news

News August 29, 2024

పాతబస్తీకి వెళ్లే దమ్ము లేదా?: MLA ఏలేటి

image

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అని BJP MLA ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. చెరువులో నిర్మించిన ఒవైసీ భవనానికి 6 నెలల సమయం ఇచ్చిన హైడ్రా ఎన్ కన్వెన్షన్‌తో పాటు పల్లా, మర్రి రాజశేఖర్‌రెడ్డికి ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. పాత బస్తీకి వెళ్లే దమ్ము ప్రభుత్వానికి లేదా అని సవాల్ చేశారు.

News August 29, 2024

ఇవిగో.. చెరువుల వివరాలు

image

TG: చెరువులు, కుంటల పరిరక్షణకు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో అసలు HMDA పరిధిలోని చెరువుల వివరాలు తెలుసుకోవడంపై ఆసక్తి నెలకొంది. FTL, తదితర వివరాలు https://lakes.hmda.gov.in/ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి. మొత్తం 2551 చెరువులు, వాటి ID నంబర్లతో సహా ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News August 29, 2024

‘జియో బ్రెయిన్’ గురించి తెలుసా?

image

రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ కస్టమర్ల కోసం AI ఆధారిత ‘జియో బ్రెయిన్’ను <<13967644>>లాంచ్<<>> చేసింది. ఇందులో ఫోన్ కాల్స్‌ అనాలసిస్, సర్వీస్ రికమండేషన్స్, ఫ్రాడ్ డిటెక్షన్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అనలైటిక్స్ వంటి సదుపాయాలు ఉంటాయి. అలాగే ఇందులో డేటా మేనేజ్మెంట్ కోసం JioVault, భాషా అనువాదం కోసం JioTranslate, HR ఫంక్షన్స్ కోసం PeopleGPT వంటివి ఉంటాయి. సర్వీస్ రికమండేషన్స్ అంటే కస్టమర్ డేటా ఆధారంగా సిఫార్సులు ఇవ్వడం.

News August 29, 2024

విశాఖ, విజయవాడలో మెట్రోలు: మంత్రి నారాయణ

image

AP: విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు పూర్తి చేయాలని CM చంద్రబాబు ఆదేశించారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ మెట్రో ఫేజ్-1 కోసం రూ.11వేల కోట్లు, ఫేజ్-2 కోసం రూ.14వేల కోట్లు అవసరం అని చెప్పారు. విశాఖ మెట్రో ఫేజ్-1 కొమ్మాది జంక్షన్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు, ఫేజ్-2 కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఉంటాయని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.17,100 కోట్లు అవసరం అని వివరించారు.

News August 29, 2024

3500 ఏళ్లనాటి కూజాను పగులగొట్టిన బాలుడు.. మ్యూజియం ఏం చేసిందంటే?

image

ఇజ్రాయెల్‌లోని హెచ్ట్ మ్యూజియంలోని పురాతన వస్తువులను చూసేందుకు వచ్చిన నాలుగేళ్ల బాలుడు 3500 ఏళ్ల నాటి కూజాను పగులగొట్టాడు. వస్తువులను చూసే బిజీలో తండ్రి ఉండగా ఆ బాలుడు కూజా వద్దకు వెళ్లి లాగడంతో పడి ముక్కలైంది. ఇది 2200-1500BC మధ్య కాంస్య యుగం నాటిదని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. పిల్లాడు కావాలని చేయకపోవడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, విరిగిన వస్తువులను పునరుద్ధరిస్తామన్నారు.

News August 29, 2024

బెంగళూరును బీట్ చేసిన హైదరాబాద్

image

అత్యధికంగా సంపన్నులు నివసిస్తున్న నగరాల జాబితాలో బెంగళూరును హైదరాబాద్ బీట్ చేసింది. 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో బెంగళూరును మొదటిసారిగా అధిగమించి మూడో స్థానాన్ని పొందింది. విస్తారమైన ఐటీ, వ్యాపార రంగ అవకాశాల వల్ల HYDకు కొత్తగా 17 మంది బిలియనీర్లు తోడయ్యారు. ఈ జాబితాలో ముంబై మొదటి స్థానంలో, ఢిల్లీ రెండో స్థానంలో నిలిచాయి. తాజా గణాంకాలతో దేశంలో బిలియనీర్ల సంఖ్య 334కు చేరింది.

News August 29, 2024

కార్మికులకు త్వరలో రూ.10లక్షల బీమా: సీఎం

image

AP: కార్మికులకు రూ.10లక్షల బీమా అందించే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. చంద్రన్న బీమాను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, బీమా పరిహారాన్ని కుదించి ఆంక్షలతో లబ్ధిదారులను తగ్గించిందని అన్నారు. పరిశ్రమల భద్రత అంశంలో రాజీపడొద్దని, భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించాలని అధికారులను ఆదేశించారు.

News August 29, 2024

నాగార్జున స్టైలిష్ లుక్

image

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో కింగ్ నాగార్జున నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నాగ్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో నాగ్ స్టైలిష్‌గా కనిపించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆయన ‘సైమన్’ అనే పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

News August 29, 2024

నూతన మద్యం పాలసీ రూపకల్పనకు క్యాబినెట్ సబ్ కమిటీ

image

AP: నూతన మద్యం పాలసీ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రస్తుతమున్న లిక్కర్ పాలసీని సమీక్షించడంతో పాటు వివిధ రాష్ట్రాల్లోని మద్యం విధానాలపై అధ్యయనం చేయనుంది. పాలసీ రూపకల్పనకు వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకోనుంది.

News August 29, 2024

రంగనాథ్ కమిషనరా? పొలిటీషియనా?: ఏలేటి

image

TG: హైడ్రా పేరుతో లేనిపోని హైప్ సృష్టిస్తున్నారని కమిషనర్ రంగనాథ్‌పై BJP MLA ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన కమిషనరా? లేక పొలిటికల్ లీడరా? అని సందేహం వ్యక్తం చేశారు. రంగనాథ్ ఖాకీ బట్టలు వదిలి ఖద్దర్ బట్టలు వేసుకోవాలని సలహా ఇచ్చారు. కేవలం హిందువుల నిర్మాణాలనే కూలుస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు నడుస్తున్నాయని వార్తలు వస్తున్నాయని ఏలేటి పేర్కొన్నారు.