news

News August 26, 2024

CMను కలిసిన మాల సామాజికవర్గం ప్రతినిధులు

image

TG: సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ మాల సామాజికవర్గం ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నేతలు సచివాలయంలో CM రేవంత్‌ను కలిశారు. SC వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని అభ్యర్థించారు. కాగా SC వర్గీకరణపై కమిటీని నియమించి, ఆ రిపోర్ట్ ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని CM హామీ ఇచ్చారు. CMను కలిసిన వారిలో పలువురు MLAలు, MPలు కూడా ఉన్నారు.

News August 26, 2024

రెంట్ కట్టలేదని ATMకి తాళం

image

TG: ఇంటి అద్దె చెల్లించలేదనే కారణంతో కరీంనగర్ జిల్లాలోని ఓ ఏటీఎం సెంటర్‌కు తాళం వేశారు. ‘రెంట్ చెల్లించని కారణంగానే మూసివేశాం’ అనే బోర్డు కూడా తగిలించారు. ఒక్క నెల ఈఎంఐ చెల్లించడం కాస్త ఆలస్యమైనా ఫోన్ల మీద ఫోన్లు చేసి, ఛార్జీల మీద ఛార్జీలు వేసే బ్యాంకులకు రెంట్ కట్టేంత డబ్బు లేదా? అని సోషల్ మీడియాలో ఓ యూజర్ ప్రశ్నించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

News August 26, 2024

ప్రతి కుటుంబానికి రూ.46,715 అని ప్రచారం.. కేంద్రం ఏమందంటే?

image

ఆర్థిక శాఖ‌ ప్ర‌తి కుటుంబానికి రూ.46,715 సాయం ఇస్తోంద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. వ్య‌క్తిగ‌త వివ‌రాలు కోరుతూ WhatsAppలో వైర‌ల్ అవుతున్న ఈ వార్త‌లపై స్పందించ‌వ‌ద్ద‌ని కోరింది. ఇదొక న‌కిలీ ప్ర‌చార‌మ‌ని, ఆర్థిక శాఖ అలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.
SHARE IT.

News August 26, 2024

ఐటీ రిటర్న్స్ విషయంలో ప్రభుత్వానికి డెడ్‌లైన్ ఉండాలి: VSR

image

ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు ముగిసి నెల రోజులు కావొస్తున్నా చాలా మందికి ఇంకా రిఫండ్ జమ కాలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు ఉన్నట్లే, వాటిని ప్రాసెస్ చేసి రిఫండ్ చేసేందుకు ప్రభుత్వానికి కూడా డెడ్‌లైన్ ఉండాలి. న్యూ ట్యాక్స్ కోడ్‌లో కేంద్రం దీన్ని చేర్చుతుందని ఆశిస్తున్నా’ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు Xలో విజ్ఞప్తి చేశారు.

News August 26, 2024

బైడెన్‌కు ప్రధాని మోదీ ఫోన్

image

అమెరికా అధ్య‌క్షుడు బైడెన్, భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మధ్య కాసేపటి క్రితం ఫోన్ సంభాష‌ణ జ‌రిగింది. ఇటీవ‌ల నెలరోజుల వ్య‌వ‌ధిలో యుద్ధంలో త‌ల‌ప‌డుతున్న ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి వ‌చ్చిన మోదీ ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించిన‌ట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. బైడెన్ ప‌ద‌వీ కాలం కొన్ని నెలల్లో ముగుస్తుండ‌డంతో మోదీ ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.

News August 26, 2024

రాత్రిపూట పెరుగు తింటున్నారా?

image

పెరుగును పగలు తిన్నప్పుడే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రాత్రిపూట దాని తీపి, లక్షణాల కారణంగా శరీరంలో పిత్తం, కఫం పెరుగుతాయి. ఆరోగ్యవంతులు ఇలా తింటే కొంతవరకు ఫర్వాలేదు కానీ జలుబు, దగ్గు, అలర్జీతో బాధపడేవాళ్లు రాత్రిపూట తినొద్దని సూచిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం పెరుగు తింటే సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో కాల్షియం, ప్రొటీన్ల వల్ల కండరాలు బలంగా మారుతాయి.

News August 26, 2024

ఏపీ, తెలంగాణలో పారిశ్రామిక పార్కులు!

image

కేంద్ర ప్రభుత్వం త్వరలో రూ.25వేల కోట్లతో 12 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనుంది. ఇవి ఏర్పాటయ్యే రాష్ట్రాల లిస్టులో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. ఈ భారీ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ ఈ వారంలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటి ఏర్పాటు వల్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయంగా తయారీని పెంచడం, ఉపాధి అవకాశాల్ని సృష్టించడం సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు.

News August 26, 2024

WOW: 18 బంతుల్లో 15 డాట్స్

image

భారత యువ పేస్ బౌలర్ యశ్ దయాల్ యూపీ టీ20 లీగ్‌లో అదరగొట్టారు. 3 ఓవర్లు బౌలింగ్ చేసి అందులో ఏకంగా 15 డాట్ బాల్స్ వేశారు. ఒక మెయిడిన్ వేసి మొత్తంగా 3 పరుగులే ఇచ్చారు. వికెట్లేమీ పడకున్నా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో నోయిడా సూపర్ కింగ్స్‌పై యశ్ జట్టు(గోరఖ్‌పుర్ లయన్స్) గెలిచింది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం ఉన్న నేపథ్యంలో దయాల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంటుందా? అనే చర్చ మొదలైంది.

News August 26, 2024

శివాజీ విగ్రహం కూలడంపై అసద్ కామెంట్స్

image

మహారాష్ట్ర మాల్వాన్‌లోని సింధుదుర్గ్ కోటలో ఛత్రపతి శివాజీ విగ్ర‌హం నేల‌కూలడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీని టార్గెట్ చేశారు. ఈ ఘటన మోదీ ప్రభుత్వ నాణ్యతలేని మౌలిక సదుపాయాల కల్పనను ప్రతిబింబిస్తుందని విమర్శించారు. ఛత్రపతి శివాజీ సమానత్వం, సెక్యులరిజానికి ప్రతీకగా కొనియాడారు. ఈ విగ్రహం కూలిపోవడం, శివాజీ దార్శనికత పట్ల నరేంద్ర మోదీకి నిబద్ధత లేకపోవడాన్ని సూచిస్తుందని ఎద్దేవా చేశారు.

News August 26, 2024

చనిపోయినా.. ఆరుగురి ప్రాణాలు కాపాడారు!

image

అన్ని దానాల కంటే అవయవదానం గొప్పదంటారు. తాజాగా ధ్యానబోయిన నరేశ్ అనే వ్యక్తి చనిపోయినా మరో ఆరుగురికి పునర్జన్మనిచ్చారు. కుమారుడి అవయవాలు మరికొందరికి ఉపయోగపడతాయని తెలుసుకున్న ఆయన తల్లి ఆర్గాన్స్ డొనేట్ చేసేందుకు ముందుకొచ్చారని ‘జీవన్‌దాన్’ పేర్కొంది. ఈక్రమంలో హైదరాబాద్ అపోలో ఆస్పత్రి సిబ్బంది నరేశ్ ఇంటికి వెళ్లి నివాళులర్పించి కుటుంబసభ్యులను సత్కరించారు.