద్యోగం తీసేస్తాం: కంపెనీ వార్నింగ్

image

బాగా పనిచేయకపోతే ఉద్యోగం ఊస్టింగే అని కంపెనీలు వార్నింగ్ ఇవ్వడం సహజం. అయితే చైనాలో ‘షాన్‌డాంగ్’ అనే సంస్థ తమ ఒంటరి సిబ్బందిని SEP నాటికి పెళ్లి చేసుకోవాలని ఆదేశించింది. లేదంటే జాబ్ వదులుకోవాల్సిందేనని హెచ్చరించింది. దీనిపై GOVT అధికారులు మందలించినా కంపెనీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. దేశంలో వివాహ రేటును పెంచడానికే ఇలా చేశామంది. కాగా చైనాలో వివాహ, జనన రేటు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే.

News February 25, 2025

SLBC టన్నెల్‌లో 10వేల క్యూబిక్ మీటర్ల బురద?

image

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్‌లో 15 అడుగుల ఎత్తులో10వేల క్యూబిక్ మీటర్ల బురద ఉందని ఇంజినీర్లు అంచనా వేశారు. దానిని బయటికి తీసేందుకు కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతులు చేస్తున్నారు. రేపు సాయంత్రానికి ఈ మరమ్మతు పనులు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశముంటుందని సమాచారం.

News February 25, 2025

నైట్ బ్రషింగ్ చేయకపోతే ప్రమాదమే: అధ్యయనం

image

రాత్రుళ్లు బ్రష్ చేయడం ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. కార్డియోవాస్కులర్ వ్యాధుల (CVD) ప్రమాదాన్ని నైట్ బ్రషింగ్ తగ్గిస్తుందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. రాత్రిపూట బ్రషింగ్‌ను నిర్లక్ష్యం చేసిన వారితో పోలిస్తే, రోజుకు రెండు సార్లు పళ్లు తోముకునే వ్యక్తుల్లో CVDల సంభవం గణనీయంగా తగ్గినట్లు తేలింది. బ్రషింగ్ నిర్లక్ష్యం చేస్తే నోటి బ్యాక్టీరియా వృద్ధి చెంది గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

News February 25, 2025

బెయిల్ ఇవ్వాలని కోర్టులో వంశీ పిటిషన్

image

AP: తనకు బెయిల్ ఇవ్వాలంటూ వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. వంశీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కోర్టు ఆదేశించింది. కౌంటర్ పిటిషన్ వేసేందుకు మూడు రోజుల సమయం కావాలని పీపీ కోరగా, తదుపరి విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.