news

News August 26, 2024

కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి: ఒవైసీ

image

HYD బండ్లగూడ‌లోని ఫాతిమా ఒవైసీ కాలేజీని ‘హైడ్రా’ కూల్చివేస్తుందన్న వార్తల నేపథ్యంలో MIM MLA అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ‘పేదలకు ఉచిత విద్యనందించేందుకు 12 బిల్డింగ్‌లు నిర్మించా. కొందరు వీటిపై వక్రదృష్టి పెట్టారు. గతంలో నాపై కాల్పులు జరిగాయి. కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. కత్తులతో దాడి చేయండి. కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి’ అని భావోద్వేగ ప్రసంగం చేశారు.

News August 26, 2024

పా.రంజిత్ డైరెక్షన్‌లో సూర్య మూవీ?

image

పా.రంజిత్-సూర్య కాంబినేషన్‌లో ‘జర్మన్’ అనే మూవీకి కొన్నేళ్ల కిందట ప్లాన్ జరిగినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఓ భారీ బడ్జెట్ చిత్రం కోసం డైరెక్టర్‌తో నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా సూర్యతోనే ఉండనుందని కోలీవుడ్ టాక్. ఇటీవల తంగలాన్‌తో రంజిత్ మెప్పించగా, ‘కంగువా’తో సూర్య అక్టోబర్‌లో సందడి చేయనున్నారు.

News August 26, 2024

నిమ్స్‌లో గురక సమస్యకు ట్రీట్‌మెంట్

image

గురక సమస్యకు చికిత్స అందించేందుకు HYD నిమ్స్‌లో ప్రత్యేక ల్యాబ్‌ సిద్ధమవుతోంది. ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే నాలుగో వంతు ఖర్చుతోనే ఈ సేవలందిస్తామని డైరెక్టర్ డా.బీరప్ప తెలిపారు. అధిక బరువు, ధూమపానం, మద్యపానం అలవాట్లు, శ్వాస నాళాల్లో అడ్డంకులు గురకకు దారి తీస్తాయి. దీనివల్ల కొన్నిసార్లు మెదడుకు ఆక్సిజన్ ఆగిపోయి పక్షవాతం వచ్చే ముప్పు ఉంటుంది. ల్యాబ్‌లో బాధితులపై అధ్యయనం చేసి, చికిత్స అందిస్తారు.

News August 26, 2024

నేటి నుంచే యూఎస్ ఓపెన్

image

బిగ్గెస్ట్ టెన్నిస్ టోర్నీల్లో ఒకటైన యూఎస్ ఓపెన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. పురుషుల సింగిల్స్‌లో పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ విన్నర్ జకోవిచ్ ఫేవరెట్‌గా ఉండగా అల్కరాజ్, సినర్ వంటి స్టార్లు బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్, స్వైటెక్, సబలెంక బరిలో ఉన్నారు. 25వ టైటిల్‌పై కన్నేసిన జకోవిచ్ ఇది గెలిస్తే అత్యధిక గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించనున్నారు.

News August 26, 2024

కృష్ణం వందే జగద్గురుమ్

image

శ్రావణ మాసం కృష్ణ పక్షంలో అష్టమిని పురస్కరించుకుని ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు. అష్టమి తిథి నాడు కృష్ణుడు మథురలో జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఇవాళ దేశ వ్యాప్తంగా గోకులాష్టమి నిర్వహణకు ప్రజలు సిద్ధం అయ్యారు. కృష్ణుడి బాల రూపాన్ని పూజించడంతో పాటు ఉపవాసం ఉంటారు. దీని ద్వారా జీవితంలో దు:ఖాల నుంచి విముక్తి లభిస్తుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

News August 26, 2024

నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు

image

TG: రాష్ట్రంలో పలు జిల్లాల్లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్‌లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్లలోని నేరెళ్లలో 4.4 cm, వరంగల్(D) సంగెం, కరీంనగర్(D) తిమ్మాపూర్‌లో 4.2 cmల చొప్పున వర్షపాతం నమోదైంది.

News August 26, 2024

ఇవాళ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ప్రభుత్వం ఇవాళ పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ప్రభుత్వ స్కూళ్లు సెలవు ప్రకటించగా, కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం సెలవు ఇవ్వలేదు. దీంతో ఆయా స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. అటు పండుగను పురస్కరించుకుని ఏపీలో ఇవాళ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాలను సైతం కలెక్టర్లు రద్దు చేశారు.

News August 26, 2024

నేటి నుంచి విశాఖలో ‘అగ్నివీర్’ ర్యాలీ

image

AP: విశాఖ పోర్టు స్టేడియంలో నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన యువత పాల్గొనవచ్చు. నిన్న రాత్రే భారీగా నిరుద్యోగులు స్టేడియానికి చేరుకున్నారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ పోస్టులకు టెన్త్, ట్రేడ్స్‌మెన్ పోస్టులకు 8వ తరగతి చదివినవారు అర్హులు.

News August 26, 2024

PHOTO: వరల్డ్‌కప్ వినాయకుడు వచ్చేశాడు

image

మన దేశంలో ఏడాదిలో జరిగిన అద్భుతమైన ఘటనలతో వినాయకులను తయారు చేసి అభిమానాన్ని చాటుకోవడం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ ఏడాది టీ20WCను భారత జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ముంబైలో కొందరు భక్తులు టీ20 వరల్డ్‌కప్ థీమ్‌తో గణేశుడిని రూపొందించారు. ట్రోఫీని మూషికుడు ఎత్తుకోగా గణేశుడి చేతిలో జెండాతో ఉన్న విగ్రహం వైరలవుతోంది. ఈ విగ్రహాన్ని ముంబై నగరంలో వినాయకచవితి రోజున ప్రతిష్ఠించనున్నట్లు సమాచారం.

News August 26, 2024

రేపటి నుంచి రుణమాఫీ కాని వారి వివరాల సేకరణ

image

TG: అర్హులై రుణమాఫీ కాని రైతుల వివరాల నమోదుకు ‘రైతుభరోసా పంట రుణ మాఫీ యాప్’ను ప్రభుత్వం తీసుకొచ్చింది. రేపటి నుంచి వారి వివరాలను నమోదు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. రూ.2లక్షల లోపు మాఫీ కాని వారి రుణఖాతాలు, ఆధార్ కార్డు తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలను యాప్‌లో అప్లోడ్ చేయాలంది. కాగా రూ.2 లక్షలు దాటిన వారి విషయంలో రుణమాఫీ ఎప్పుడు చేస్తామనేది ప్రభుత్వం వెల్లడించలేదు.