news

News August 23, 2024

కేసీఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది: పొంగులేటి

image

TG: గత పదేళ్లలో రూ.11వేల కోట్లు కూడా మాఫీ చేయని BRSకు రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రెండుసార్లు రైతులను మోసం చేసిందని ఆరోపించారు. తాము అలా కాదని, అర్హులైన అందరికీ రుణాలు మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. రూ.2లక్షల పైన రుణం ఉన్నవారు ఆపై మొత్తాన్ని చెల్లిస్తే రూ.2లక్షలు మాఫీ చేస్తామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.

News August 23, 2024

రూ.120 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కొన్న హీరో?

image

తమిళ స్టార్ హీరో సూర్య ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. డసాల్ట్ ఫాల్కన్ కంపెనీకి చెందిన అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ విమానం ధర రూ.120 కోట్లు ఉంటుందని పేర్కొన్నాయి. తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే నయనతార, రజినీకాంత్, విజయ్ సొంత విమానాన్ని కలిగి ఉండగా, ఇప్పుడు ఆ జాబితాలో సూర్య చేరారు. సూర్య ప్రస్తుతం ‘కంగువా’ సినిమాలో నటిస్తున్నారు.

News August 23, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫీచర్

image

యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ ‘ప్రొఫైల్ సాంగ్’ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. యూజర్లు తమ ప్రొఫైల్ పిక్‌కు మూడ్‌ను బట్టి పాట యాడ్ చేసుకోవచ్చు. అందుకోసం కొన్ని లైసెన్స్‌డ్ సాంగ్స్‌ను అందుబాటులో ఉంచింది. కొత్త సాంగ్ మార్చేవరకు పాతది అలాగే ఉంటుంది. ఇన్‌స్టాలో ఎడిట్ ప్రొఫైల్‌పై క్లిక్ చేసి ‘యాడ్ మ్యూజిక్ టు యువర్ ప్రొఫైల్’ను ఎంచుకోవాలి. నచ్చిన పాటను 30 సెకన్లపాటు సెట్ చేసుకోవచ్చు.

News August 23, 2024

ఈసారైనా కొలిక్కి వచ్చేనా?

image

కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతోంది. కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నారు. ఆయా అంశాలపై ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తుది నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది. ఈసారైనా చర్చలు కొలిక్కి వస్తాయేమో చూడాలి.

News August 23, 2024

పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్

image

AP: వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో ఆయన అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.

News August 23, 2024

సురేశ్ గోపీ సినిమాల జాబితాను పక్కన పడేసిన అమిత్ షా

image

తాను అంగీకరించిన సినిమాల జాబితాను ఇస్తే అమిత్ షా అవతల పడేశారని కేంద్ర మంత్రి, త్రిసూర్ ఎంపీ సురేశ్ గోపీ అన్నారు. సినిమా తనకు ప్యాషన్ అని, నటించకపోతే చచ్చిపోతానని పేర్కొన్నారు. ఒట్టక్కొంబన్ చిత్రంలో నటించేందుకు అనుమతి ఇంకా రాలేదన్నారు. ‘ఎన్ని సినిమాలు పెండింగ్ ఉన్నాయని అడిగితే 20-22 అని అమిత్‌షాకు చెప్పా. ఆ పేపర్‌ను ఆయన పడేశారు. ఏదేమైనా పార్టీ నాయకత్వానికి విధేయుడిగా ఉండాల్సిందే’ అని ఆయన అన్నారు.

News August 23, 2024

భారీ వర్షం

image

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండ కొట్టగా కొద్దిసేపటి క్రితం వర్షం మొదలైంది. కొండాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, ఫిల్మ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. మీ ప్రాంతంలోనూ వర్షం కురుస్తోందా? కామెంట్ చేయండి.

News August 23, 2024

మీ ఫోన్ అమ్మేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి!

image

సైబర్ <<13909413>>మోసాల<<>> దృష్ట్యా పాత ఫోన్‌ను అమ్మేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఫోన్‌లోని డేటాను బ్యాకప్ చేయాలి. తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ ద్వారా ఫోన్ నుంచి డేటాను డిలీట్ చేయాలి.
* అన్ని అకౌంట్ల నుంచి ఫోన్‌ను డీరిజిస్టర్ చేయాలి. గూగుల్ అకౌంట్‌ను రిమూవ్ చేయాలి.
* అపరిచితులకు ఫోన్ అమ్మవద్దు. నేరుగా సంప్రదించాకే విక్రయించాలి. వారి అడ్రస్ ప్రూఫ్, ఫొటో, ఫోన్ వారికి అమ్మినట్లుగా సంతకం తీసుకోవాలి.

News August 23, 2024

కోల్‌కతా హత్యాచార ఘటన: నిందితుడికి మరో 14 రోజుల కస్టడీ

image

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో లేడీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడ్డ సంజయ్ రాయ్‌ని కోర్టు కస్టడీకి పంపింది. అదనపు చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు నిందితుడికి మరో 14 రోజుల కస్టడీ విధించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో న్యాయం కోరుతూ 11 రోజులుగా విధులు బహిష్కరించి నిరసన చేస్తున్న స్థానిక వైద్యులు ఈరోజు తిరిగి విధుల్లోకి చేరడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు.

News August 23, 2024

అచ్యుతాపురం సెజ్ ఘటన.. డీజీపీ, సీఎస్‌కు NHRC నోటీసులు

image

AP: అచ్యుతాపురం సెజ్ <<13912550>>ఘటనను<<>> జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. డీజీపీ, చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. ఘటనపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎఫ్ఐఆర్ స్టేటస్ రిపోర్టును అడిగింది. గాయపడిన వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీసింది.