India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు జనాభా పెరుగుదల రేటు, మొత్తం ఆత్మహత్య ధోరణులను అధిగమిస్తుండడం ఆందోళనకరం. గత దశాబ్దంలో 0-24 సంవత్సరాల వయస్సు గల వారి జనాభా 582 మిలియన్ల నుంచి 581 మిలియన్లకు తగ్గింది. విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 6,654 నుంచి 13,044కి పెరిగింది. గత రెండు దశాబ్దాలలో విద్యార్థుల ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే రెండింతలు వార్షికంగా 4 శాతం పెరిగినట్టు IC3 రిపోర్ట్ తెలిపింది.
AP: ఏఐ సిటీగా రాజధాని అమరావతిని నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అమరావతి పదంలో మొదటి, చివరి అక్షరాలు కలిపి AI సిటీ లోగోను ఆంగ్లంలో రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ కార్యాలయం నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తిచేయాలని, జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలన్నారు. సీఆర్డీఏ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా ICC ఛైర్మన్ కావడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘కేంద్ర హోంమంత్రికి అభినందనలు. మీ కుమారుడు రాజకీయ నాయకుడు కాలేకపోయాడు. కానీ ఐసీసీ ఛైర్మన్ అయ్యాడు. అనేక మంది నాయకుల కంటే అది చాలా ముఖ్యమైన పోస్టు. మీ కుమారుడు చాలా శక్తిమంతుడిగా మారాడు. ఈ విజయం సాధించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
అధిక వెయిటేజీ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి 82,134 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 25,152 వద్ద స్థిరపడ్డాయి. రెండు సూచీలు కూడా జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. రిలయన్స్ ఏజీఎం మీటింగ్ సహా, ఫైనాన్స్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్‌లో బుల్ దూకుడు కొనసాగింది.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా(గుర్మీత్ సింగ్ జోలీ) ఇటీవల ఖరీదైన రేంజ్ రోవర్ కారు కొన్నారు. దాని విలువ ₹1.4కోట్లు అని తెలుస్తోంది. కారు కొన్న విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా ‘షేరా అన్నా నన్ను మీ బాడీగార్డుగా పెట్టుకోండి. నేను కూడా కారు కొనుక్కుంటా’ అని కామెంట్స్ వస్తున్నాయి. షేరా 1995 నుంచి సల్మాన్ దగ్గర పని చేస్తున్నారు. అతడికి సొంతంగా సెక్యూరిటీ సంస్థ కూడా ఉంది.
TG: కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణంపై సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడంలేదని BRS MLA హరీశ్‌రావు ప్రశ్నించారు. BJP, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, అందుకే ఈ వ్యవహారంలో ఈడీ దాడులు జరగట్లేదని ఆరోపించారు. BJPకి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో విచారణ జరిపించాలి. సివిల్ సప్లైస్ కుంభకోణంపైనా ఈడీ విచారణ చేయాలని మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
AP: దిశ పోలీస్ స్టేషన్ల పేరును మహిళా పోలీస్ స్టేషన్లుగా పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014-2019 టీడీపీ హయాంలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లను వైసీపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లుగా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో వాటి పేర్లను పునరుద్ధరించింది.
AP: దేశంలో తయారైన తొలి మంకీపాక్స్ RT-PCR కిట్‌ను లాంచ్ చేయడం గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్‌జోన్‌లో ఈ కిట్‌ను లాంచ్ చేశారు. కిట్‌ను తయారు చేసిన AMTZ, ట్రాన్సాసియా డయాగ్నస్టిక్ బృందాలను అభినందించారు. దీనిని ICMR, CDSCO ధ్రువీకరించాయని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై ‘మేక్ ఇన్ ఏపీ’ కార్యక్రమాన్ని ఇది ప్రతిబింబిస్తుందన్నారు.
తమిళనాడులోని హోసూరు పట్టణం తెలుగుకు పెద్దపీట వేస్తోంది. ఏపీ, తెలంగాణ నుంచి వలస వెళ్లిన తెలుగువారు అక్కడ ఎక్కువగా ఉంటారు. వారిలో చాలా మంది పారిశ్రామికవేత్తలుగా స్థిరపడ్డారు. అక్కడి అధికారులు ప్రభుత్వ కార్యాలయాల బోర్డులను తమిళం, ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ రాస్తారు. తెలుగు మీడియంలో బోధించే స్కూళ్లు కూడా ఉన్నాయి. ఇటీవల ఆ ప్రాంత ఎంపీ గోపినాథ్ తెలుగులోనే ప్రమాణం చేశారు.
*నేడు తెలుగు భాషా దినోత్సవం
TG: ఫోర్త్ సిటీ పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని BRS MLA హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కందుకూరులో సర్వే నం.9లోని 385 ఎకరాల ప్రభుత్వ భూమి కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తుక్కుగూడలో 28 ఎకరాల విషయంలో ప్రభుత్వ పెద్దల తమ్ముళ్లు, పీఏల పేరిట అగ్రిమెంట్లు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతా అన్నారు.
Sorry, no posts matched your criteria.