news

News August 26, 2024

WOW: 18 బంతుల్లో 15 డాట్స్

image

భారత యువ పేస్ బౌలర్ యశ్ దయాల్ యూపీ టీ20 లీగ్‌లో అదరగొట్టారు. 3 ఓవర్లు బౌలింగ్ చేసి అందులో ఏకంగా 15 డాట్ బాల్స్ వేశారు. ఒక మెయిడిన్ వేసి మొత్తంగా 3 పరుగులే ఇచ్చారు. వికెట్లేమీ పడకున్నా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో నోయిడా సూపర్ కింగ్స్‌పై యశ్ జట్టు(గోరఖ్‌పుర్ లయన్స్) గెలిచింది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం ఉన్న నేపథ్యంలో దయాల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంటుందా? అనే చర్చ మొదలైంది.

News August 26, 2024

శివాజీ విగ్రహం కూలడంపై అసద్ కామెంట్స్

image

మహారాష్ట్ర మాల్వాన్‌లోని సింధుదుర్గ్ కోటలో ఛత్రపతి శివాజీ విగ్ర‌హం నేల‌కూలడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీని టార్గెట్ చేశారు. ఈ ఘటన మోదీ ప్రభుత్వ నాణ్యతలేని మౌలిక సదుపాయాల కల్పనను ప్రతిబింబిస్తుందని విమర్శించారు. ఛత్రపతి శివాజీ సమానత్వం, సెక్యులరిజానికి ప్రతీకగా కొనియాడారు. ఈ విగ్రహం కూలిపోవడం, శివాజీ దార్శనికత పట్ల నరేంద్ర మోదీకి నిబద్ధత లేకపోవడాన్ని సూచిస్తుందని ఎద్దేవా చేశారు.

News August 26, 2024

చనిపోయినా.. ఆరుగురి ప్రాణాలు కాపాడారు!

image

అన్ని దానాల కంటే అవయవదానం గొప్పదంటారు. తాజాగా ధ్యానబోయిన నరేశ్ అనే వ్యక్తి చనిపోయినా మరో ఆరుగురికి పునర్జన్మనిచ్చారు. కుమారుడి అవయవాలు మరికొందరికి ఉపయోగపడతాయని తెలుసుకున్న ఆయన తల్లి ఆర్గాన్స్ డొనేట్ చేసేందుకు ముందుకొచ్చారని ‘జీవన్‌దాన్’ పేర్కొంది. ఈక్రమంలో హైదరాబాద్ అపోలో ఆస్పత్రి సిబ్బంది నరేశ్ ఇంటికి వెళ్లి నివాళులర్పించి కుటుంబసభ్యులను సత్కరించారు.

News August 26, 2024

దేశవాళీ క్రికెటర్లకు BCCI గుడ్‌న్యూస్

image

దేశంలో జరిగే అన్ని జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లు, మహిళల టోర్నీల్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌, POTMకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు BCCI సెక్రటరీ జైశా ప్రకటించారు. అలాగే సీనియర్ మెన్స్‌కు విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ POTMకు నగదు బహుమతి ఇస్తామన్నారు. దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్న ప్లేయర్లను గుర్తించి రివార్డు ఇవ్వడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. ప్రైజ్ మనీ ఎంతనేది తెలియాల్సి ఉంది.

News August 26, 2024

‘బ్రాహ్మిణ్ జీన్స్’ వివాదం ఏంటి?

image

‘బ్రాహ్మిణ్ జీన్స్’ వివాదం ముదురుతోంది. బెంగ‌ళూరుకు చెందిన కంటెంట్ మార్కెటింగ్ సంస్థ CEO అనురాధ తివారీ త‌న చేతి కండ‌ర పుష్టిని ప్ర‌ద‌ర్శిస్తున్న ఫొటోను SMలో పంచుకున్నారు. తన శారీరక దృఢత్వం బ్రాహ్మణ జన్యువుల ఫలితమేనని సూచిస్తూ ‘బ్రాహ్మిణ్ జీన్స్’ అని క్యాప్ష‌న్ ఇచ్చారు. దీంతో వివాదం మొద‌లైంది. దీనిని కొంద‌రు ప్ర‌శంసిస్తుండ‌గా, కుల‌త‌త్వాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని మ‌రికొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.

News August 26, 2024

హైడ్రా మంచిదే కానీ..: MP కొండా విశ్వేశ్వర్

image

TG: చెరువులు, కుంటలతో పాటు పర్యావరణాన్ని కాపాడే ‘హైడ్రా’ మంచిదేనని BJP MP కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. దీనిపై తాను పెట్టిన ఒపీనియన్ పోల్‌లో 78% హైడ్రాకు మద్దతు వచ్చిందన్నారు. అయితే కేవలం బిల్డర్ల మీదనే కాకుండా ఆ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు వ్యక్తుల నిర్మాణాలే కాకుండా దేవాలయాల భూములు, ప్రభుత్వ భవనాలపైనా దీన్ని అమలు చేయాలన్నారు.

News August 26, 2024

IPL: LSG ఓనర్‌ను కలిసిన KL రాహుల్

image

KL రాహుల్ ఇవాళ LSG ఓనర్ సంజీవ్ గోయెంకాతో భేటీ అయ్యారు. రాహుల్ రిటెన్షన్‌తో పాటు జట్టు కూర్పుపై ఈ మీటింగ్‌లో చర్చించినట్లు సమాచారం. KLను అంటిపెట్టుకునేందుకు LSG ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ రాహుల్ మైండ్‌లో ఏముందనేది తెలియాల్సి ఉంది. మరోవైపు అతను RCBకి వెళ్తారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత 3 సీజన్లకు లక్నో కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ఆ జట్టులోనే కొనసాగుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

News August 26, 2024

ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోండిలా

image

ఆధార్ తీసుకుని 10ఏళ్లయిన వారు ఫ్రీగా అప్‌డేట్ చేసుకునేందుకు SEP14 వరకు గడువుంది.
* దీనికోసం UIDAI <>పోర్టల్‌లో<<>> ఆధార్, OTPతో లాగిన్ అవ్వాలి.
* సర్వీసెస్‌లో డాక్యుమెంట్ అప్‌డేట్‌పై క్లిక్ చేస్తే మీ వివరాలొస్తాయి.
* వాటిలో ఏది అప్‌డేట్ చేయాలో దానిపై క్లిక్ చేసి, ప్రూఫ్స్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
* తర్వాత 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దానితో అప్‌డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

News August 26, 2024

టెలికం సంస్థలకు ట్రాయ్ కీలక ఆదేశాలు

image

కస్టమర్లు పొందే కమర్షియల్ మెసేజ్‌లలో URL, APK, OTT లింక్‌లు, రిజిస్టర్ కాని ఫోన్ నంబర్లు ఉంటే వాటిని బ్లాక్ చేయడానికి టెలికం సంస్థలకు ట్రాయ్ Sep 1న డెడ్‌లైన్ విధించింది. Jio, Airtel, వొడాఫోన్ ఐడియా తదితర సంస్థలు ముందస్తుగా ఇలాంటి సందేశాలను నిర్ధారించుకొని బ్లాక్ చేయాలి. తద్వారా రిజిస్టర్ కాని నంబర్ల కంటెంట్ బ్లాక్ అవుతుంది. దేశంలోని కస్టమర్లు రోజుకు 1.7 బిలియన్ల కమర్షియల్ మెసేజులు పొందుతున్నారు.

News August 26, 2024

UPDATED: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్

image

మహిళల T20WC నిర్వహణ బంగ్లాదేశ్ నుంచి UAEకి తరలిన నేపథ్యంలో అప్డేటెడ్ షెడ్యూల్‌ను ICC వెల్లడించింది. గ్రూప్-Aలో ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉండగా గ్రూప్-Bలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. మొత్తం 23 మ్యాచులుంటాయి. ప్రతి జట్టు 4 గ్రూప్ మ్యాచ్‌లాడుతుంది. ఈ టోర్నీ OCT 3-OCT 20 మధ్య జరుగుతుంది. భారత్ OCT 4, OCT 6, OCT 9, OCT 13న ఆడుతుంది.