India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ప్రభుత్వం రూ.2,685 కోట్ల సబ్సిడీ అందిస్తోంది. అయితే ఇదంతా ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాక్కుంటున్నట్లు ఉందని YCP ఆరోపిస్తోంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో నేటి నుంచి ప్రజలపై రూ.17,072 కోట్లు భారం మోపుతున్నారంటోంది. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నామంటూ 20 సిలిండర్ల డబ్బుల్ని సర్కార్ వసూలు చేస్తోందని YCP చురకలంటిస్తోంది. నిబంధనలతో అందరికీ స్కీమ్ అందడం లేదంది.
AP: ఎన్నికల హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం నేడు ప్రారంభం కానుంది. శ్రీకాకుళం(D) ఈదుపురంలో ఈ కార్యక్రమానికి CM చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఏలూరు(D) ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లబ్ధిదారులకు సిలిండర్లను పంపిణీ చేస్తారు. కాగా గత నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి. పూర్తి మొత్తం ఇచ్చి సిలిండర్‌ను తీసుకుంటే 48 గంటల్లో సబ్సిడీని ప్రభుత్వం జమ చేస్తుంది.
దీపావళి తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలకు షాక్ ఇచ్చాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.61 మేర పెంచాయి. దీంతో ప్రస్తుతం HYDలో కమర్షియల్ LPG ధర రూ.2,028కి చేరింది. నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతినెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తాయి.
UPకి చెందిన ఓల్డెస్ట్ BJP కార్యకర్త శ్రీ నారాయణ్(111) అలియాస్ బులాయ్ భాయ్ కన్నుమూశారు. దీంతో ఆ పార్టీ నేతలు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జన సంఘ్ నేత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితో ఆయన 1974లో రాజకీయాల్లోకి వచ్చారు. నౌరంగియా నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1980లో బీజేపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీ సేవకుడిగా కొనసాగుతున్నారు. కొవిడ్ టైమ్‌లో ప్రధాని మోదీ పరామర్శతో ఆయన వెలుగులోకి వచ్చారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులను పంపడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బలగాలను ఉపసంహరించుకోవాలని ఐరాసలోని US డిప్యూటీ అంబాసిడర్ రాబర్ట్ వుడ్ హెచ్చరించారు. లేదంటే వారి శవాలు బ్యాగ్‌లలో తిరిగెళ్తాయని స్పష్టం చేశారు. వెస్ట్రన్ కంట్రీస్ ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నప్పుడు మాస్కోకు ఉ.కొరియా మద్దతు ఇస్తే తప్పేంటని రష్యా రాయబారి వాసిలీ నెజెంబియా ప్రశ్నించారు.
రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ జాబితాపై ఆ జట్టు హెడ్ కోచ్ ద్రవిడ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘సమర్థుడైన కెప్టెన్ సంజూ శాంసన్, యంగ్ ప్లేయర్లు యశస్వి, పరాగ్, ధ్రువ్, సీనియర్లు సందీప్ శర్మ, హెట్‌మెయిర్‌ను అట్టిపెట్టుకున్నాం. వీరు జట్టును ముందుకు తీసుకెళ్తారు. మూడేళ్లుగా నిలకడగా ఆడుతున్నాం. ఇందుకు చాలా మంది ఆటగాళ్లు కృషి చేశారు. ఇప్పుడు కొత్త టీమ్‌తో పయనించడానికి సిద్ధమవుతున్నాం’ అని పేర్కొన్నారు.
TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పండగవేళ సైతం ఎన్నికల హడావుడిలో బిజీగా గడిపారు. ఝార్ఖండ్‌లో త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలో ఆయనను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. దీంతో ఆయన దీపావళి వేళ అక్కడి నేతలతో కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఝార్ఖండ్‌లో నవంబర్ 13, 20వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోనూ నవంబర్ 20న ఎన్నికలున్నాయి.
భారత్, న్యూజిలాండ్ మధ్య 3 టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ వాంఖడే వేదికగా ఈరోజు 9.30amకు ప్రారంభం కానుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్ ఇది కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అటు రోహిత్ సేన ఇందులో గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. సీనియర్ బ్యాటర్లు రోహిత్, కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలం.
గోపీచంద్-కావ్యా థాపర్ జంటగా నటించిన విశ్వం మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ కామెడీ యాక్షన్ చిత్రం అక్టోబర్ 11న విడుదలై పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దీంతో 20 రోజుల్లోనే ఓటీటీలో అందుబాటులోకి తెచ్చారు. ఈ సినిమాలో సునీల్, వెన్నెల కిశోర్, ప్రగతి, నరేశ్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు.
IPL-2025కు ముందు కీలకమైన రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. పది జట్లు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. స్టార్ ప్లేయర్లను వదులుకున్న కొన్ని టీమ్‌ల నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించగా, మరికొన్ని యంగ్ టాలెంట్‌కు పట్టం కట్టాయి. రిటెన్షన్‌లో నిలిచిన ప్లేయర్లను టీమ్‌ల వారీగా పైన ఫొటోల్లో చూడవచ్చు. త్వరలోనే జరిగే మెగా వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.